“నిశ్చయంగా అల్లాహ్ మీ కొరకు మూడు విషయాలను ఇష్టపడతాడు, మరియు మూడు విషయాలను అసహ్యించుకుంటాడు

“నిశ్చయంగా అల్లాహ్ మీ కొరకు మూడు విషయాలను ఇష్టపడతాడు, మరియు మూడు విషయాలను అసహ్యించుకుంటాడు

అబూ హురైరాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా పలికినారు: “నిశ్చయంగా అల్లాహ్ మీ కొరకు మూడు విషయాలను ఇష్టపడతాడు, మరియు మూడు విషయాలను అసహ్యించుకుంటాడు మీకొరకు ఇష్టపడేవి: మీరు ఆయనను మాత్రమే ఆరాధించుట; దేనినీ మరియు ఎవరినీ మీరు ఆయనకు సమానులుగా నిలబెట్టకుండుట; మరియు మీరు ఆయన త్రాటిని బలంగా పట్టుకుని కలిసికట్టుగా ఉండుట, మరియు విడిపోకుండా ఉండుట; ఆయన మీ కొరకు అసహ్యించుకునే విషయాలు: వ్యర్ధ సంభాషణ (పోసుకోలు మాటలు); అడుక్కొనుట, లేదా అతిగా ప్రశ్నించుట; మరియు సంపదను వ్యర్ధముగా ఖర్చు చేయుట.

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: నిశ్చయంగా అల్లాహ్ తన దాసుల నుండి మూడు లక్షణాలను ఇష్టపడతాడని మరియు వారిలో మూడు లక్షణాలను ఇష్టపడడు అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మనకు తెలియజేశారు. వారు ఆయన ఏకత్వాన్ని ధృవీకరించుట మరియు ఆయనతో దేనినీ సమానులుగా చేయకుండా ఉండుట; వారు అల్లాహ్ యొక్క నిబంధనకు, ఖురాన్‌కు మరియు ఆయన ప్రవక్త (స) సున్నత్‌కు కట్టుబడి ఉండుట మరియు వారు ముస్లిం సమాజం నుండి విడిపోకుండా ఐకమత్యంగా ఉండుట. ఆయన వారి కొరకు ఇష్టపడని విషయాలు: వారికి సంబంధం లేని విషయాల గురించి పనికిమాలిన మాటలు మాట్లాడటం; జరగని విషయాల గురించి ప్రశ్నించడం; ఇతరుల వద్ద ఉన్న దానిని గురించి, ఉదా: డబ్బును గురించి, లేదా అవసరం లేని వాటిని ప్రజల నుండి అడగడం; (అంటే అవసరం ఉన్నా లేకపోయినా అడుక్కొనుట, బిచ్చమెత్తుట); లేదా దేనిగురించైనా అతిగా ప్రశ్నించుట; డబ్బును వృధా చేయడం, దాని చట్టబద్ధమైన ఉపయోగాలకు భిన్నంగా ఖర్చు చేయడం మరియు సంపదను నష్టానికి గురి చేయడం.

فوائد الحديث

సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తన దాసుల నుండి తన ఆరాధనలో నిజాయితీని ఇష్టపడతాడు మరియు ఆయనపై అవిశ్వాసాన్ని ద్వేషిస్తాడు, ఆగ్రహపడతాడు.

ఈ హదీథులో సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క తాడును గట్టిగా పట్టుకుని దానికి కట్టుబడి ఉండాలనే ప్రోత్సాహం ఉన్నది, ఎందుకంటే ఇది ఐక్యత మరియు ధృఢత్వాన్ని తెస్తుంది.

అలాగే ఇందులో సమాజంగా ఉండడాన్ని ప్రోత్సహించడం, దానికి కట్టుబడి ఉండాలని ఆదేశించడం, దాని శ్రేణులను ఏకం చేయడం మరియు దానికి వ్యతిరేకమైన విషయాలను నిషేధించడం, అంటే విభజన మరియు అసమ్మతి, వ్యతిరేకతలు

తనకు సంబంధం లేని విషయాల గురించి అధికంగా మాట్లాడటం నిషేధించబడింది, ఎందుకంటే అది అనుమతించబడితే, అది సమయం వృధా అవుతుంది మరియు అది నిషేధించబడితే, అది అనేక పాపాలకు దారితీస్తుంది.

ఇతరుల విషయాలలో అనవసర జోక్యం, వారి పరిస్థితులపై కన్నేసి ఉంచడం, వాటిని అనుసరించడం, ఇతరుల మాటలను వారి చర్యలను కథలుగా చెప్పడం మానుకోవాలి, వదిలివేయాలి.

ప్రజల ధనాన్ని ఎక్కువగా అడగడం నిషేధించబడింది.

అలాగే ఈ హదీథులో డబ్బు వృధా చేయడం నిషేధము అని ప్రయోజనకరమైన లక్ష్యాల సాధన కొరకు సంపదను సంరక్షించడాన్ని ప్రోత్సహించడం చూస్తాము.

التصنيفات

తౌహీదె ఉలూహియ్యత్, ముస్లిం సమాజం