إعدادات العرض
.
.
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహివ సల్లం చుట్టూ కూర్చున్నాము — మాతో అబూ బకర్, ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కూడా ఉన్నారు — అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం లేచి నిలబడి నడిచిపోతూ మా మధ్య నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. ఎంతసేపైనా ఆయన తిరిగి రాకపోవడంతో మేము ఆందోళనకు లోనయ్యాము. ఆయనకు ఏదైనా జరిగిందేమో అని భయపడ్డాము. మేము భయపడుతూ లేచి నిలిచాము. నేనే మొదట భయంతో స్పందించి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను వెతుకుతూ బయలుదేరాను.దారిలో బనూ నజ్జార్ తెగకు చెందిన ఒక అన్సార్ సాహాబీ తోట వద్దకు చేరుకున్నాను. ఆ తోట చుట్టూ తిరిగి, లోనికి ప్రవేశించడానికి ఏదైనా ద్వారం ఉందేమో అని చూశాను — కానీ ఏమి కనిపించలేదు. తోటకు బయట ఉన్న ఒక బావి నుండి తోట లోనికి నీళ్ళు ప్రవేశిస్తూ ఉన్న ఒక ప్రదేశం కనిపించింది. నేను బాగా క్రిందకు ఒదిగిపోయి ఆ ప్రదేశం గుండా లోనికి ప్రవేశించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు చేరుకున్నాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అబూ హురైరహ్” అన్నారు; దానికి నేను “అవును ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం” అని జవాబు పలికాను. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఏమైంది?” అని ప్రశ్నించారు. నేను “మీరు మాతో ఉన్నారు, ఆ తరువాత లేచి వెళ్లిపోయారు, ఎంత సేపైనా తిరిగి రాకపోయేసరికి మేము భయపడిపోయాం, మీకు ఏదైనా జరిగిందేమో అని. భయంతో అందరికంటే ముందు నేను మిమ్మల్ని వెదుకుతూ ఈ తోటకు వచ్చాను. అటు ప్రక్కనుంచి నక్క ప్రవేశించినట్లు నేను తోటలోనికి ప్రవేశించినాను. మిగతా వాళ్ళు నా వెనుక వస్తున్నారు” అన్నాను. ఆయన ﷺ, “ఓ అబూ హురైరా”, అని అన్నారు మరియు తన రెండు పాదరక్షలను నాకు అందజేసి, “ఈ రెండు పాదరక్షలతో వెళ్ళు. ఈ తోట చుట్టూ ఉన్న గోడ వెనుక నీవు ఎవరిని కలిసినా, అతడు “అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు” అని తన హృదయంలో పూర్తి నిశ్చయతతో సాక్ష్యమిచ్చి నట్లైతే, అతనికి స్వర్గ ప్రవేశాన్ని గురించిన శుభవార్తనివ్వు” అన్నారు. నేను మొదటగా కలిసిన వ్యక్తి ఉమర్ (రదియల్లాహు అన్హు). ఆయన అడిగారు “నీ చేతిలో ఆ రెండు పాదరక్షలు ఏమిటి ఓ అబూ హురైరహ్?” నేను సమాధానమిచ్చాను: “ఇవి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహివ సల్లం గారి పాదరక్షలు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంనన్ను వీటితో పంపారు. నేను కలిసిన ఎవరికైనా, అతడు “అల్లాహ్ తప్ప మరో నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు” అని హృదయపూర్వకంగా, పూర్తి నిశ్చితత్వముతో సాక్ష్యము ఇచ్చినట్లైతే, అతనికి స్వర్గప్రవేశము యొక్క శుభవార్త వినిపించమని” అప్పుడు ఉమర్ (రదియల్లాహు అన్హు) నా ఛాతీపై బలంగా మోదినారు. నేను వెల్లకిలా పడిపోయాను. ఆయన “వెనుకకు తిరిగి వెళ్ళు, ఓ అబూ హురైరహ్” అన్నారు. అప్పుడు నేను ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం వద్దకు తిరిగివచ్చాను. నేను ఆగకుండా ఏడుస్తూనే ఉన్నాను. నా వెనుకనే ఉమర్ (రదియల్లాహు అన్హు) వచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం అడిగారు: “అబూ హురైరా! నీకు ఏమైంది?” “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంకు చెప్పాను: “నేను ఉమర్ (రదియల్లాహు అన్హు)ను కలిశాను. మీరు నాకు అప్పగించిన సందేశాన్ని ఆయనకు చెప్పాను. ఆయన నా ఛాతీపై బలంగా కొట్టారు, నేలపై పడిపోయాను. ఆయన: “ఓ అబూ హురైరహ్, తిరిగి వెళ్ళు” అన్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం ప్రశ్నించారు: “ఓ ఉమర్, నీవు ఇలా ఎందుకు చేశావు?” ఉమర్ (రదియల్లాహు అన్హు) ఇలా సమాధానమిచ్చారు: “ఓ రసూలుల్లాహ్! (సల్లల్లాహు అలైహి వ సల్లం) నా తండ్రి మరియు తల్లి మీ కొరకు త్యాగం (ఖుర్బాన్) చేయబడుదురు గాక. మీరు నిజంగా అబూ హురైరాని మీ పాదరక్షలతో పంపినారా? ఎవరు కలిసినా, అతడు “అల్లాహ్ తప్ప మరో నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు” అని హృదయపూర్వకంగా, పూర్తి నిశ్చితత్వముతో సాక్ష్యము ఇచ్చినట్లైతే, అతనికి స్వర్గప్రవేశము యొక్క శుభవార్త వినిపించమని” చెప్పినారా?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అవును” అన్నారు. అపుడు ఉమర్ రజియల్లాహు అన్హు “అలా చేయవద్దు, (మంచి పనులు చేయడం వదిలివేసి) ప్రజలు ఆ ఒక్క వాక్యం పైనే భారం వేసి ఉండిపోతారేమోనని నాకు భయంగా ఉన్నది. వారిని మంచి పనులు చేయడం కొనసాగించనివ్వండి” అన్నారు. దానికి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం “అలాగే కానివ్వండి” అన్నారు.
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी Tiếng Việt සිංහල ئۇيغۇرچە Kurdî Português Kiswahili Nederlands অসমীয়া ગુજરાતી Magyar ქართული Hausa Română ไทยالشرح
ఒకసారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కొంతమంది సహబాలతో కూర్చుని ఉన్నారు, వారిలో అబూబకర్, ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కూడా ఉన్నారు. అంతలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం లేచి నిలబడి అక్కడినుండి బయలుదేరినారు. చాలా సేపటి వరకూ తిరిగి రాకపోయేసరికి శత్రువులు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ను పట్టుకుని ఉంటారా, లేక ఏమైనా చేసి ఉంటారా అని సహబాలు భయపడినారు. ఈ ఆలోచనతో సహబాలు (రదియల్లాహు అన్హుమ్) భయంతో లేచి నిలబడినారు. అలా భయపడిన వారిలో మొదటి వాడు అబూ హురైరాహ్ (రదియల్లాహు అన్హు). ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను వెదుకుతూ బనూ నజ్జార్ తెగకు చెందిన ఒన్ అన్సారీ సాహబీ తోట వద్దకు చేరుకున్నాడు. అందులోనికి ప్రవేశించడానికి ఏదైనా దారి ఉందా అని ఆ తోట చుట్టూ తిరిగినాడు. కానీ అతనికి ఏ దారీ కనిపించలేదు. అయితే తోట చుట్టూ ఉన్న గోడలో ఒక చోట చిన్న దారి గుండా నీళ్ళు లోనికి ప్రవేశిస్తూ ఉండడం గమనించినాడు. ఆయన బాగా ఒదిగి ఆ దారి గుండా తోట లోనికి ప్రవేశించి అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను చూచినాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరిదీ, అబూ హురైరాహ్ నువ్వేనా?” అని ప్రశ్నించినారు. దానిని అతడు “అవును” అన్నాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “ఏమైంది?” అని ప్రశ్నించారు. దానికి అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “మీరు మా మధ్యన ఉండినారు. లేచి నిలబడి బయలుదేరి వెళ్ళినారు. ఎంతసేపైనా మీరు తిరిగి రాలేదు. మీతో సంబంధం తెగిపోతుందేమో అని భయపడినాము. అలా భయపడిన వారిలో నేను మొదటి వాడిని. అలా మిమ్మల్ని వెదుకుతూ ఈ తోట గోడ వద్దకు చేరుకున్నాను, బాగా ఒదిగి పోయి నక్క మాదిరిగా ఇందులోనికి ప్రవేశించినాను. మిగతా వారు నావెనుక వస్తున్నారు.” అపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)అతను సత్యవంతుడని సంకేతంగా, గుర్తుగా అతనికి తన పాదరక్షలు ఇచ్చినారు – (అక్కడి నుండి బయలుదేరిన తరువాత అబూ హురైరాహ్ ఇతరులకు చెప్పబోయేదంతా నిజమే అనడానికి తన గుర్తుగా, సూచనగా). తరువాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయనతో ఇలా అన్నారు: “ఈ నా పాదరక్షలతో తిరిగి వెళ్ళు, ఈ గోడ అవతల – “అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడు, అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేడు” అని హృదయపూర్వకంగా, పూర్తి నిశ్చితత్వంతో సాక్ష్యము పలికే ఎవరిని కలిసినా, అతనిలో ఈ గుణవిశేషణాలు ఉంటే, అతడు స్వర్గ నివాసులలో ఒకడు అనే శుభవార్తను అతనికి వినిపించు.” అక్కడినుండి బయలుదేరిన తరువాత అబూ హురైరాహ్ మొట్టమొదట కలిసిన వ్యక్తి ఉమర్ (రదియల్లాహు అన్హు). ఆయన “ఈ పాదరక్షలు ఏమిటి, ఓ అబూ హురైరాహ్?” అని ప్రశ్నించినారు. దానికి అతడు “ఇవి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పాదరక్షలు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వీటిని నాకిచ్చి పంపించినారు - “అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేడు” అని హృదయపూర్వకంగా, పూర్తి నిశ్చితత్వంతో సాక్ష్యము పలికే ఎవరిని కలిసినా అతనికి స్వర్గప్రవేశపు శుభవార్త వినిపించమని” అని జవాబిచ్చినాడు. అది విని ఉమర్ (రదియల్లాహు అన్హు), అబూ హురైరాహ్ (రదియల్లాహు అన్హు) ఛాతీ పై బలంగా మోదినారు, దానితొ ఆయన వెల్లకిలా పడిపోయినారు. ఉమర్ రదియల్లాహు అన్హు “వెనుదిరిగి వెళ్ళు, ఓ అబూ హురైరహ్” అన్నారు. అబూ హురైరహ్ ఇలా అన్నారు “నేను వెనుదిరిగి భయంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి వద్దకు వెళ్ళినాను. నేను ఏడుస్తూ ఉన్నాను. ఉమర్ (రదియల్లాహు అన్హు) నా వెనుకనే నడుచుకుంటూ వచ్చినారు.” ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఏమైంది నీకు ఓ అబూ హురైరాహ్?” అని ప్రశ్నించినారు. నేను “నేను మొదటగా ఉమర్ (రదియల్లాహు అన్హు)ను కలిసినాను. మీరు ఏమి చెప్పమన్నారో అది ఆయనకు చెప్పినాను. ఆయన నా ఛాతీ పై బలంగా మోదినారు, నేను వెల్లకిలా పడిపోయినాను. ఆయన “వెనుదిరిగి వెళ్ళు” అన్నారు. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఎందుకు అలా చేసావు ఓ ఉమర్?” అని ప్రశ్నించినారు. అపుడు ఉమర్ రదియల్లాహు అన్హు “నా తల్లిదండ్రులు మీకొరకు త్యాగం చేయబడుదురుగాక ఓ ప్రవక్తా! మీరు అబూ హురైరహ్ కు మీ పాదరక్షలనిచ్చి పంపించినారా - “అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేడు” అని హృదయపూర్వకంగా, పూర్తి నిశ్చితత్వంతో సాక్ష్యము పలికే ఎవరిని కలిసినా అతనికి స్వర్గప్రవేశపు శుభవార్త వినిపించమని?” అని అడిగినారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “అవును” అన్నారు. అపుడు ఉమర్ (రదియల్లాహు అన్హు) “అలా చేయకండి, ప్రజలు ఈ మాటలపైనే భారం వేసి, ఆచరణలను ఆచరించడం వదిలివేస్తారేమో అని భయంగా ఉంది నాకు” అన్నారు. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “అయితే వారిని అలాగే వదిలివేయండి” అన్నారు.فوائد الحديث
ఈ హదీథులో రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) పట్ల సహచరులకు ఉన్న అమితమైన ప్రేమ మరియు అన్ని రకాల చెడులనుండి, హాని కలిగించే వాని నుండి ఆయన భద్రత పట్ల వారి ఆందోళన మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ప్రజలకు శుభవార్తలను వినిపించడం షరియత్ ప్రకారం సరియైనదే అని దీని ద్వారా తెలుస్తున్నది.
విశ్వాసం అనేది మాటలు, చేతలు మరియు నమ్మకాలకు సంబంధించిన విషయం.
ఇమాం అల్’ఖాదీ ఇయాద్ మరియు ఇతరులు ఇలా అన్నారు: ఉమర్ రదియల్లాహు అన్హు యొక్క చర్యలు మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను ప్రశ్నించడం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన దానికి అభ్యంతరం వ్యక్తం చేయడం లేదా ఆయన ఆజ్ఞను తిరస్కరించడం కాదు, ఎందుకంటే అబూ హురైరాను పంపడం వెనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉద్దేశ్యం ఉమ్మత్ (ముస్లిం జాతి) యొక్క హృదయాలను సంతోషపెట్టడం మరియు వారికి శుభవార్త వినిపించడం. ఉమర్ రదియల్లాహు అన్హు ఆ వార్తను దాచడం ఉమ్మత్’కు మంచిదని మరియు పూర్తిగా దానిపై మాత్రమే ఆధారపడకుండా చేసే అవకాశం ఉందని మరియు ఈ శుభవార్తను అందించడం కంటే ఇలా చేయడం వారికి శుభవార్తను త్వరగా తీసుకువస్తుందని ఆయన నమ్మాడు. ఆయన (ఉమర్) తన అభిప్రాయాన్ని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు చెప్పినప్పుడు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం దానిని వెంటనే ఆమోదించినారు.
ఇమాం నవవి రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: ఈ హదీసు స్పష్టంగా సూచిస్తుంది, ఒక ఇమామ్ లేదా నాయకుడు సాధారణంగా ఏదైనా చూస్తే మరియు అతని అనుచరులలో కొందరు దానిని భిన్నంగా చూస్తే, అనుచరుడు తన ఆలోచనను, అభిప్రాయాన్ని నాయకుడి పరిశీలన కోసం సమర్పించాలి. అనుచరుడు చెప్పేది సరైనదని అతనికి స్పష్టంగా తెలిస్తే, నాయకుడు దానిని పరిశీలించాలి. లేకపోతే, అనుచరుడు తనకు ఎదురైన సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి, నాయకుడు సమాధానాన్ని అతనికి వివరించాలి.
ప్రజల యొక్క బహుళ ప్రయోజనం దృష్ట్యా, లేక దాని వల్ల ప్రజలకు హాని కలుగుతుందేమో అనే భయం గానీ ఉన్నట్లైతే అటువంటి ఙ్ఞానాన్ని ప్రజల వరకు చేరకుండా ఆపి ఉంచడం అనుమతించబడినదే.
ఇది ఏక దైవారాధన (తౌహీద్) పై ఉన్న వారందరికీ ఒక గొప్ప్ శుభవార్త. ఎవరైతే హృదయపూర్వకంగా, పూర్తి నిశ్చితత్వముతో “అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు” అని సాక్ష్యము పలుకుతాడో అతనికి స్వర్గము ప్రసాదించబడుతుంది.
ఉమర్ (రదియల్లాహు అన్హు) యొక్క బలం, ఆయన జ్ఞానం మరియు విస్తృత అవగాహన స్పష్టంగా తెలుస్తున్నాయి.
ఇమాం నవవి రహిమహుల్లాహ్ ఇలా చెప్పారు:
ఈ హదీతో మరొక విషయం కూడా తెలుస్తోంది — అదే, ఒక వ్యక్తి అనుమతి లేకుండానే ఇతరుల సంపద (ఉదా: పొలము, తోట, ఇల్లు మొదలైనవి) లోనికి ప్రవేశించవచ్చు. అయితే అలా ప్రవేశించిన విషయం ఆ సంపద యజమానికి తెలిసినట్లైతే, తమ మధ్య ఉన్న స్నేహము, అభిమానము, గౌరవము కారణంగా, అతడు సంతోషపడతాడు; అయిష్టం వ్యక్తం చేయడు, లేక అసహ్యించుకోడు అనే పూర్తి విశ్వాసము ఉన్నట్లైతే.
التصنيفات
తౌహీదె ఉలూహియ్యత్