“మీలో ఎవరైనా తాను తన కుటుంబము వద్దకు తిరిగి వచ్చినపుడు ఎదురుగా పెద్ద పెద్ద, బాగా బలిసిన మరియు గర్భముతో ఉన్న…

“మీలో ఎవరైనా తాను తన కుటుంబము వద్దకు తిరిగి వచ్చినపుడు ఎదురుగా పెద్ద పెద్ద, బాగా బలిసిన మరియు గర్భముతో ఉన్న మూడు ఆడ ఒంటెలను చూడడానికి ఇష్టపడతారా?

అబీ హురైరహ్ రజీయల్లాహు అన్హు ఉల్లేఖనం: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవరైనా తాను తన కుటుంబము వద్దకు తిరిగి వచ్చినపుడు ఎదురుగా పెద్ద పెద్ద, బాగా బలిసిన మరియు గర్భముతో ఉన్న మూడు ఆడ ఒంటెలను చూడడానికి ఇష్టపడతారా?” దానికి మేమందరమూ “అవును, ఇష్టపడతాము” అన్నాము. అపుడు ఆయన “నీవు సలహ్ లో (నమాజులో) పఠించే మూడు ఆయతులు పెద్ద పెద్ద, బాగా బలిసిన మరియు గర్భముతో ఉన్న మూడు ఆడ ఒంటెల కంటే నీ కొరకు శుభప్రదమైనవి” అన్నారు.

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సలాహ్ లో (ఖుర్ఆన్ నుండి కనీసం) మూడు ఆయతులను పఠించడం యొక్క ఘనతను మరియు దాని ప్రతిఫలాన్ని గురించి తెలియజేస్తున్నారు – అది పెద్ద పెద్ద, బాగా బలిసిన మరియు గర్భముతో ఉన్న మూడు ఆడ ఒంటెల కంటే కూడా మేలైనది.

فوائد الحديث

ఈ హదీసులో సలాహ్ (నమాజు) లలో ఖుర్ఆన్ పారాయణం యొక్క ఘనతను గురించి చెప్పబడుచున్నది.

మంచిపనులు (సత్కార్యాలు) చేయుట అనేది ఉత్తమమైనది, శుభప్రదమైనది మరియు ఎక్కువ శాశ్వతమైనది – (ఏదో ఒకనాడు) నాశనమయ్యే ఈ ప్రాపంచిక సౌఖ్యాలకన్నా.

ఈ ప్రతిఫలం మూడు ఆయతులను పఠించడానికే పరిమితం కాదు. తన

సలాహ్ (నమాజు)లలో భక్తుడు ఎన్ని ఎక్కువ ఆయతులను పఠిస్తే అన్ని ఒంటెల కంటే ఎక్కువ శుభాలను, ప్రతిఫలాన్ని పొందుతాడు.

التصنيفات

దివ్యఖుర్ఆన్ ప్రముఖ్యతలు, దివ్యఖుర్ఆన్ ప్రముఖ్యతలు