“మీలో ఎవరు కూడా మూత్రవిసర్జన చేయునపుడు పురుషాంగాన్ని కుడి చేతితో పట్టుకోకండి, మలవిసర్జన తరువాత శుభ్ర…

“మీలో ఎవరు కూడా మూత్రవిసర్జన చేయునపుడు పురుషాంగాన్ని కుడి చేతితో పట్టుకోకండి, మలవిసర్జన తరువాత శుభ్ర పరుచుకోవడానికి కుడి చేతిని ఉపయోగించకండి, అలాగే (ఆహారపు లేదా నీటి) పాత్ర లోనికి ఊదకండి.”

అబూ ఖతాదహ్ అల్ అన్సారీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవరు కూడా మూత్రవిసర్జన చేయునపుడు పురుషాంగాన్ని కుడి చేతితో పట్టుకోకండి, మలవిసర్జన తరువాత శుభ్ర పరుచుకోవడానికి కుడి చేతిని ఉపయోగించకండి, అలాగే (ఆహారపు లేదా నీటి) పాత్ర లోనికి ఊదకండి.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొన్ని తీరుతెన్నులను, విధివిధానాలను వివరిస్తున్నారు. మూత్రవిసర్జన చేయునపుడు పురుషాంగాన్ని కుడిచేతితో పట్టుకొనరాదు అని నిషేధించినారు, కాలకృత్యములు తీర్చుకున్న తరువాత యోనిని గానీ లేక గుదమును గానీ కుడి చేతితో శుభ్రపరుచు కొనరాదు అని నిషేధించినారు; ఎందుకంటే కుడి చేయి మంచి పనులు చేయుట కొరకు తయారు చేయబడినది. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ఏ వ్యక్తి అయినా తాను ఏ పాత్ర నుంచి అయితే నీళ్ళు త్రాగుచున్నాడో, ఆ పాత్రలోనికి నోటితో ఉదరాదు అని నిషేధించినారు.

فوائد الحديث

ఇందులో ఆచరణల విధివిధానాల పట్ల మరియు పరిశుభ్రత పట్ల ఇస్లాం ప్రాధాన్యత వివరించబడింది.

మలినముల నుండి (మలిన పదార్ధాల నుండి) దూరంగా ఉండాలి, ఒకవేళ వాటిని తప్పనిసరిగా ముట్టుకోవలసిన పరిస్థితి వస్తే ఎడమ చేతిని ఉపయోగించాలి.

ఇందులో కుడి భాగము (కుడి చేయి, కుడి కాలు, కుడి వైపు మొ.) యొక్క ప్రాధాన్యత, గౌరవము; ఎడమ భాగము పై దాని ఘనత వివరించబడింది.

అలాగే ఇందులో ఇస్లామీయ షరియత్ యొక్క పరిపూర్ణత మరియు దాని బోధనల సమగ్రత తెలియుచున్నది.

التصنيفات

తినే మరియు త్రాగే పద్దతులు, కాలకృత్య పద్దతులు