ఏదైనా వస్తువు తావీజులా ఎవరైతే ధరిస్తారో దానికే అప్పగించబడతారు’.

ఏదైనా వస్తువు తావీజులా ఎవరైతే ధరిస్తారో దానికే అప్పగించబడతారు’.

అబ్దుల్లా బిన్ ఉకైమ్’రజియల్లాహు అన్హు మర్ఫూ ఉల్లేఖనం ‘ఎవరైతే తావీజులా ఏదైనా వస్తువు ధరిస్తారో దానికే అప్పగించబడతారు’.

[ప్రామాణికమైనది] [దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు - దాన్ని ఆహ్మద్ ఉల్లేఖించారు]

الشرح

ఎవరైతే తన హృదయంతో లేదా కర్మలతో లేదా రెండింటితో పాటు ఏదేని వస్తువు వైపుకు ఆకర్షితులై దానితో ప్రయోజనం ఆశించాలని లేక ఆపదల నుండి రక్షించమని మ్రోగ్గుచూపుతాడో అల్లాహ్ అతను ఆధారపడిన ఆ వస్తువుకు ఆదీన పరుస్తాడు,మరెవరైతే అల్లాహ్ ను అంటిపెట్టుకుని ఉంటారో అతని కార్యసిద్దికి అల్లాహ్ సరిపోతాడు మరియు అతని ప్రతీకష్టాన్ని సులభతరం చేస్తాడు,మరెవరైతే ఇతరత్రా విషయాలను అంటిపెట్టుకుని ఉంటాడో అల్లాహ్ దాని ఆధీనంలోకి చేరుస్తాడు మరియు అతన్ని పట్టించుకోకుండా వదిలేస్తాడు,

فوائد الحديث

సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ను కాకుండా మరొకరితో బంధం ఏర్పరుచుకోవడం నిషేధం.

సమస్త వ్యవహారాలలో అల్లాహ్ పై ఆధారపడి ఉండటం విధి

షిర్కు కలిగించే నష్టము మరియు దాని చెడు పర్యవసానము గురించి భోదించబడినది

నిశ్చయంగా ‘కార్యనుకులంగా ప్రతిఫలం సిద్దిస్తుంది.

కర్మల ఫలాలు దాసుడికి మంచిని లేక చెడును ప్రసాదిస్తాయి

అల్లాహ్ ను కాదని ఇతరుల వైపుకు మరలి ప్రయోజనాలను ఆశించేవాడు సిగ్గుతో పతనమయిపోతాడు.

التصنيفات

తౌహీదె ఉలూహియ్యత్, హృదయాల ఆచరణలు