తౌహీదె ఉలూహియ్యత్

తౌహీదె ఉలూహియ్యత్

8- “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను ఏ ఆదేశాలతో ఇక్కడికి పంపినారో, అవే ఆదేశాలతో నిన్ను కూడా పంపనా! ఏ చిత్రపటాన్నైనా, ప్రతిమ, బొమ్మ, శిల్పము మొదలైన వాటిని చెరిపి వేయకుండా, తొలగించకుండా వదలకు, అలాగే ఎత్తుగా నిర్మించిన లేదా ఏదైనా కట్టడం నిర్మించి ఉన్న ఏ సమాధిని కూడా నేలమట్టం చేయకుండా వదలకు.”

12- “ఎవరైతే “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు) అని ఉచ్ఛరిస్తాడో, మరియు అల్లాహ్ తప్ప ఆరాధించబడే ప్రతిదానినీ నిరసిస్తాడో (అవిశ్వసిస్తాడో), అతని సంపద, మరియు అతని రక్తము (మిగతా విశ్వాసుల కొరకు) హరాం (నిషేధము) అవుతాయి. అతని లెక్క, పత్రము అల్లాహ్ వద్ద ఉంటుంది (అల్లాహ్ చూసుకుంటాడు అని అర్థము)

14- అది ఏదో ఒక నిజానికి సంబంధించిన మాట అయి ఉంటుంది. దానిని ఆ జిన్ను దొంగతనంగా (దైవదూతల నుండి) పొంది, తన మిత్రుడైన ఆ జ్యోతిష్యుని చెవిలో వేస్తాడు. అతడు దానికి (ఆ నిజమైన ఒక్క మాటకు) మరో వంద అబద్ధాలు కల్పించి చెపుతాడు.” (సహీ బుఖారీలో ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించిన మరొక హదీసులో తాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనగా విన్నాను అని తెలిపారు “స్వర్గములో అల్లాహ్ నిర్ణయించిన విషయాలను గురించి ప్రస్తావించుకుంటూ దైవదూతలు క్రింది ఆకాశాలలోనికి వస్తారు. వారి మాటలను జిన్ను దొంగతనంగా, చాటుమాటుగా విని తమ మిత్రులైన జ్యోతిష్యులకు చేరవేస్తాడు. అలా ఆ జ్యోతిష్యులు దానికి వంద అబద్దాలు జోడించి చెబుతూ ఉంటారు.”)