“పునరుథ్థాన దినమున నరకాగ్నిలో అందరికంటే తక్కువ శిక్ష విధించబడిన వ్యక్తితో అల్లాహ్ ఇలా అంటాడు: “నీ వద్ద భూమిపై…

“పునరుథ్థాన దినమున నరకాగ్నిలో అందరికంటే తక్కువ శిక్ష విధించబడిన వ్యక్తితో అల్లాహ్ ఇలా అంటాడు: “నీ వద్ద భూమిపై ఉన్న ప్రతి వస్తువూ ఉన్నట్లైతే, వాటన్నింటినీ ఈ శిక్ష నుండి విముక్తి పొందుట కొరకు చెల్లించుకుంటావా?” అని. దానికి అతడు “అవును, చెల్లించుకుంటాను

అనస్ ఇబ్న్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “పునరుథ్థాన దినమున నరకాగ్నిలో అందరికంటే తక్కువ శిక్ష విధించబడిన వ్యక్తితో అల్లాహ్ ఇలా అంటాడు: “నీ వద్ద భూమిపై ఉన్న ప్రతి వస్తువూ ఉన్నట్లైతే, వాటన్నింటినీ ఈ శిక్ష నుండి విముక్తి పొందుట కొరకు చెల్లించుకుంటావా?” అని. దానికి అతడు “అవును, చెల్లించుకుంటాను” అంటాడు. అపుడు ఆయన ఇలా అంటాడు: “నీవు ఆదము యొక్క వెన్నులో ఉన్నపుడు ఇంత కంటే చాలా తేలికైన విషయాన్ని అడిగాను – నాకు ఎవ్వరినీ, దేనినీ సాటి కల్పించకు (నన్ను తప్ప ఇతరులను అరాధించకు) అని. కానీ నీవు ఇతరులను నాకు సాటి కల్పించడాన్ని నిరాకరించలేదు. అది తప్ప మరేమి చేయడానికి నిరాకరించావు.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: నరకం లోనికి ప్రవేశించిన తరువాత అక్కడ చాలా తక్కువ శిక్ష పడి, ఆ శిక్షను అనుభవిస్తున్న వానితో సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా అంటాడు: నీ దగ్గర ఈ ప్రపంచం మొత్తం మరియు అందులో ఉన్న ప్రతిదీ ఉన్నట్లైతే, ఈ శిక్ష నుండి విముక్తి పొందడానికి దానిని మొత్తం ఇచ్చివేస్తావా? దానికి అతడు: “అవును, ఇచ్చివేస్తాను” అంటాడు. అపుడు అల్లాహ్ ఇలా అంటాడు: ఆదం వెన్నెముకలో ఉన్నపుడు అంటే మీ నుండి ఒడంబడిక తీసుకున్నపుడు, దీనికంటే చాలా తేలికైనది – నాకు ఎవరినీ మరియు దేనినీ సాటి కల్పించకు (కేవలం నన్ను మాత్రమే ఆరాధించు) – అని ఆదేశించాను. కానీ నేను నిన్ను ఈ ప్రపంచం లోనికి తీసుకు వచ్చినప్పుడు నీవు బహుదైవారాధనను తప్ప ప్రతిదానినీ నిరాకరించావు.

فوائد الحديث

ఈ హదీథులో ‘తౌహీదు’ (ఏకదైవారాధన) యొక్క ఘనత మరియు దానిని అనుసరించడం ఎంత సులభమో తెలుస్తున్నది.

అలాగే అల్లాహ్’కు సాటి కల్పించుట (షిర్క్) ఎంత ప్రమాదకరమైనదో దాని పరిణామాలు ఎంత భయంకరమైనవో తెలుస్తున్నది.

అల్లాహ్ ఆదము సంతానముతో, వారు తమ తండ్రి ఆదము వెన్నెముకలో ఉండగా, వారితో ఒక ఒడంబడిక తీసుకున్నాడు – తనతో ఎవరినీ సాటి కల్పించరాదు అని.

అలాగే ఈ హదీథులో ‘షిర్క్’నకు (బహుదైవారాధన – అల్లాహ్’కు సాటి కల్పించుట) వ్యతిరేకంగా హెచ్చరిక ఉన్నది. పునరుథ్థాన దినమున ఈ ప్రపంచం మరియు ఇందులో ఉన్న మొత్తం కూడా అవిశ్వాసికి ఎటువంటి ప్రయోజనమూ చేకూర్చలేవు.

التصنيفات

తౌహీదె ఉలూహియ్యత్