కాలకృత్య పద్దతులు

కాలకృత్య పద్దతులు

2- “మీలో ఎవరైనా, ఎప్పుడైనా వుజూ చేసినపుడు అతడు ముక్కులోనికి నీరు ఎక్కించి, శుభ్రంగా చీదివేయాలి; కాలకృత్యాలు తీర్చుకొనునపుడు ఎవరైనా తన జననేంద్రియాలను చిన్నచిన్న రాళ్లతో శుభ్రపరుచు కునేట్లయితే అతడు బేసి సంఖ్యలో వాటిని ఉపయోగించాలి*; మీలో ఎవరైనా తన నిద్ర నుండి లేచినపుడు, వుదూ చేయుట కొరకు నీటి పాత్రలో చేతులు పెట్టడానికి ముందు, తన చేతులను కడుగుకోవాలి, ఎందుకంటే మీలో ఎవరికీ తెలియదు తన చేతులు రాత్రి ఎక్కడ గడిపాయో”; సహీహ్ ముస్లింలో ఈ పదాలున్నాయి: “మీలో ఎవరైనా తమ నిద్ర నుండి లేచినపుడు, చేతులను మూడు సార్లు కడుక్కోనంత వరకు, (వుజూ కొరకు) నీటి పాత్రలో చేతులను పెట్టకండి, ఎందుకంటే అతడికి తెలియదు తన చేయి రాత్రి ఎక్కడ గడిపిందో”.

3- “మీరు కాలకృత్యములు తీర్చుకొనుటకు ఏదైనా ప్రదేశానికి (మరుగుదొడ్డికి) వెళ్ళినట్లయితే మీరు ఖిబ్లాహ్ వైపునకు మీ ముఖాన్ని గానీ లేక వీపును గానీ చేయకండి; తూర్పు వైపునకు గానీ లేదా పడమర వైపునకు గానీ చేయండి”*. అబూ అయ్యూబ్ అన్సారీ రజియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు: “మేము షామ్ (సిరియా) దేశానికి వెళ్ళినపుడు అక్కడ మరుగుదొడ్లు ఖిబ్లహ్ వైపునకు ముఖం చేసి నిర్మించబడి ఉన్నాయి. మేము వాటిపై మా దిశను మార్చుకుని కూర్చుని కాలకృత్యాలు తీర్చుకునేవారము, తరువాత అల్లాహ్’ను క్షమాపణ కోరుకునేవారము.”