మూత్రబిందువుల నుండి పరిశుభ్రత వహించండి,ఎందుకంటే సమాధిలో జరిగే శిక్షలకు ప్రధానంగా ఇదే కారణమవుతుంది.

మూత్రబిందువుల నుండి పరిశుభ్రత వహించండి,ఎందుకంటే సమాధిలో జరిగే శిక్షలకు ప్రధానంగా ఇదే కారణమవుతుంది.

అబూ హురైర రజియల్లాహు అన్హు మర్ఫూ ఉల్లేఖనం:మూత్రబిందువుల నుండి పరిశుభ్రత వహించండి,ఎందుకంటే సమాధిలో జరిగే శిక్షలకు ప్రధానంగా ఇదే కారణమవుతుంది.

[దృఢమైనది] [దానిని దారు ఖుత్నీ ఉల్లేఖించారు]

الشرح

మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ మనకు ఈ హదీసులో సమాధి శిక్షలకు గురయ్యే కారణాల్లో ఒకదానిని తెలియజేశారు.ఇది సర్వసాధారణంగా జరుగుతుంది,తస్మాత్ !అది మూత్ర విసర్జన క్రమంలో పరిశుభ్రతను మరియు స్వచ్ఛతను పాటించకపోవడం.

فوائد الحديث

పరిశుభ్రత పట్ల జాగ్రత్త వహిస్తూ మూత్రబిందువులనుండి దూరంగా ఉండాలి,అది శరీరానికి,దుస్తులకు అంటకుండా చూసుకోవాలి.

అది అంటిన తరువాత దానిని శుభ్రపర్చుకోవడం మరియు స్వచ్ఛతపొందటం ఉత్తమం,ఎందుకంటే అశుద్ధతతో ఉండకూడదు, దానిని నమాజు చదివే ముందు తొలగించడము వాజిబు బాధ్యత.

ఆ మూత్రం అశుద్ధమైనది,అది అతనికి శరీరం, వస్త్రం లేదా ఇంకెక్కడైనా అంటినట్లైతే అపవిత్రమవుతుంది;కాబట్టి నమాజ్ చెల్లదు;ఎందుకంటే అశుద్ధత నుండి స్వచ్ఛతపొందటం నమాజు షరతుల్లోఒకటి.

మూత్రం నుంచి శుభ్రతను పాటించకపోవడం మహాపాపాల్లో ఒకటి.

సమాధి శిక్ష నిరూపించబడింది,ఖుర్ఆన్ సున్నత్ మరియు ఇజ్మా ద్వారా దీని రుజువుచేయబడింది

పరలోకం లో ప్రతిఫలం లభిస్తుందనడాన్ని సాక్ష్యపరుస్తుంది,పరలోక ప్రస్తానానికి సమాధి మొదటి మెట్టు,సమాధి:స్వర్గ బృందావనాల్లో ఒక బృందావనం లేదా నరక గోతుల్లో ఒక గొయ్యి.

التصنيفات

కాలకృత్య పద్దతులు