దివ్యఖుర్ఆన్ ప్రముఖ్యతలు

దివ్యఖుర్ఆన్ ప్రముఖ్యతలు

3- “రాచమార్గానికి (సిరాతల్ ముస్తఖీమ్’నకు) సంబంధించి అల్లాహ్ ఒక ఉపమానాన్ని ఇలా ఇచ్చినాడు*: “(ఒక రాచమార్గము), ఆ రాచమార్గానికి ఇరువైపులా రెండు ఎత్తైన గోడలు, ఆ గోడలలో పరదాలు వేయబడి ఉన్న అనేక తెరిచి ఉన్న ద్వారాలు, ఆ రాచమార్గపు ప్రవేశ ద్వారం వద్ద ఒక దాయీ (పిలిచేవాడు) ఇలా పిలుస్తూ ఉంటాడు: “ఓ ప్రజలారా! మీరందరూ ఆ మార్గములోనికి ప్రవేశించండి, సంకోచించకండి.” ఆ మార్గపు చివరన ఉండే దాయీ దానికి ఇరువైపులా ఉన్న ద్వారాలలో దేనినైనా తెరవాలని ప్రయత్నించే వానితో ఇలా అన్నాడు “నీ పాడుగాను! దానిని తెరువకు. ఒకవేళ తెరిస్తే నీవు దాని లోనికి వెళ్ళి పోతావు”. ఆ రాచమార్గము ఇస్లాం; ఆ రెండు గోడలు అల్లాహ్ విధించిన హద్దులు; మరియు ఆ చెరిచి ఉన్న ద్వారాలు అల్లాహ్ నిషేధాలు. ఆ రాచమార్గపు ప్రవేశ ద్వారం వద్ద ఉన్న దాయీ అల్లాహ్ యొక్క దివ్య గ్రంథము; మరియు మార్గపు చివరన ఉన్న దాయీ ప్రతి ముస్లిం హృదయములో ఉండే అల్లాహ్ యొక్క మందలింపు, హెచ్చరిక”.

4- “మీలో ఎవరైనా తాను తన కుటుంబము వద్దకు తిరిగి వచ్చినపుడు ఎదురుగా పెద్ద పెద్ద, బాగా బలిసిన మరియు గర్భముతో ఉన్న మూడు ఆడ ఒంటెలను చూడడానికి ఇష్టపడతారా?*” దానికి మేమందరమూ “అవును, ఇష్టపడతాము” అన్నాము. అపుడు ఆయన “నీవు సలహ్ లో (నమాజులో) పఠించే మూడు ఆయతులు పెద్ద పెద్ద, బాగా బలిసిన మరియు గర్భముతో ఉన్న మూడు ఆడ ఒంటెల కంటే నీ కొరకు శుభప్రదమైనవి” అన్నారు.