إعدادات العرض
ఎవరైతే ‘హద్ద్’ నేరానికి (చట్టపరంగా శిక్షార్హమైన పాపపు పనికి) పాల్బడతాడో; మరియు దాని కొరకు అతడు ఇహలోకములో…
ఎవరైతే ‘హద్ద్’ నేరానికి (చట్టపరంగా శిక్షార్హమైన పాపపు పనికి) పాల్బడతాడో; మరియు దాని కొరకు అతడు ఇహలోకములో శిక్షించబడతాడో, అల్లాహ్ ఎంతటి న్యాయవంతుడు అంటే అల్లాహ్ అతనికి పరలోకములో రెండవసారి శిక్ష విధించడు
అలీ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: ఎవరైతే ‘హద్ద్’ నేరానికి (చట్టపరంగా శిక్షార్హమైన పాపపు పనికి) పాల్బడతాడో; మరియు దాని కొరకు అతడు ఇహలోకములో శిక్షించబడతాడో, అల్లాహ్ ఎంతటి న్యాయవంతుడు అంటే అల్లాహ్ అతనికి పరలోకములో రెండవసారి శిక్ష విధించడు; అలాగే ఎవరైతే ‘హద్ద్’ నేరానికి (చట్టపరంగా శిక్షార్హమైన పాపపు పనికి) పాల్బడతాడో; అల్లాహ్ దానిని ఇహలోకములో అతని కొరకు కప్పివేసి, దానిని క్షమించి వేసాడో, అల్లాహ్ ఎంతటి దయగలవాడు అంటే తాను అప్పటికే క్షమించిన దానిని, పరలోకములో తిరిగి వెలికి తీయడు.
الترجمة
العربية Tiếng Việt Bahasa Indonesia Nederlands Kiswahili অসমীয়া English ગુજરાતી සිංහල Magyar ქართული Hausa Română ไทย Português मराठी ភាសាខ្មែរ دری አማርኛ বাংলা Kurdî Македонски Tagalogالشرح
ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియఏస్తున్నారు: ‘షరియత్’లో నిర్దిష్టమైన శిక్షలు నిర్ణయించబడిన పాపములలో (ఉదా: దొంగతనము, వ్యభిచారము మొ.) ఎవరైనా ఏదైనా పాపము చేసి ఉండి, ఆ పాపానికి అతడు ఈ లోకములో శిక్షించబడితే, ఆ శిక్ష అతని ఆ పాపాన్ని తొలగిస్తుంది; మరియు ఆ పాపానికి పరలోకములో శిక్షనుండి విముక్తిని కలిగిస్తుంది. ఎందుకంటే అల్లాహ్ ఎంత ఉదారుడూ, దయగలవాడూ అంటే ఒకే పాపానికి రెండు శిక్షలు విధించడు; మరియు అల్లాహ్ ఈ లోకములో ఎవరి పాపాన్నైనా కప్పివేసి ఉండి, అతడిని మన్నించి, క్షమించి ఉన్నట్లైతే, మరియు అతడు ఆ పాపానికి ఈ లోకములో శిక్షించబడకపోయినట్లైతే, అల్లాహ్ ఎంత ఉదారుడూ, దయగలవాడూ అంటే తాను అప్పటికే మన్నించి, క్షమించివేసిన పానికి పరలోకములో తిరిగి శిక్ష విధించడు.فوائد الحديث
అల్లాహ్ యొక్క న్యాయం, దాతృత్వం మరియు దయ గొప్పవి.
ఈ ప్రపంచంలో షరియత్’లో నిర్ణయించబడిన శిక్షను విధించుట వలన పాపం ప్రాయశ్చిత్తమవుతుంది.
షరియత్’లో నిర్దుష్టంగా శిక్షలు నిర్ణయించబడిన పాపములలో ఎవరైనా ఏదైనా పాపపు పనికి పాల్బడితే, అతడు తనను తాను అల్లాహ్ యొక్క రక్షణద్వారా ఆ పాపము నుండి కప్పివేసుకోవాలి, మరియు నిజాయితీగా, మనస్ఫూర్తిగా ఆ పపపు పనికి పాల్బడినందుకు పశ్చాత్తాపపడాలి.
التصنيفات
హద్దులు