“కుక్క మరియు చిత్రపటం ఉన్న ఇంటిలోనికి దైవదూతలు ప్రవేశించరు.”

“కుక్క మరియు చిత్రపటం ఉన్న ఇంటిలోనికి దైవదూతలు ప్రవేశించరు.”

అబూ తల్హహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “కుక్క మరియు చిత్రపటం ఉన్న ఇంటిలోనికి దైవదూతలు ప్రవేశించరు.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు – ఏ ఇంటిలోనైతే కుక్కగానీ లేక చలనం కలిగిన జీవరాసుల చిత్రపటాలు గానీ ఉన్నట్లైతే ఆ ఇంటిలోనికి అల్లాహ్ యొక్క కారుణ్యదూతలు ప్రవేశించరు. చిత్రపటం అంటే ఆత్మ కలిగిన ప్రాణియొక్క చిత్రపటం అని అర్థం. అటువంటి చిత్రపటం నిషేధము (హరాం), అది అల్లాహ్ యొక్క సృష్ఠి నిర్మాణ లక్షణాన్ని అనుకరించడం అవుతుంది. ఆ విధమైన చిత్రపటాలు బహుదైవారాధనకు దారి తేసే కారణాలలో ఒకటి. కొన్ని చిత్రపటాలైతే అల్లాహ్ కు బదులుగా, లేక అల్లాహ్’తో పాటుగా ఆయనకు సాటిగా పూజించబడుతున్నాయి కూడా. కుక్క ఉన్న ఇంటిలోనికి అల్లాహ్ యొక్క కారుణ్యదూతలు ప్రవేశించకపోవడానికి కారణం: ఎందుకంటే కుక్క అశుద్ధమైన పదార్థాలను తింటుంది; వాటిలో కొన్ని కుక్కలు షైతాన్ పేర్లను కూడా కలిగినవి ఉన్నాయి; మరి దైవదూతలు షైతానుకు వ్యతిరేకం కదా. అంతేగాక, కుక్కలనుండి వచ్చే అప్రియకరమైన దుర్వాసన. దైవదూతలు దుర్వాసనను ఇష్టపడరు, అసహ్యించుకుంటారు. మరియు కుక్కలను ఇంటిలో ఉంచుకోవడం హరాం (నిషేధము). కనుక ఎవరైతే తన ఇంటిలో కుక్కలను ఉంచుకుంటాడో, అతని ఇంటిలోనికి అల్లాహ్ యొక్క కారుణ్యదూతలు ప్రవేశించకుండా, అతని కొరకు దుఆ చేయకుండా, దైవదూతల కారణంగా అతనిపై అల్లాహ్ యొక్క ఆశీర్వాదాలు మరియు అతని ఇంటిలో అల్లాహ్ యొక్క శుభాలు - వీటన్నింటి నుండి దూరం చేసి శిక్షించబడతాడు.

فوائد الحديث

వేటకొరకు, పశువుల రక్షణ కొరకు, మరియు పంటపొలాల రక్షణ కొరకు తప్ప కుక్కలను ఉంచుకొనుట హరాం (నిషేధము).

చిత్రపటాలను ఉంచుకొనుట దైవదూతలను ఇంటిలోనికి ప్రవేశించకుండా దూరంగా ఉంచే చెడు విషయాలలో ఒకటి. చిత్రపటాలు ఇంటిలో ఉండడం అల్లాహ్ యొక్క కరుణనుండి దూరం చేస్తుంది. ఇదే నియమం కుక్కలను ఇంటిలో ఉంచుకుంటే కూడా వర్తిస్తుంది.

కుక్క మరియు చిత్రపటం ఉన్న ఇళ్ళలోనికి ప్రవేశించని దైవదూతలు ఎవరంటే వారు అల్లాహ్ యొక్క కారుణ్య దూతలు. కానీ రక్షకుడు మరియు మృత్యుదూత వంటి బాధ్యతలు ఉన్న ఇతర దైవదూతల విషయానికొస్తే, వారు ప్రతి ఇంట్లోకి ప్రవేశిస్తారు.

ఈ హదీథు ద్వారా గోడలపై ఆత్మ కలిగిన సజీవుల చిత్రపటాలను వేళ్ళాడ దీయుట హరాం (నిషేధము) అని తెలియుచున్నది.

అల్ ఖత్తాబీ ఇలా అన్నారు: కుక్క గానీ, లేక నిషేధించబడిన వాటి చిత్రపటాలు గానీ, అంటే ఉదాహరణకు కుక్క చిత్రపటం, ఉన్న ఇంటిలోనికి దైవదూతలు ప్రవేశించరు. అయితే నిషేధము లేనివి ఏమిటంటే వేటకుక్కలు; పంటపొలాల కుక్కలు; మరియు పశువుల కాపలా కుక్కలు. అలాగే నిషేధించబడని చిత్రపటాలు అంటే ఉదాహరణకు కార్పెట్లపై, తలదిండ్ల గిలాబులపై ముద్రించే లేక చేతిపని ద్వారా గీచే లేక కుట్టబడిన డిజైన్లు, నక్షాలు, ప్రకృతి చిత్రాలు మొదలైనవి. ఇటువంటి నిషేధము కానివి ఇంటిలో ఉండుట దైవదూతల ప్రవేశానికి ఆటంకము కావు.

التصنيفات

తౌహీదె ఉలూహియ్యత్