“రాచమార్గానికి (సిరాతల్ ముస్తఖీమ్’నకు) సంబంధించి అల్లాహ్ ఒక ఉపమానాన్ని ఇలా ఇచ్చినాడు

“రాచమార్గానికి (సిరాతల్ ముస్తఖీమ్’నకు) సంబంధించి అల్లాహ్ ఒక ఉపమానాన్ని ఇలా ఇచ్చినాడు

నవాస్ ఇబ్న్ సమ్ఆన్ అల్ అన్సారీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “రాచమార్గానికి (సిరాతల్ ముస్తఖీమ్’నకు) సంబంధించి అల్లాహ్ ఒక ఉపమానాన్ని ఇలా ఇచ్చినాడు: “(ఒక రాచమార్గము), ఆ రాచమార్గానికి ఇరువైపులా రెండు ఎత్తైన గోడలు, ఆ గోడలలో పరదాలు వేయబడి ఉన్న అనేక తెరిచి ఉన్న ద్వారాలు, ఆ రాచమార్గపు ప్రవేశ ద్వారం వద్ద ఒక దాయీ (పిలిచేవాడు) ఇలా పిలుస్తూ ఉంటాడు: “ఓ ప్రజలారా! మీరందరూ ఆ మార్గములోనికి ప్రవేశించండి, సంకోచించకండి.” ఆ మార్గపు చివరన ఉండే దాయీ దానికి ఇరువైపులా ఉన్న ద్వారాలలో దేనినైనా తెరవాలని ప్రయత్నించే వానితో ఇలా అన్నాడు “నీ పాడుగాను! దానిని తెరువకు. ఒకవేళ తెరిస్తే నీవు దాని లోనికి వెళ్ళి పోతావు”. ఆ రాచమార్గము ఇస్లాం; ఆ రెండు గోడలు అల్లాహ్ విధించిన హద్దులు; మరియు ఆ చెరిచి ఉన్న ద్వారాలు అల్లాహ్ నిషేధాలు. ఆ రాచమార్గపు ప్రవేశ ద్వారం వద్ద ఉన్న దాయీ అల్లాహ్ యొక్క దివ్య గ్రంథము; మరియు మార్గపు చివరన ఉన్న దాయీ ప్రతి ముస్లిం హృదయములో ఉండే అల్లాహ్ యొక్క మందలింపు, హెచ్చరిక”.

[దృఢమైనది] [దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: అల్లాహ్ ఇస్లాంను వంకరటింకరలు లేని ఒక విశాలమైన మరియు సూటియైన రహదారి (రాచమార్గము) తో పోల్చినారు. ఆ మార్గానికి ఇరువైపులా రెండు ఎత్తైన గోడలున్నాయి, లేక ఆ మార్గము రెండు ఎత్తైన గోడలతో పరివేష్టించబడి ఉన్నది. అవి రెండూ అల్లాహ్ విధించిన హద్దులు. ఆ రెండు గోడలలో అనేక తెరువబడి ఉన్న తలుపులు ఉన్నాయి. అవి అల్లాహ్ నిషేధాలు. ఆ తలుపులపై తెరలు వేయబడి ఉన్నాయి. ఆ తెరలు రహదారిపై వెళుతున్న వ్యక్తికి లోన ఎవరున్నారో (లేక ఏమి ఉన్నదో) కనిపించ నీయవు. ఆ రహదారి ప్రవేశం వద్ద ఒక దాయీ (పిలిచేవాడు) ఉంటాడు, అతడు ప్రజలను పిలుస్తూ, వారికి సూచనలిస్తూ, మార్గదర్శకత్వం చేస్తూ వారితో ఇలా అంటాడు ‘దారికి ఇరువైపులా ఎటు వైపునకూ వంగకుండా తిన్నగా నడుస్తూ ఉండండి’. ఆ దాయీ (పిలిచే వాడు) అల్లాహ్ యొక్క దివ్య గ్రంథము. ఆ రహదారికి చివరన మరొక దాయీ ఉంటాడు. ఆ దాయీ, ఆ మార్గమున పోతూ ఉండే బాటసారి దానికి ఇరువైపులా ఉండే తలుపుల పై తెరలలో దేనినైనా ఏ కొద్దిగా తెరెవడానికి ప్రయత్నించినా అతనితో ఇలా అంటాడు: “నీ పాడు గాను! దానిని తెరువకు. తెరిచావో నీవు దానిలోనికి ప్రవేశిస్తావు, ప్రవేశించకుండా నిన్ను నీవు ఆపుకోలేవు”. ఈ దాయీ ప్రతి ముస్లిం హృదయములో ఉండే అల్లాహ్ యొక్క మందలింపు మరియు హెచ్చరిక.

فوائد الحديث

ఇస్లాం ఒక సత్య ధర్మము. అది సూటియైన (రాజ) మార్గము, అందులో ఎటువంటి మెలికలు, వంకరలు లేనిది. అది స్వర్గానికి దారి చూపుతుంది.

ఇందులో అల్లాహ్ విధించిన హద్దులను గౌరవించుట, వాటిని మీరకుండా ఉండుట, మరియు అల్లాహ్ నిషేధాలను గౌరవించుట, వాటి వైపునకు వెళ్ళకుండా ఉండుట ప్రతివారిపై విధి అని తెలుస్తున్నది. అలాగే నిర్లక్ష్యము వహించడం అనేది వినాశానికి దారి తీస్తుంది అని తెలుస్తున్నది.

ఇందులో మహోన్నతమైన దివ్య గ్రంథము అల్ ఖుర్’ఆన్ యొక్క ఘనత తెలుస్తున్నది. అది మానవులను తనను అనుసరించమని, తన సందేశాలు సూచనలపై, ఆదేశాలపై ఆచరించమని కోరుతున్నది. ఎందుకంటే అందులో మార్గదర్శకత్వం ఉన్నది, వెలుగు ఉన్నది మరియు సాఫల్యం ఉన్నది.

ఇందులో తన దాసులపై అల్లాహ్ యొక్క కారుణ్యం తెలుస్తున్నది. విశ్వాసుల హృదయాలలో ఆయన నిక్షిప్తం చేసిన మందలింపు, హెచ్చరికలు వారిని వినాశములో పడకుండా ఆపుతాయి.

దాసులు పాపకార్యాలలో పడకుండా అడ్డుగోడలను నిలుపుటలో (హెచ్చరికలు చేయుటలో) వారి పట్ల అల్లాహ్ యొక్క కారుణ్యం తెలుస్తున్నది.

విద్యా బోధన యొక్క ఉపకరణాలలో - విషయాన్ని సవివరంగా బోధించడానికి, విశద పరచడానికి ఉదాహరణలను, ఉపమానాలను ఉపయోగించుట కూడా ఒకటి.

التصنيفات

దివ్యఖుర్ఆన్ ప్రముఖ్యతలు, హృదయాల ఆచరణలు, మనోవాంఛ మరియు కోరికల ఖండన