إعدادات العرض
“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను ఏ ఆదేశాలతో ఇక్కడికి పంపినారో, అవే ఆదేశాలతో నిన్ను కూడా పంపనా! ఏ…
“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను ఏ ఆదేశాలతో ఇక్కడికి పంపినారో, అవే ఆదేశాలతో నిన్ను కూడా పంపనా! ఏ చిత్రపటాన్నైనా, ప్రతిమ, బొమ్మ, శిల్పము మొదలైన వాటిని చెరిపి వేయకుండా, తొలగించకుండా వదలకు, అలాగే ఎత్తుగా నిర్మించిన లేదా ఏదైనా కట్టడం నిర్మించి ఉన్న ఏ సమాధిని కూడా నేలమట్టం చేయకుండా వదలకు.”
అబూ హయ్యాజ్ అల్ అసదీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నాతో అలీ ఇబ్న్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను ఏ ఆదేశాలతో ఇక్కడికి పంపినారో, అవే ఆదేశాలతో నిన్ను కూడా పంపనా! ఏ చిత్రపటాన్నైనా, ప్రతిమ, బొమ్మ, శిల్పము మొదలైన వాటిని చెరిపి వేయకుండా, తొలగించకుండా వదలకు, అలాగే ఎత్తుగా నిర్మించిన లేదా ఏదైనా కట్టడం నిర్మించి ఉన్న ఏ సమాధిని కూడా నేలమట్టం చేయకుండా వదలకు.”
الترجمة
العربية Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский اردو 中文 हिन्दी বাংলা Kurdî Hausa Português മലയാളം Kiswahili தமிழ் සිංහල မြန်မာ ไทย Deutsch 日本語 پښتو Tiếng Việt অসমীয়া Shqip Svenska Čeština ગુજરાતી አማርኛ Yorùbá Nederlands ئۇيغۇرچە Türkçe دری Magyar Italiano ಕನ್ನಡ Кыргызча Lietuvių Malagasy Română Kinyarwanda नेपाली Српски Wolof Soomaali Moore Українська Български Tagalog Azərbaycan ქართული тоҷикӣ bm Oromoo Македонскиالشرح
(మక్కా విజయం తరువాత) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులను - సజీవులదైనా లేదా నిర్జీవులదైనా (దేవతల) ఏ చిత్రపటాన్ని, శిల్పము, బొమ్మ, ప్రతిమను చూసినా దానిని తొలగించకుండా లేదా చెరిపివేయకుండా వదల రాదు అనే నిర్దేశాలతో నలువైపులకు పంపేవారు. అలాగే తన సహచరులను – ఎత్తుగా కట్టబడి ఉన్న ఏ సమాధినైనా లేదా ఏదైనా కట్టడము నిర్మించబడి ఉన్న ఏ సమాధినైనా సరే, దానిని ధ్వంసం చేయాలని లేదా నేలమట్టం చేయాలని, ఏ సమాధియైనా భూమికి ఒక మూరెడు ఎత్తు మాత్రమే ఉండాలనే నిర్దేశాలతో పంపే వారు.فوائد الحديث
ఈ హదీసు ద్వారా సజీవుల చిత్రాలను, శిల్పాలను, మూర్తులను, ప్రతిమలను గీయడం, తయారు చేయడం, నిర్మించడం మొదలైనవి అన్నీ నిషేధము అని తెలుస్తున్నది. ఎందుకంటే అవి షిర్క్ నకు (బహుదైవారాధనకు) దారితీస్తాయి.
ఎవరైతే అధికారములో ఉన్నారో లేదా అధికారము కలిగి ఉన్నారో వారు, ఏదైనా కీడు కలిగించే దానిని లేదా ఏదైనా హాని కలిగించే దానిని తమ చేతులతో తొలగించవచ్చును – అది న్యాయసమ్మతమే అనే విషయము తెలుస్తున్నది.
‘జాహిలియ్యహ్ కాలము’ (ఇస్లాంకు పూర్వ కాలము) నాటి బహుదైవారాధనకు చెందిన లేదా బహుదైవారాధనకు దారి తీసే ప్రతి చిహ్నాన్ని, సంకేతాన్ని – ఉదాహరణకు, చిత్రపటాలు, శిల్పాలు, మూర్తులు, ప్రతిమలు, అలాగే ఎత్తుగా నిర్మించబడిన సమాధులు లేదా సమాధులపై నిర్మించబడి ఉన్న కట్టడాలు మొదలైన వాటిని తొలగించుటలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చురుకుగా ఉండేవారు.
التصنيفات
తౌహీదె ఉలూహియ్యత్