“ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, ఏదో ఒక విషయాన్ని గురించి మాట్లాడినాడు. తరువాత అతడు…

“ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, ఏదో ఒక విషయాన్ని గురించి మాట్లాడినాడు. తరువాత అతడు ‘అల్లాహ్ మరియు మీరు కోరిన విధంగా జరుగుతుంది’ అన్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఏమిటీ, నువ్వు నన్ను అల్లాహ్’కు సమానుడిగా చేస్తున్నావా? ఇలా అను: “ఏకైకుడైన అల్లాహ్ కోరిన విధంగానే జరుగుతుంది.”

అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, ఏదో ఒక విషయాన్ని గురించి మాట్లాడినాడు. తరువాత అతడు ‘అల్లాహ్ మరియు మీరు కోరిన విధంగా జరుగుతుంది’ అన్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఏమిటీ, నువ్వు నన్ను అల్లాహ్’కు సమానుడిగా చేస్తున్నావా? ఇలా అను: “ఏకైకుడైన అల్లాహ్ కోరిన విధంగానే జరుగుతుంది.”

[దాని ఆధారాలు ప్రామాణికమైనవి]

الشرح

ఒక మనిషి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, తనకు సంబంధించిన ఏదో ఒక విషయాన్ని గురించి మాట్లాడినాడు. తరువాత ఇలా అన్నాడు “అల్లాహ్ మరియు మీరు కోరిన విధంగా జరుగుతుంది” అని. అతడు అలా అనడాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖండించి, అతనికి ఇలా తెలియజేసినారు: సృష్ఠికర్త అయిన అల్లాహ్ ఇచ్ఛను (ఇష్టమును) ఆయన సృష్టించిన సృష్టితాల ఇచ్ఛతో “వావ్” (و మరియు) అనే సముచ్చయం (conjunction) తో కలిపి ఒకటిగా చేయడం “చిన్న స్థాయి షిర్క్ – బహుదైవారాధన- అవుతుంది. ఒక ముస్లిం అలా అనరాదు.” తరువాత ఆయన అతడిని సరైన పదాలు పలుకుట వైపునకు మార్గనిర్దేశం చేసినారు: “అల్లాహ్ సంకల్పించినది మాత్రమే జరుగుతుంది” అని పలుకమని, అల్లాహ్’ను ఆయన సంకల్పములో ఏకైకునిగా స్థిరపరిచినారు. ‘మరియు’ అనే సముచ్చయ పదాలను ఉపయోగించి ఆయన సంకల్పాన్ని ఇతరుల సంకల్పాలతో ఏకం చేయలేదు.

فوائد الحديث

“అల్లాహ్ కోరిన విధంగా ‘మరియు’ మీరు కోరిన విధంగా జరుగుతుంది” అని, లేక అటువంటి అర్థాన్ని/భావాన్ని ఇచ్చే మాటలను, ‘మరియు’ అనే పదాన్ని ఉపయోగించి అల్లాహ్ ఇష్టాన్ని, దాసుని ఇష్టాన్ని ఒకటిగా చేసేలా మాట్లాడడం నిషేధము. ఎందుకంటే అది ‘చిన్న స్థాయి షిర్క్’ (చిన్న స్థాయి బహుదైవారాధన) అవుతుంది.

ఈ హదీసులో చెడును, కీడును నిరాకరించడం తప్పనిసరి అనే బోధన ఉన్నది. అది ఒక ముస్లిం యొక్క విధి.

ఈ హదీసులో రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తౌహీద్ (ఏకేశ్వరోపాసన) యొక్క పవిత్రతను సంరక్షించారు. మరియు షిర్క్‌కు దారి తీసే మార్గాలను అడ్డుకున్నారు.

చెడును నిషేధించేటప్పుడు, ప్రవక్త యొక్క ఉదాహరణను (సున్నత్ ను) అనుసరించి, మనం ఎవరికైతే సలహా ఇస్తున్నామో ఆ వ్యక్తిని, (షరియత్ ప్రకారం) అనుమతించదగిన వేరే ప్రత్యామ్నాయం వైపునకు మార్గనిర్దేశం చేయడం మంచిది.

ఈ హదీథ్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మాటలు: “ఏకైకుడైన అల్లాహ్ సంకల్పించినదే జరుగుతుంది”; మరొక హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఏకైకుడైన అల్లాహ్ సంకల్పించిన విధంగా, ఆ తరువాత మీరు సంకల్పించిన విధంగా జరుగుతుంది” అని పలకండి” అని అన్నట్లుగా నమోదు చేయబడి ఉన్నది. ఈ రెండు విధానాలలో - “ఏకైకుడైన అల్లాహ్ సంకల్పించిన విధంగా, ఆ తరువాత మీరు సంకల్పించిన విధంగా జరుగుతుంది” – అని అనడం సరియైనదే, దానికి అనుమతి ఉన్నది; అయితే “ఏకైకుడైన అల్లాహ్ సంకల్పించినదే జరుగుతుంది” అని పలకడం ఉత్తమం.

“ఏకైకుడైన అల్లాహ్ సంకల్పించిన విధంగా, ఆ తరువాత మీరు సంకల్పించిన విధంగా జరుగుతుంది” – అని అనడం సరియైనదే, అయితే “ఏకైకుడైన అల్లాహ్ సంకల్పించినదే జరుగుతుంది” అని పలకడం ఉత్తమం.

التصنيفات

తౌహీదె ఉలూహియ్యత్