“నిశ్చయంగా అల్లాహ్, మీ తండ్రులు, తాతముత్తాతల పేర్ల మీద ఒట్టు పెట్టుకోవడాన్ని, ప్రమాణం చేయడాన్ని నిషేధించినాడు

“నిశ్చయంగా అల్లాహ్, మీ తండ్రులు, తాతముత్తాతల పేర్ల మీద ఒట్టు పెట్టుకోవడాన్ని, ప్రమాణం చేయడాన్ని నిషేధించినాడు

ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “నిశ్చయంగా అల్లాహ్, మీ తండ్రులు, తాతముత్తాతల పేర్ల మీద ఒట్టు పెట్టుకోవడాన్ని, ప్రమాణం చేయడాన్ని నిషేధించినాడు.” ఉమర్ రజియల్లాహు అన్హు కొనసాగిస్తూ ఇంకా ఇలా అన్నారు “అల్లాహ్ సాక్షిగా (చెబుతున్నాను); రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఆ మాటను విన్నప్పటినుండి (ఒట్టువేసి) నేను ఏదైనా చెప్పాలన్నా, లేక ఎవరి మాటనైనా (ఒట్టు వేసి) చెప్పాలన్నా ఎప్పుడూ నా తండ్రి, తాతముత్తాతల పేర్ల మీద ఒట్టు వేయలేదు.

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తాత, ముత్తాతల పేర్ల మీద ఒట్టు వేయడాన్ని, వారి పేర్లమీద ప్రమాణం చేయడాన్ని నిషేధించినారు. కనుక ఎవరైనా ఒట్టువేయవలసిన, లేక ప్రమాణం చేయవలసిన పరిస్థితివస్తే అల్లాహ్ పేరున ప్రమాణం చేయాలి (ఒట్టువేయాలి); అంతే తప్ప వేరే ఇంకెవరి పేరునా ఒట్టువేయడం లేక ప్రమాణం చేయడం చేయరాదు. తరువాత ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఇలా ప్రస్తావించారు – రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఆ మాటలు విన్నప్పటి నుండి తాను ఆ విధంగా ఎప్పుడూ సంకల్ప పూర్వకంగా గానీ, లేక వేరే వారి మాటల విషయంలో గానీ అల్లాహ్ పేరున తప్ప ఇతరుల పేరున ఒట్టు పెట్టుకోవడం లేక ప్రమాణం చేయడం చేయలేదు.

فوائد الحديث

అల్లాహ్ పేరున తప్ప మరింకెవరి పేరున అయినా ఒట్టుపెట్టుకోవడం, ప్రమాణం చేయడం నిషేధం. ముఖ్యంగా తాత, ముత్తాతల పేర్ల మీద – ఎందుకంటే అది “జాహిలియ్యహ్” (ఇస్లాం కు పూర్వం) కాలపు సంప్రదాయం.

ఒట్టుపెట్టుకోవడం: అంటే అల్లాహ్ పేరున లేక ఆయన గుణ విశేషణాల పేరున – ఏదైనా విషయాన్ని నిర్ధారించడానికి చేసే ప్రమాణము.

ఇందులో ఉమర్ రజియల్లాహు అన్హు యొక్క ఘనత తెలుస్తున్నది - ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాటలు మరియు వారి ఆదేశాల పట్ల ఆయన యొక్క సత్వర విధేయత, మంచి అవగాహన, మరియు వివేకం ఇవన్నీ ఆయన ఘనతను తెలియజేస్తున్నాయి.

التصنيفات

తౌహీదె ఉలూహియ్యత్