క్రైస్తవులు మరియు యూదులపై అల్లాహ్ యొక్క శాపము ఉండుగాక, వారు తమ ప్రవక్తల సమాధులను మస్జిదుగా (ఆరాధనా గృహాలుగా)…

క్రైస్తవులు మరియు యూదులపై అల్లాహ్ యొక్క శాపము ఉండుగాక, వారు తమ ప్రవక్తల సమాధులను మస్జిదుగా (ఆరాధనా గృహాలుగా) చేసుకున్నారు

ఆయిషా మరియు అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమ్ ఉల్లేఖనం : అది రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం పై ఆయన అంతిమ ఘడియలు అవతరిస్తున్న సమయం. అపుడు ఆయన (తాను కప్పుకుని ఉన్న) దుప్పటిని తన ముఖము పైకి లాక్కుని, అసౌకర్యముగా అనిపించిన వెంటనే ముఖముపై నుండి తీసివేయసాగినారు. ఆయన ఆ స్థితిలో ఉండి (కూడా) ఇలా అన్నారు “క్రైస్తవులు మరియు యూదులపై అల్లాహ్ యొక్క శాపము ఉండుగాక, వారు తమ ప్రవక్తల సమాధులను మస్జిదుగా (ఆరాధనా గృహాలుగా) చేసుకున్నారు”. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసిన పని గురించి హెచ్చరించారు.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో - ఆయిషా మరియు అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమ్ మనకు ఇలా తెలియజేస్తున్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మృత్యు ఘడియలు సమీపించినపుడు, వారు (తాను కప్పుకుని ఉన్న) వస్త్రము యొక్క భాగాన్ని తన ముఖము పైకి లాక్కుంటూ, మృత్యువేదన కారణంగా (అలా కప్పుకుని ఉండడం) కష్టమనిపించినపుడు, ఆ వస్త్రాన్ని తన ముఖము పైనుంచి తీసివేసేవారు. అంతటి కఠిన ఘడియలలో ఉన్నపుడు, వారు ఇలా అన్నారు: “అల్లాహ్ యొక్క శాపము యూదులు మరియు క్రైస్తవులపై ఉండుగాక, వారిని తన కరుణ నుంచి దూరం చేయుగాక, ఎందుకంటే వారు తమ ప్రవక్తల సమాధులపై మస్జిదులు (ఆరాధనా గృహాలు) నిర్మించుకున్నారు”. ఈ విషయము ఇంత గంభీరమైనది కాకపోయి ఉంటే వారు ఆ స్థితిలో (ఉండి కూడా) అలా అని పలికే వారు కాదు. ఆ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉమ్మత్ ను అలా చేయడము నుండి నిషేధించినారు. ఇది (అంటే సమాధులపై ఆరాధనా గృహాలను నిర్మించుట) యూదులు మరియు క్రైస్తవుల ఆచరణ, మరియు ఇది అల్లాహ్ తో షిర్క్ చేయుటకు (ఇతరులను అల్లాహ్ కు సమానులుగా నిలబెట్టుటకు) ఒక మార్గము అవుతుంది.

فوائد الحديث

ఇందులో – ప్రవక్తల సమాధులను మరియు ధర్మగురువుల (ఔలియాల) సమాధులను అల్లాహ్ ను ఆరాధించే మస్జిదులుగా చేసుకొనుటను నిరోధించడం స్పష్టమవుతున్నది. ఎందుకంటే అది అల్లాహ్ తో షిర్క్ చేయుటకు (ఇతరులను అల్లాహ్ కు సమానులుగా నిలబెట్టుటకు) దారి తీస్తుంది.

ఇందులో – అల్లాహ్ యొక్క తౌహీద్ (అల్లాహ్ యొక్క ఏకత్వము) పట్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క తీవ్రమైన శ్రద్ధ మరియు తాపత్రయం, మరియు సమాధుల ప్రట్ల (ప్రజలలో) పూజ్య భావం పెరుగుతుందేమో అనే ఆయన భయం కనిపిస్తున్నాయి. ఎందుకంటే అది బహుదైవారాధనకు (షిర్క్ నకు) దారి తీస్తుంది.

ఇందులో – సమాధులపై కట్టడాలు నిర్మించి వాటిని మస్జిదులుగా (ఆరాధనా గృహాలుగా) చేసుకున్నందుకు యూదులు మరియు క్రైస్తవులను, ఇంకా వారిలాగానే సమాధులపై కట్టడాలు నిర్మించి ఆరాధనా గృహాలుగా చేసుకునే ఇతరులను శపించుట అనుమతించబడిన విషయమే అని తెలియుచున్నది.

సమాధులపై కట్టడాలు నిర్మించడం అనేది యూదులు మరియు క్రైస్తవుల విధానాలలో ఒకటి. మరియు ఈ హదీథులో వారిని అనుకరించడం పట్ల నిషేధం ఉన్నది.

సమాధులను మస్జిదులుగా చేసుకోవడం అంటే, సమాధులవద్ద నమాజు ఆచరించుట లేదా వాటి వైపునకు తిరిగి నమాజు ఆచరించుట – (నిజానికి) అక్కడ మస్జిదు నిర్మించబడి లేకపోయినా.

التصنيفات

తౌహీదె ఉలూహియ్యత్