ఒంటెల మెడలలో వేలాడదీసిన ఎటువంటి దారాన్ని గానీ, ఎటువంటి పట్టాను గానీ లేక ఎటువంటి గొలుసును గానీ త్రెంచి వేయకుండా…

ఒంటెల మెడలలో వేలాడదీసిన ఎటువంటి దారాన్ని గానీ, ఎటువంటి పట్టాను గానీ లేక ఎటువంటి గొలుసును గానీ త్రెంచి వేయకుండా వదలకండి” అనే ఆదేశముతో పంపినారు

అబూ బషీర్ అల్ అన్సారీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : తాను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన ప్రయాణాలలో ఒక ప్రయాణం లో ఆయన వెంట ఉన్నారు. అపుడు వారి వెంట ఉన్న జనులు తమ తమ విశ్రాంతి స్థలాలలో, గుడారాలలో ఉండగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందేశహరుణ్ణి వారి వద్దకు “ఒంటెల మెడలలో వేలాడదీసిన ఎటువంటి దారాన్ని గానీ, ఎటువంటి పట్టాను గానీ లేక ఎటువంటి గొలుసును గానీ త్రెంచి వేయకుండా వదలకండి” అనే ఆదేశముతో పంపినారు.

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన ప్రయాణాలలో ఒక ప్రయాణంలో అతను ఆయన వెంట ఉన్నారు. అపుడు ఆయన వెంట ఉన్న జనులు తమ తమ విశ్రాంతి స్థలాలలో, గుడారాలలో చేరుకున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మనిషిని తన ఈ ఆదేశాలతో వారందరి వద్దకు పంపినారు - తమ తమ ఒంటెల మెడలలో వారు వేలాడదీసి ఉన్న పట్టీలు గానీ లేక దారాలు గానీ, లేక విలుత్రాడులు గానీ లేక ఇంకా అలాంటివి ఏవైనా వేలాడదీసి ఉంటే - ఉదాహరణకు గంటలు గానీ లేక చెప్పులు లేక బూట్లు లాంటివి - వాటిని త్రెంచి వేయాలని. (ఆ రోజులలో) ప్రజలు అటువంటి వాటిని తమతమ జంతువుల మెడలలో వాటికి దిష్టి తగలకుండా ఉండాలని, వాటికి కీడు కలగకుండా ఉండాలని వేలాడ దీసేవారు. కనుక ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అలా వేలాడదీసి ఉంచిన ప్రతి దానిని త్రెంచి వేయాలని వారిని ఆదేశించినారు. ఎందుకంటే అవి ఏ కీడునూ, లేక ఏ నష్టాన్నీ తొలగించలేవు. ఎందుకంటే మనిషికి కలిగే శుభము, లాభము, ప్రయోజనము లేక కీడు, హాని ఏదైనా – తనకెవరూ సాటిగానీ సమానులు గానీ లేని సర్వోన్నతుడైన అల్లాహ్ చేతిలో ఉంటాయి.

فوائد الحديث

శుభము కలగాలని గానీ లేక కీడు తొలకాలని గానీ దారాలను గానీ లేక పట్టాలను, గొలుసులను గానీ మెడలో వేలాడ దీసుకొనుట నిషేధించబడినది (హరాం). అది బహుదైవారాధన (షిర్క్) గా భావించబడుతుంది.

మెడలో వేసే గొలుసు ఒకవేళ ఆభరణం లా వేసినట్లయితే, లేక ఆ పశువును (మిగతా పశువులు) అనుసరించుటకు గుర్తుగా వేసినట్లయితే, లేక ఆ పశువును కట్టివేయవలసి వచ్చినపుడు మెడలో వేసిన గొలుసుకు కట్టివేయవచ్చును అనే ఆలోచనతో వేసినట్లయితే, దానిలో దోషము ఏమీ లేదు.

(ఎవరికి వారు) తమ సామర్థ్యాన్ని అనుసరించి వీలైనంత ఎక్కువగా బహిరంగంగా చెడును ఖండించాలి.

మనసు, హృదయమూ ఎల్లప్పుడూ, సాటి, సమానులు ఎవరూ లేని ఏకైకుడైన ఆ అల్లాహ్’తోనే సంబంధము ఏర్పర్చుకుని ఉండాలి.

التصنيفات

తౌహీదె ఉలూహియ్యత్