“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గోప్యస్థలము (బహిర్భూమి, మరుగుదొడ్డి) నుండి బయటకు వచ్చినపుడు ఇలా అనేవారు…

“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గోప్యస్థలము (బహిర్భూమి, మరుగుదొడ్డి) నుండి బయటకు వచ్చినపుడు ఇలా అనేవారు “గుఫ్రానక” (ఓ అల్లాహ్! నాకు నీ క్షమాపణ ప్రసాదించు).”

ఆయిషా, విశ్వాసుల మాతృమూర్తి, (రదియల్లాహు అన్హా) ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గోప్యస్థలము (బహిర్భూమి, మరుగుదొడ్డి) నుండి బయటకు వచ్చినపుడు ఇలా అనేవారు “గుఫ్రానక” (ఓ అల్లాహ్! నాకు నీ క్షమాపణ ప్రసాదించు).”

[దృఢమైనది] [رواه أبو داود والترمذي وابن ماجه وأحمد]

الشرح

మరుగుదొడ్డి నుండి బయటకు వచ్చినపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “గుఫ్రానక” (ఓ అల్లాహ్ నేను నీ క్షమాపణ కోరుతున్నాను) అని పలికేవారు.

فوائد الحديث

మరుగుదొడ్డి నుండి బయటకు వచ్చిన తరువాత “గుఫ్రానక” అని పలుకుట అభిలషణీయము.

అన్ని సందర్భాలలోనూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రభువుతో క్షమాపణ కోరుకునేవారు.

తనను తాను ఉపశమన పరుచుకున్న తర్వాత క్షమాపణ అడగడానికి గల కారణం గురించి ఇలా చెప్పబడింది:

హానికరమైనవి బయటకు రావడాన్ని సులభతరం చేయడంతో సహా అనేక ఆశీర్వాదాల కోసం నీకు (అల్లాహ్‌కు) కృతజ్ఞతలు చెప్పుకోవడంలో జరిగే లోపం నుండి నేను నీ క్షమాపణ కోరుతున్నాను, మరియు నేను ఉపశమనం పొందే సమయంలో నిన్ను స్మరించుకోకుండా పరధ్యానంలో ఉన్నందుకుగానూ నిన్ను క్షమించమని వేడుకుంటున్నాను.

التصنيفات

కాలకృత్య పద్దతులు