అది ఎటువంటి జాతి అంటే – తమలో ధర్మపరాయణుడైన ఒక దాసుడు చనిపోయినా, లేక ఒక ధర్మపరాయణుడైన వ్యక్తి చనిపోయినా వారు…

అది ఎటువంటి జాతి అంటే – తమలో ధర్మపరాయణుడైన ఒక దాసుడు చనిపోయినా, లేక ఒక ధర్మపరాయణుడైన వ్యక్తి చనిపోయినా వారు అతని సమాధిపై ఒక ఆరాధనా గృహాన్ని (దేవాలయాన్ని) నిర్మించి

ఉమ్ముల్ ము'మినీన్ (విశ్వాసుల మాత) ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: “ఉమ్మె సలమహ్ రజియల్లాహు అన్హా తాను హబషహ్(అబిసీనియా) లో మారియా అని పిలువబడే ఒక చర్చీను చూసిన విషయాన్ని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ప్రస్తావించినారు. అందులో తాను చూసిన ప్రతిమలను (విగ్రహాలను) గురించి ప్రస్తావించినారు. అపుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అది ఎటువంటి జాతి అంటే – తమలో ధర్మపరాయణుడైన ఒక దాసుడు చనిపోయినా, లేక ఒక ధర్మపరాయణుడైన వ్యక్తి చనిపోయినా వారు అతని సమాధిపై ఒక ఆరాధనా గృహాన్ని (దేవాలయాన్ని) నిర్మించి అందులో వారి విగ్రహాలను ప్రతిష్టించి పూజించడం మొదలుపెడతారు. అల్లాహ్ వద్ద వారు సృష్టి మొత్తములో అత్యంత నీచులు, దుష్టులు.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఉమ్ముల్ ము’మినీన్ ఉమ్మె సలమహ్ రజియల్లాహు అన్హా – తాను అబిసీనియాలో ఉన్నపుడు మారియా అని పిలువబడే ఒక చర్చిని చూసిన విషయాన్ని, అందులో విగ్రహాలు, చిత్రపటాలు, వివిధ రకాల అలంకరణలు చూసిన విషయాన్ని, వాటిని చూసి తాను అబ్బురపడిన విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ప్రస్తావించినారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ విగ్రహాలు, చిత్రపటాలు అక్కడ చర్చిలో పెట్టి ఉండడం వెనుక ఉన్న కారణాలను వివరించారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “వారిలో ఒక నీతిమంతుడు మరణిస్తే, వారు అతని సమాధిపై ఒక ఆరాధనాలయాన్ని (మస్జిదును) నిర్మించి, అందులో ప్రార్థనలు చేస్తారు. వారు అతని విగ్రహాన్ని, చిత్రపటాన్ని అందులో ఉంచుతారు. తరువాత ఆయన ఇలా విశదపరిచినారు: అలా చేసేవాడు అల్లాహ్ దృష్టిలో సృష్టిలోకెల్లా అత్యంత నీచుడు. ఎందుకంటే అతని ఆ ఆచరణ సర్వోన్నతుడైన అల్లాహ్ తో షిర్క్ చేయడానికి దారి తీస్తుంది (అంటే అల్లాహ్ కు సాటిగా, సమానులుగా వేరే వారిని నిలబెట్టుట).

فوائد الحديث

సమాధులపై మస్జిదులను (ఆరాధనాలయాలను) నిర్మించుట, లేక అలా నిర్మించబడిన మస్జిదులలో ప్రార్థనలు చేయుట (నమాజు ఆచరించుట), లేదా చనిపోయిన వారిని మస్జిదులలో ఖననం చేయుట – ఇవన్నీ హరామ్ (నిషేధము). షిర్క్’నకు దారితీసే ప్రతి కారణానికి ఆదిలోనే అడ్డుకట్టవేయుట.

సమాధులపై మస్జిదులను (ఆరాధనా గృహాలను) నిర్మించుట, వాటిలో విగ్రహాలను, చిత్రపటాలను ఉంచుట యూదులు మరియు క్రైస్తవుల ఆచరణ. మరియు ఎవరైతే అలా చేస్తారో వారు యూదులను, క్రైస్తవులను అనుకరించినట్లే.

ప్రాణుల చిత్రపటాలను చిత్రించుట నిషేధము.

సమాధిపై మస్జిదును నిర్మించే వాడు, లేక అందులో విగ్రహాన్ని ప్రతిష్టించేవాడు సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క సృష్టి మొత్తములో అత్యంత నీచుడు.

షిర్క్’నకు దారితీసే ప్రతి కారణాన్ని ఆదిలోనే తుంచివేయడం ద్వారా, అడ్డుకట్ట వేయడం ద్వారా షరియత్ “తౌహీదు” ను సంపూర్ణంగా పరిరక్షిస్తుంది.

ధర్మపరాయణులైన వారిని కీర్తించడంలో “అతి” చేయడాన్ని నిరోధిస్తుంది. ఎందుకంటే అది “షిర్క్” లో పడటానికి ఒక ఉచ్చు లాంటిది.

التصنيفات

తౌహీదె ఉలూహియ్యత్, మస్జిదుల ఆదేశాలు