తీర్పు దినమునాడు నా మధ్యవర్తిత్వాన్ని పొందే (నా సిఫారసు పొందే) ఆ అదృష్టవంతుడు ఎవరంటే – “లా ఇలాహ ఇల్లల్లాహ్” (నిజ…

తీర్పు దినమునాడు నా మధ్యవర్తిత్వాన్ని పొందే (నా సిఫారసు పొందే) ఆ అదృష్టవంతుడు ఎవరంటే – “లా ఇలాహ ఇల్లల్లాహ్” (నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, కేవలం అల్లాహ్ తప్ప) అని ఎవరైతే నిష్కల్మషంగా, హృదయపూర్వకంగా పలుకుతాడో అతడు

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను వారిని ఇలా అడిగాను “ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం! తీర్పు దినమునాడు (అల్లాహ్ వద్ద) మీ మధ్యవర్తిత్వం లభించే (మీ సిఫారసు పొందే) ఆ అదృష్టవంతుడెవరు?”. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “ ఓ అబూ హురైరాహ్! నేను అనుకుంటూనే ఉన్నాను నీ కంటే ముందు ఎవరూ ఈ ప్రశ్న అడుగరు అని నాకు తెలుసు, నీలో హదీసులు నేర్చుకునే ఆశ, ఆసక్తి ఎక్కువ అనీను. తీర్పు దినమునాడు నా మధ్యవర్తిత్వాన్ని పొందే (నా సిఫారసు పొందే) ఆ అదృష్టవంతుడు ఎవరంటే – “లా ఇలాహ ఇల్లల్లాహ్” (నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, కేవలం అల్లాహ్ తప్ప) అని ఎవరైతే నిష్కల్మషంగా, హృదయపూర్వకంగా పలుకుతాడో అతడు".

[దృఢమైనది] [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు – తీర్పు దినము నాడు తన మధ్యవర్తిత్వాన్ని పొందే వారు ఎవరంటే, ఎవరైతే ‘నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, కేవలం అల్లాహ్ తప్ప’ అని చిత్తశుద్ధితో హృదయపూర్వకంగా పలుకుతాడో’. అంటే, ‘కేవలం అల్లాహ్ తప్ప, నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు’ అని పలుకబడే సాక్ష్యం స్వచ్ఛమైనదై ఉండాలి, షిర్క్ (అల్లాహ్ కు ఇతరులను సాటి కల్పించడం) మరియు కపటత్వముల నుండి విముక్తి అయినదై ఉండాలి.

فوائد الحديث

ఇందులో ‘కేవలం అల్లాహ్ మాత్రమే ఏకైక నిజ ఆరాధ్యుడు’ అని మనస్ఫూర్తిగా విశ్వసించే ఏకదైవారాధకులకు తీర్పు దినమున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు ప్రాప్తమవుతుంది అనే నిదర్శనం ఉన్నది.

ఇక్కడ “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు” అంటే, “కేవలం అల్లాహ్ మాత్రమే నిజ ఆరాధ్యుడు” అనే తమ విశ్వాసంలో స్వచ్ఛత కలిగి ఉన్న ఏకదైవారాధకులు, ఒకవేళ నరకాగ్ని శిక్షకు పాత్రులై ఉంటే, అటువంటి వారు నరకంలో ప్రవేశించకుండా ఉండుటకు; అలాగే అటువంటి వారు ఒకవేళ నరకంలో శిక్ష అనుభవిస్తూ ఉండినట్లయితే, వారిని ఆ శిక్షనుండి బయటకు తీయుటకు గానూ, అల్లాహ్ వద్ద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసే వేడుకోలు అన్నమాట.

అల్లాహ్ పట్ల “తౌహీద్” (కేవలం అల్లాహ్ ఒక్కడే నిజ ఆరాధ్యుడు అనే కల్మషం లేని విశ్వాసం) యొక్క ఆ పలుకుల ఘనత మరియు మనస్ఫూర్తిగా అంటే షిర్క్ మరియు కపటత్వము అనేవి లేకుండా స్వచ్ఛంగా పలుకబడినపుడు వాటి ప్రభావమూ ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

“తౌహీద్” యొక్క ఆ పలుకుల ద్వారా ప్రాప్తమయ్యే శుభాలు, ఆ పలుకుల అర్థాన్ని ఆకళింపు చేసుకుని, వాటిపై ఆచరిస్తేనే ప్రాప్తమవుతాయి.

ఈ హదీసు ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబీగా అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు యొక్క ఘనత మరియు ఙ్ఞాన సముపార్జనలో ఆయన ఉత్సాహం

التصنيفات

తౌహీదె ఉలూహియ్యత్