إعدادات العرض
“ఖుర్ఆన్ పఠించండి, ఎందుకంటే పునరుత్థాన దినాన అది దానిని పఠించేవారికి మధ్యవర్తిగా వస్తుంది
“ఖుర్ఆన్ పఠించండి, ఎందుకంటే పునరుత్థాన దినాన అది దానిని పఠించేవారికి మధ్యవర్తిగా వస్తుంది
అబూ ఉమామహ్ అల్ బాహిలీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “ఖుర్ఆన్ పఠించండి, ఎందుకంటే పునరుత్థాన దినాన అది దానిని పఠించేవారికి మధ్యవర్తిగా వస్తుంది. “జహ్’రావైన్”లను (రెండు ప్రకాశవంతమైన వాటిని), అంటే “సూరతుల్-బఖరహ్ మరియు సూరతుల్-ఆలి ఇమ్రాన్” లను పఠించండి. ఎందుకంటే తీర్పు దినమున అవి రెండు మేఘాలుగా లేదా రెండు ఘనమైన ఛాయలుగా లేదా రెండు పక్షుల గుపులుగా వచ్చి వాటిని పఠించే వారి కోసం వేడుకుంటాయి. సూరతుల్-బఖరహ్ పఠించండి, ఎందుకంటే దానిని ఆశ్రయించడం ఒక వరం మరియు దానిని వదులుకోవడం దుఃఖానికి కారణం; మరియు మాంత్రికులు, జాదూ చేసేవారు దానిని ఎదుర్కోలేరు.”
الترجمة
العربية Bosanski English فارسی Français Русский اردو 中文 हिन्दी Indonesia Hausa Kurdî Tiếng Việt Magyar ქართული සිංහල Kiswahili Română অসমীয়া ไทย Português मराठी دری አማርኛ বাংলা ភាសាខ្មែរ Nederlands ગુજરાતી Македонски ਪੰਜਾਬੀ Tagalog മലയാളം ಕನ್ನಡالشرح
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీథులో: ఖుర్ఆన్ పఠనాన్ని స్థిరంగా కొనసాగించమని మనకు హితబోధ చేస్తున్నారు. ఎందుకంటే తీర్పు దినమున అది తనను పఠించే మరియు పఠించిన దానిపై ఆచరించే వారి కొరకు మధ్యవర్తిగా వస్తుంది. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూరతుల్ బఖరహ్ మరియు సూరతుల్-ఆలి ఇమ్రాన్’లను, వాటిలోని వెలుగు మరియు మార్గదర్శకత్వం కారణంగా, వాటిని “జహ్’రావైన్”లు (రెండు ప్రకాశవంతమైనవి) అని పేర్కొంటూ వాటిని పఠించమని నొక్కి చెప్పినారు; వాటిని పఠించడం, వాటి అర్థాలపట్ల లోతుగా ఆలోచించడం, అవగాహన కలిగి ఉండడం మరియు వాటిలో చెప్పబడిన దానిపై ఆచరించడం వల్ల కలిగే ప్రతిఫలం అవి పునరుత్థాన దినమున రెండు మేఘాల మాదిరిగా లేదా రెండు ఘనమైన ఛాయల మాదిరిగా లేదా తమ రెక్కలను పూర్తిగా విస్తరించి, వాటిని ఒకదానితో ఒకటి అనుసంధానం చేసుకుని, దట్టమైన నీడ లాగా తమను పారాయణం చేసే వారికి రక్షణ కల్పిస్తూ వచ్చే రెండు పక్షుల గుంపుల మాదిరిగా వస్తాయని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూరతుల్-బఖరహ్ పఠనం కొనసాగించడం, దాని అర్థాలపై లోతుగా ఆలోచించడం, చింతన చేయడం మరియు దానిలోని విషయాలను అమలు చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు; అలా చేయడం వల్ల ఇహలోకంలో మరియు పరలోకంలో గొప్ప ఆశీర్వాదాలు మరియు ప్రయోజనాలు లభిస్తాయి. దీనిని వదిలివేయడం వల్ల పునరుత్థాన దినాన విచారం మరియు పశ్చాత్తాపం కలుగుతాయి. ఈ సూరహ్ యొక్క సుగుణాలలో ఒకటి మాంత్రికులు, చేతబడి లేదా జాదూ చేయువారు దీనిని పఠించే వారికి హాని చేయలేరు.فوائد الحديث
ఇందులో ఖుర్ఆన్ ను తరచుగా పఠించాలనే ఆదేశం ఉన్నది; దానిని పఠించేవారు, దానిలోని మార్గదర్శకత్వాన్ని పాటించేవారు, ఖుర్’ఆన్ ఆజ్ఞాపించినట్లు ఆచరించేవారు మరియు అది నిషేధించిన వాటికి దూరంగా ఉండేవారు – వీరి కొరకు పునరుత్థాన దినమున ఖుర్’ఆన్ సిఫార్సు చేస్తుంది.
ఇందులో సూరతుల్ బఖరహ్ మరియు సూరతుల్ ఆలి ఇమ్రాన్ పఠనం యొక్క పుణ్యం మరియు వాటి గొప్ప ప్రతిఫలం, మరియు వాటి ఘనత వివరించబడినది.
అలాగే ఇందులో సూరతుల్ బఖరహ్ ను పఠిస్తూ ఉండడం యొక్క ఘనత, అది తనను పఠించే వారిని మాంత్రికులు, చేతబడి లేదా జాదూ చేయువారి నుండి రక్షిస్తుంది అని తెలుస్తున్నది.
