“ఖుర్ఆన్ పారాయణంలో ప్రావీణ్యం కలిగిన వ్యక్తి, దైవదూతలలో గొప్పవారైన, ఉన్నతులైన మరియు విధేయులైన లేఖరుల…

“ఖుర్ఆన్ పారాయణంలో ప్రావీణ్యం కలిగిన వ్యక్తి, దైవదూతలలో గొప్పవారైన, ఉన్నతులైన మరియు విధేయులైన లేఖరుల సాంగత్యములో ఉంటాడు; మరియు ఎవరైతే ఖుర్ఆన్ ను తడబడుతూ, పారాయణం అతనికి కష్టంగా అనిపించినా ఖుర్ఆన్ పారాయణం చేసే వ్యక్తికి రెండు ప్రతిఫలాలు లభిస్తాయి.”

ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: “ఖుర్ఆన్ పారాయణంలో ప్రావీణ్యం కలిగిన వ్యక్తి, దైవదూతలలో గొప్పవారైన, ఉన్నతులైన మరియు విధేయులైన లేఖరుల సాంగత్యములో ఉంటాడు; మరియు ఎవరైతే ఖుర్ఆన్ ను తడబడుతూ, పారాయణం అతనికి కష్టంగా అనిపించినా ఖుర్ఆన్ పారాయణం చేసే వ్యక్తికి రెండు ప్రతిఫలాలు లభిస్తాయి.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: ఎవరైతే ఖుర్ఆన్ పఠనం చేసి, దానిని బాగా కంఠస్థం చేసి, దానిని పఠించడంలో ప్రావీణ్యత మరియు నైపుణ్యం సంపాదించిన వ్యక్తికి పరలోకంలో ప్రతిఫలం లభిస్తుంది, అతనికి గొప్ప హోదా లభిస్తుంది, మరియు అతడు సద్గుణవంతులైన దైవదూతలతో ఉంటాడు, అలాగే ఎవరైతే తన బలహీన ఙ్ఞాపక శక్తి కారణంగా ఖుర్ఆన్ ను సంకోచిస్తూ, తడబడుతూ, పఠిస్తాడో; అతనికి కష్టంగా ఉన్నప్పటికీ, దానిని పారాయణం చేస్తాడో, అతనికి రెండు బహుమతులు ఉన్నాయి. ఒకటి పారాయణం చేసినందుకు ప్రతిఫలం, రెండు దానిని పఠించడంలో అతని ప్రయత్నానికి, సంకోచానికి, తడబాటుకు ప్రతిఫలం.

فوائد الحديث

ఈ హదీథులో ఖుర్ఆన్ కంఠస్థం చేయమని, దానిపై పట్టు సాధించమని మరియు ప్రతిఫలం పొందడానికి దానిని తరచుగా పఠించమని ప్రజలను ప్రోత్సహించడం మరియు అలా చేసే వారి ఉన్నత స్థితిని వివరించడం చూస్తాము.

అల్ ఖాదీ ఇయాద్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “దీని అర్థం ఎవరైతే సంకోచిస్తూ, తడబడుతూ ఖుర్’ఆన్ పారాయణం చేస్తాడో, అతడు ఖుర్’ఆన్ పారాయణములో ప్రావీణ్యము కలిగిన వానికంటే గొప్ప బహుమతిని పొందుతాడు అని కాదు. నిజానికి ఖుర్’ఆన్ పారాయణములో ప్రావీణ్యము కలిగిన వ్యక్తే గొప్ప ప్రతిఫలాన్ని పొందుతాడు. ఎందుకంటే అతడు దైవదూతలలో (అల్లాహ్ ఆఙ్ఞలను వ్రాసే) లేఖరుల సాంగత్యములో ఉంటాడు; అటువంటి ఇంకా అనేకమైన గొప్ప బహుమానాలు పొందుతాడు. ఈ ఘనతలు ఇంకెవరి గురించీ పేర్కొనబడలేదు. అల్లాహ్ గ్రంథానికి తనను తాను అంకితం చేసుకొనని, దానిని కంఠస్థం చేయని, దానిపై ప్రావీణ్యం సంపాదించని, దానిని తరచుగా పఠించని, మరియు దానిలో ప్రావీణ్యం పొందే వరకు శ్రద్ధతో దానిని అధ్యయనం చేయని వ్యక్తి, ఇవన్నీ చేసిన వ్యక్తి కంటే ఎక్కువ ప్రతిఫలాన్ని ఎలా పొందగలడు?

షేఖ్ ఇబ్నె బాజ్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: "ఖుర్ఆన్ పారాయణం చేసి దానిలో ప్రావీణ్యం సంపాదించి, దానిని బాగా పఠించి, దానిని బాగా కంఠస్థం చేసేవాడు దైవదూతలలో గొప్ప మరియు నీతిమంతులైన లేఖరులతో ఉంటాడు." దీని అర్థం: దానిని పఠించడం మాత్రమే కాకుండా, అతని పఠనం మాటలలోనూ, చేతలలోనూ ప్రతిబింబిస్తూ, దానిని అద్భుతంగా పారాయణం చేస్తూ, మరియు దాని ప్రకారం నడుచుకుంటూ ఉన్నట్లైతే – అతడు దాని పదాలను మరియు వాటి అర్థాన్ని నెరవేరుస్తున్నాడు.

التصنيفات

ఖుర్ఆన్ పట్ల శ్రద్ధ వహించటం యొక్క ప్రాముఖ్యత., దివ్యఖుర్ఆన్ ప్రముఖ్యతలు