అల్లాహ్ వాక్యం గురించి తెలియ పర్చారు(وَقَالُوا لا تَذَرُنَّ آلِهَتَكُمْ وَلا تَذَرُنَّ وَدًّا وَلا سُوَاعًا وَلا يَغُوثَ وَيَعُوقَ…

అల్లాహ్ వాక్యం గురించి తెలియ పర్చారు(وَقَالُوا لا تَذَرُنَّ آلِهَتَكُمْ وَلا تَذَرُنَّ وَدًّا وَلا سُوَاعًا وَلا يَغُوثَ وَيَعُوقَ وَنَسْرًا)"వారన్నారు ‘మీరు మీ ఆరాధ్య దైవాలను ఎన్నటికీ వదలకండి,వద్ద్ ను సువా ను యగూస్ ను యఊక్ ను నసర్ ను ఎన్నటికీ వదలకండి’’ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమా తెలుపుతూ ‘ఈ పేర్లన్నీ నూహ్ అలైహిస్సలమ్ కాలంకు సంబంధించిన సత్పురుషులు"అన్నారు

ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం"అల్లాహ్ వాక్యం గురించి తెలియ పర్చారు(وَقَالُوا لا تَذَرُنَّ آلِهَتَكُمْ وَلا تَذَرُنَّ وَدًّا وَلا سُوَاعًا وَلا يَغُوثَ وَيَعُوقَ وَنَسْرًا)"వారన్నారు ‘మీరు మీ ఆరాధ్య దైవాలను ఎన్నటికీ వదలకండి,వద్ద్ ను సువా ను యగూస్ ను యఊక్ ను నసర్ ను ఎన్నటికీ వదలకండి’’ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమా తెలుపుతూ ‘ఈ పేర్లు అన్నీ నూహ్ అలైహిస్సలమ్ కాలం కు సంబంధించిన పుణ్యపురుషులు"చెప్పారు,వారు చనిపోయిన తరువాత షైతాన్ వారికి"ఆ పురుషులు కూర్చునే సమీక్ష స్థలాల్లో వారి గుర్తులను నెలకొల్పుకొని వారి పేర్లను పెట్టుకోవాలని ఉపదేశించాడు,షైతాన్ మాటలు విని వారు అలాగే చేశారు కానీ ఆరాధించలేదు,ఆ తరం నశించింది తరువాత సత్యాన్ని మరిచిపోయారు,ఆపై వారి ఆరాధన ప్రారంభమయింది.

[దృఢమైనది] [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు]

الشرح

ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు ఈ ఆయత్ వ్యాఖ్యానం ఇలా చేశారు :అల్లాహ్ ప్రస్తావించిన ఈ విగ్రహాల గురించి నూహ్ జాతి ప్రజలు వాటిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదని భోదించుకునేవారు,అప్పటికి నూహ్ అలైహిస్సలామ్ వారికి షిర్కు చేయకూడదని వారించారు,అవి వాస్తవానికి గతించిన సత్పుర్షుల పేర్లు,షైతాన్ చెడు ప్రేరణలకు లోనై ప్రజలు వారి పట్ల అతిశయిళ్ళారు,చివరికి వారి ప్రతిమలను ఏర్పరుచుకున్నారు,ఆ తరువాతి కాలం గడిచాక అవే విగ్రహాలుగా ప్రతిష్టించుకోబడ్డాయి,పిదప అల్లాహ్ ను వదిలి వాటిని ఆరాధించడం జరిగింది.

فوائد الحديث

సత్పురుషుల విషయం లో హద్దుమీరడమే “అల్లాహ్ ను కాకుండా వారి ఆరాధన చేపట్టడానికి మరియు ధర్మాన్ని సంపూర్తిగా త్యజించడానికి ప్రధాన కారణం అవుతుంది.

చిత్రపటాలు గీయడం మరియు వాటిని వ్రేలాడదీయడం ముఖ్యంగా సత్పురుషుల చిత్రాలను గీయడం లాంటి చేష్టల నుండి హెచ్చరించడం జరుగుతుంది.

షైతాన్ చేసే మోసపూరిత చర్యలు మరియు సత్యం స్వరూపం లో చూపించే అసత్యానికి వ్యతిరేఖంగా హెచ్చరించబడుతుంది.

క్రొత్త పోకడలు,బిద్అత్ నుండి వారించబడుతుంది, దీన్నిఆచరించువాడు సత్సంకల్పాన్నికలిగియున్నా సరే!

నిశ్చయంగా చిత్రపటాలు షిర్కు వైపుకు దారితీసే మాధ్యమాలు,కాబట్టి సజీవుల చిత్రపటాలను గీయకూడదని హెచ్చరిక ఉంది.

విద్య ఉండటం వల్ల ఉండే విలువ మరియు లేకపోవడం వల్ల కలిగే నష్టం గురించి తెలియజేయబడినది.

యధార్థంగా విద్య అంతరించడం అంటే‘ఉలమాలు మరణించడం‘అని అర్ధం.

మూఢ అనుసరణకు వ్యతిరేఖంగా హెచ్చరించడం జరిగింది,నిశ్చయంగా అది వారిని ఇస్లాం నుండి మార్గహీనులుగా మార్చుతుంది.

గతించిన జాతుల్లో షిర్కు ప్రారంభమయ్యింది.

ఇక్కడ ప్రస్తావించబడిన ఈ ఐదు పేర్లు నూహ్ జాతికి చెందిన జనులు ఆరాధించేవి.

అసత్యవాసులు తమ అసత్యం పట్ల పరస్పర సహాయ సహకారాలు ఇచ్చిపుచ్చుకుంటారని చెప్పబడింది.

తిరస్కారులగు కాఫీరులను‘సాధారణ రీతిలో’ శపించడం దైవసమ్మతమే!

التصنيفات

బహుదైవారాధన (షిర్క్)