“మీరు కాలకృత్యములు తీర్చుకొనుటకు ఏదైనా ప్రదేశానికి (మరుగుదొడ్డికి) వెళ్ళినట్లయితే మీరు ఖిబ్లాహ్ వైపునకు మీ…

“మీరు కాలకృత్యములు తీర్చుకొనుటకు ఏదైనా ప్రదేశానికి (మరుగుదొడ్డికి) వెళ్ళినట్లయితే మీరు ఖిబ్లాహ్ వైపునకు మీ ముఖాన్ని గానీ లేక వీపును గానీ చేయకండి; తూర్పు వైపునకు గానీ లేదా పడమర వైపునకు గానీ చేయండి”

అబూ అయూబ్ అల్ అన్సారీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీరు కాలకృత్యములు తీర్చుకొనుటకు ఏదైనా ప్రదేశానికి (మరుగుదొడ్డికి) వెళ్ళినట్లయితే మీరు ఖిబ్లాహ్ వైపునకు మీ ముఖాన్ని గానీ లేక వీపును గానీ చేయకండి; తూర్పు వైపునకు గానీ లేదా పడమర వైపునకు గానీ చేయండి”. అబూ అయ్యూబ్ అన్సారీ రజియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు: “మేము షామ్ (సిరియా) దేశానికి వెళ్ళినపుడు అక్కడ మరుగుదొడ్లు ఖిబ్లహ్ వైపునకు ముఖం చేసి నిర్మించబడి ఉన్నాయి. మేము వాటిపై మా దిశను మార్చుకుని కూర్చుని కాలకృత్యాలు తీర్చుకునేవారము, తరువాత అల్లాహ్’ను క్షమాపణ కోరుకునేవారము.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

మలవిసర్జన ద్వారా గానీ లేక మూత్రవిసర్జన ద్వారా గానీ ఎవరు కాల కృత్యాలు తీర్చుకోవాలి అనుకున్నా, ఖిబ్లహ్ వైపునకు – అంటే కాబా గృహం ఉన్న వైపునకు – ముఖం చేయరాదని, లేక ఖిబ్లహ్ తన వెనుక ఉండేలా దాని వైపునకు వీపు కూడా చేయరాదని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించినారు. అలా కాక మదీనా వారికి లాగా ఖిబ్లహ్ ఉన్నట్లయితే వారు తూర్పు వైపునకు గానీ లేక పడమర వైపునకు గానీ తిరిగి కాలకృత్యాలు తీర్చుకోవాలి. (మదీనా వాసులకు ఖిబ్లహ్ దక్షిణం వైపునకు ఉంటుంది). అబూ అయ్యూబ్ అల్ అన్సారీ రజియల్లాహు అన్హు ఇంకా ఇలా తెలియజేసినారు – తాము అష్’షాం దేశానికి వెళ్ళినపుడు అక్కడ మరుగుదొడ్లు కాబా గృహం వైపునకు ముఖం చేసి నిర్మించబడి ఉన్నాయి. వాళ్ళు తమ దిశను మార్చుకుని వాటిపై కూర్చుని కాలకృత్యాలు తీర్చుకునేవారు. అయినప్పటికీ వారు అల్లాహ్’ను క్షమాభిక్ష కోరుకునేవారు.

فوائد الحديث

పవిత్ర కాబా ఘనతను కీర్తించడం మరియు గౌరవించడం దీని వెనుక ఉన్న వివేకం.

కాలకృత్యాలు తీర్చుకున్న ప్రదేశాన్ని విడిచిపెట్టిన తర్వాత అల్లాహ్ యొక్క క్షమాపణ కోరడం ఇందులో చూడవచ్చు.

ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం వారి ఉత్తమ బోధన విధానం కనిపిస్తుంది, ఎందుకంటే ఆయన నిషేధించబడిన వాటిని ప్రస్తావించి, అనుమతించబడిన వాటి వైపునకు మార్గనిర్దేశం చేశారు.

التصنيفات

మాలీన్యములను తొలగించటం, కాలకృత్య పద్దతులు