"యూదులను మరియు క్రైస్తవులను అల్లాహ్ శపించు గాక! ఎందుకంటే వారు తమ ప్రవక్తల సమాధులను ప్రార్థనా స్థలాలుగా…

"యూదులను మరియు క్రైస్తవులను అల్లాహ్ శపించు గాక! ఎందుకంటే వారు తమ ప్రవక్తల సమాధులను ప్రార్థనా స్థలాలుగా చేసుకున్నారు."* ఆ తరువాత ఆమె ఇలా అన్నారు: "ఆయన సమాధిని ప్రార్థనా స్థలంగా చేసుకుంటారనే భయం లేకపోతే, ఆయన సమాధి పైకి కనబడేలా చేయబడి ఉండేది".

ఉమ్ముల్ ముమినీన్ అంటే విశ్వాసుల తల్లి అయిన ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన, తాను కోలుకోలేని అనారోగ్యంతో ఉన్న సమయంలో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "యూదులను మరియు క్రైస్తవులను అల్లాహ్ శపించు గాక! ఎందుకంటే వారు తమ ప్రవక్తల సమాధులను ప్రార్థనా స్థలాలుగా చేసుకున్నారు." ఆ తరువాత ఆమె ఇలా అన్నారు: "ఆయన సమాధిని ప్రార్థనా స్థలంగా చేసుకుంటారనే భయం లేకపోతే, ఆయన సమాధి పైకి కనబడేలా చేయబడి ఉండేది".

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఉమ్ముల్ ముమినీన్ అంటే విశ్వాసుల తల్లి అయిన ఆయిషా రదియల్లాహు అన్హా ఇలా పలికినారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం తన తీవ్రమైన అనారోగ్యంతో అంతిమ సమయంలో ఉన్నప్పుడు ఇలా పలికినారు: “అల్లాహ్ యూదులను మరియు క్రైస్తవులను శపించారు మరియు వారిని తన దయ నుండి బహిష్కరించినాడు, ఎందుకంటే వారు తమ ప్రవక్తల సమాధులను ప్రార్థనా స్థలాలుగా చేసుకున్నారు, వాటిపై కట్టడాలు నిర్మించడం లేదా వాటి దగ్గర ప్రార్థించడం లేదా వాటికి అభిముఖంగా నిలబడి ప్రార్థన చేయడం ద్వారా.” ఇంకా ఆమె రదియల్లాహు అన్హా ఇలా పలికినారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నిషేధం మరియు హెచ్చరిక లేకుంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధికి కూడా యూదులు మరియు క్రైస్తవులు తమ ప్రవక్తల సమాధులకు చేసినట్లుగానే జరుగుతుందనే భయం లేకుంటే, ఆయన సమాధి కనిపించేది మరియు ప్రముఖమైనదిగా తయారు చేయబడి ఉండేది.

فوائد الحديث

ఇది ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క చివరి ఆజ్ఞలలో ఒకటి, ఇది దాని ప్రాముఖ్యత మరియు ప్రత్యేకతను సూచిస్తుంది.

సమాధులను ప్రార్థనా స్థలాలుగా చేసుకోవడం మరియు అంత్యక్రియల ప్రార్థన (జనాజా నమాజు) కాకుండా వాటి వద్ద ప్రార్థన చేయడాన్ని ఖచ్చితంగా నిషేధించడం మరియు కఠినంగా నివారించడం. చనిపోయినవారిని ఆరాధించడం, ఆయన సమాధి చుట్టూ ప్రదక్షిణ చేయడం, దాని నలుమూలలను తాకడం మరియు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నామంతో, సిఫారసుతో వేడుకోవడం - ఇదంతా బహుదైవారాధన మరియు దాని మార్గాల నుండి వచ్చింది.

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఏకేశ్వరోపాసన పట్ల, సమాధుల ఆరాధనా భయం పట్ల చూపిన తీవ్రమైన వ్యతిరేకత మరియు దానిని పూర్తిగా నివారించాలని శ్రద్ధ చూపారు, ఎందుకంటే అది బహుదైవతారాధనకు దారితీస్తుంది.

సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఆయన సమాధి వద్ద బహుదైవారాధన జరగకుండా కాపాడాడు, కాబట్టి ఆయన తన సహాబాలను మరియు వారి తరువాత వచ్చే వారిని తన సమాధి బయటపడకుండా కాపాడమని ఆదేశించినాడు.

సహాబాలు రదియల్లాహు అన్హుమ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూచనల ప్రకారం ప్రవర్తించారు, ఆయన బోధనలు పాటించారు మరియు ఏకేశ్వరోపాసన పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు.

యూదులు మరియు క్రైస్తవులను అనుకరించడం నిషేధం, మరియు సమాధుల పైన నిర్మించడం అనేది వారి దురాచారాలలో ఒకటి.

వారు ప్రార్థనాలయం నిర్మించకపోయినా, సమాధుల దగ్గర ప్రార్థించడం మరియు వాటికి అభిముఖంగా నిలబడి ప్రార్థనలు చేయడం మొదలైనవి చేయడం.

التصنيفات

తౌహీదె ఉలూహియ్యత్, సమాదుల సందర్శన