“ఎవరైనా అల్లాహ్ యొక్క గ్రంథము (ఖుర్’ఆన్) నుండి ఒక్క అక్షరం పఠించినా అతనికి ప్రతిఫలంగా ఒక పుణ్యము లభిస్తుంది.…

“ఎవరైనా అల్లాహ్ యొక్క గ్రంథము (ఖుర్’ఆన్) నుండి ఒక్క అక్షరం పఠించినా అతనికి ప్రతిఫలంగా ఒక పుణ్యము లభిస్తుంది. ప్రతి పుణ్యము తనను పోలిన పది పుణ్యాలను తీసుకు వస్తుంది

అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైనా అల్లాహ్ యొక్క గ్రంథము (ఖుర్’ఆన్) నుండి ఒక్క అక్షరం పఠించినా అతనికి ప్రతిఫలంగా ఒక పుణ్యము లభిస్తుంది. ప్రతి పుణ్యము తనను పోలిన పది పుణ్యాలను తీసుకు వస్తుంది. (కనుక) “అలిఫ్, లామ్, మీమ్” ను నేను ఒక అక్షరం అనడం లేదు. (అందులో) “అలిఫ్” ఒక అక్షరం, “లామ్” ఒక అక్షరం మరియు “మీమ్” ఒక అక్షరం.” (అంటే దివ్య ఖుర్’ఆన్ గ్రంథము నుండి ఎవరైనా “అలిఫ్, లామ్, మీమ్” అని పఠిస్తే వారికి ప్రతి అక్షరానికి పది పుణ్యాలు లభిస్తాయిఅని అర్థము).

[ప్రామాణికమైనది] [దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – అల్లాహ్ గ్రంథము (ఖుర్’ఆన్) నుండి ఒక్క అక్షరమైనా పఠించిన ప్రతి ముస్లిం ఒక (సత్కార్యాన్ని చేసిన) పుణ్యాన్ని పొందుతాడు, అంతేగాక అతనికి లభించిన ఆ ప్రతిఫలం పదింతలుగా ఎక్కువ చేయబడుతుంది – అని తెలియజేస్తున్నారు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీనిని ఇలా వివరించినారు (“అలిఫ్, లామ్, మీమ్” లను నేను ఒక అక్షరం అనడం లేదు. (అందులో) “అలిఫ్” ఒక అక్షరం, “లామ్” ఒక అక్షరం మరియు “మీమ్” ఒక అక్షరం.”) “అంటే ఇవి మూడు అక్షరాలు, వీటిలో ముప్ఫై పుణ్యాలున్నాయి”.

فوائد الحديث

ఇందులో దివ్య ఖుర్’ఆన్ ను తరుచూ పఠిస్తూ ఉండాలనే హితబోధ ఉన్నది.

ఎందుకంటే అతను పఠించే ప్రతి పదములోని ప్రతి అక్షరానికి అతను ఒక పుణ్యఫలాన్ని పొందుతాడు, అది (ఆ ప్రతిఫలం) పదింతలుగా ఎక్కువ చేయబడుతుంది.

అలాగే ఇందులో అల్లాహ్ యొక్క ఔదార్యము, ఆయన దాతృత్వము గురించి తెలుస్తున్నది. ఆయన తన దాసుల పట్ల తనకు గల కరుణతో వారి ఒక్క సత్కార్యానికి పదింతలు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.

అలాగే ఇందులో, మిగతా పదాలు మరియు ఆరాధనల కంటే, ఖుర్’ఆన్ లోని పదాలను పఠించడం ద్వారా చేయబడే ఆరాధన యొక్క యొక్క ఘనత తెలుస్తున్నది. ఎందుకంటే ఖుర్’ఆన్ అల్లాహ్ యొక్క వాక్కు గనుక.

التصنيفات

ఖుర్ఆన్ పట్ల శ్రద్ధ వహించటం యొక్క ప్రాముఖ్యత., దివ్యఖుర్ఆన్ ప్రముఖ్యతలు