కాలకృత్యములు తీర్చుకొనుటకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరుగుదొడ్డిలోనికి ప్రవేశించడానికి ముందు ఈ…

కాలకృత్యములు తీర్చుకొనుటకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరుగుదొడ్డిలోనికి ప్రవేశించడానికి ముందు ఈ విధంగా పలికేవారు: “అల్లాహుమ్మ, ఇన్నీ అఊజుబిక మినల్ ఖుబుసి, వల్ ఖబాఇసి” (ఓ అల్లాహ్ దుష్టత్వానికి పాల్బడే ఆడ మరియు మగ శక్తులనుండి (ఆడ మరియు మగ షైతానుల నుండి) నీ రక్షణ కోరుతున్నాను)

అనస్ ఇబ్న్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : కాలకృత్యములు తీర్చుకొనుటకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరుగుదొడ్డిలోనికి ప్రవేశించడానికి ముందు ఈ విధంగా పలికేవారు: “అల్లాహుమ్మ, ఇన్నీ అఊజుబిక మినల్ ఖుబుసి, వల్ ఖబాఇసి” (ఓ అల్లాహ్ దుష్టత్వానికి పాల్బడే ఆడ మరియు మగ శక్తులనుండి (ఆడ మరియు మగ షైతానుల నుండి) నీ రక్షణ కోరుతున్నాను).

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

మూత్ర విసర్జన కొరకు గానీ, లేక మల విసర్జన కొరకు గానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైన నియమిత ప్రదేశములో (మరుగుదొడ్డి, లేక బహిర్భూమిలో) ప్రవేశించడానికి సంకల్పించినట్లయితే ముందుగా (అల్లాహ్ వద్ద) ఆడ మరియు మగ షైతానుల నుండి అల్లాహ్ యొక్క సంరక్షణ కోరేవారు. అపకారము మరియు హాని కలుగజేసే “అల్-ఖుబుసి” మరియు “అల్-ఖబాఇసి” లను కూడా దుర్మార్గమైనవిగానూ మరియు మలినమైనవిగానూ వ్యాఖ్యానించడం జరిగింది.

فوائد الحديث

ఈ దుఆ మరుగుదొడ్డి అంటే బాత్రూమ్ లోనికి ప్రవేశించడానికి ముందు ఉచ్ఛరించ వలెనని ఉపదేశించడం జరిగింది.

సృష్టిలోని ప్రతి ప్రాణి, ప్రతి జీవి కూడా తానున్న ఏ పరిస్థితిలోనైనా తనకు కలిగే హాని లేక కీడు నుండి రక్షణ కొరకు తన ప్రభువు పై ఆధారపడవలసిదే.

التصنيفات

కాలకృత్య పద్దతులు