إعدادات العرض
అగోచర విషయాల తాళపు చెవులు ఐదు
అగోచర విషయాల తాళపు చెవులు ఐదు
అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: «అగోచర విషయాల తాళపు చెవులు ఐదు, {నిశ్చయంగా, ఆ (అంతిమ) ఘడియ జ్ఞానము కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉంది. మరియు ఆయనే వర్షం కురిపించేవాడు మరియు గర్భాలలో ఉన్నదాని విషయం తెలిసినవాడు. మరియు తాను రేపు ఏమి సంపాదిస్తాడో, ఏ మానవుడు కూడా ఎరుగడు మరియు ఏ మానవుడు కూడా తాను ఏ భూభాగంలో మరణిస్తాడో కూడా ఎరుగడు. నిశ్చయంగా, అల్లాహ్ మాత్రమే సర్వజ్ఞుడు, సమస్తం ఎరిగినవాడు.}».
الترجمة
العربية Português دری Македонски Tiếng Việt Magyar ქართული বাংলা Kurdî Indonesia ไทย অসমীয়া Nederlands ਪੰਜਾਬੀ Kiswahili Tagalog Hausa ភាសាខ្មែរ English ગુજરાતી Русский मराठी മലയാളം ಕನ್ನಡ Српски සිංහල Türkçe हिन्दी اردوالشرح
అగోచర జ్ఞానం కేవలం అల్లాహ్ వద్ద మాత్రమే ఉన్నది, దానిని ఆయన తప్ప మరెవ్వరూ ఎరుగరు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం (అల్లాహ్ అనుజ్ఞతో) అగోచర విషయాల తాళపు చెవులు మరియు దాని నిధులు ఐదు అని తెలియజేశారు: మొదటిది: ప్రళయం ఎప్పుడు సంభవిస్తుందో అల్లాహ్ కు తప్ప ఎవ్వరికీ తెలియదు, ఇది పరలోక జ్ఞానాలకు సూచన, ఎందుకంటే ప్రళయదినం దానిలో మొదటిది, మరియు త్వరలో సంభవించబోయే దాని జ్ఞానమే నిరాకరించబడినప్పుడు, దాని తర్వాత వచ్చే దాని జ్ఞానం (పరలోక జీవితం) కూడా నిరాకరించబడుతుంది. రెండవది: వర్షము ఎప్పుడు వస్తుందో అల్లాహ్ కు తప్ప మరెవరికీ తెలియదు. ఇది ఉన్నత ప్రపంచ విషయాలను సూచిస్తుంది. మరియు సాధారణంగా అది సంభవిస్తుందని సూచించే కారణాలు దానికి ఉన్నప్పటికీ వర్షము ప్రత్యేకించబడింది, కానీ అది నిర్ధారణ మరియు ఖచ్చితం లేకుండా ఉంటుంది. మూడవది: గర్భాలలో ఉండేవి; మగ లేదా ఆడ, నలుపు లేదా తెలుపు, పూర్తిగా లేదా లోపభూయిష్టమైన, పాపాత్ముడు లేదా పుణ్యాత్ముడు మొదలైనవి. మరియు గర్భాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది, ఎందుకంటే చాలా మందికి ఆచారాల ప్రకారం దాని గురించి తెలుసు. అయినప్పటికీ, దాని వాస్తవికతను ఎవరూ తెలుసుకోలేరని ఆయన స్పష్టం చేశారు, ఇక ఇతర విషయాల గురించి చెప్పనవసరం లేదు. నాలుగవది: రేపు ఏమి జరుగుతుందో అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ తెలియదు. ఇది కాలం యొక్క వివిధ దశలను మరియు వాటిలో సంభవించే సంఘటనలను సూచిస్తుంది. ఇక్కడ "రేపు" అనే పదం వాడబడింది, ఎందుకంటే అది అత్యంత సమీప భవిష్యత్తు. దానికి సంబంధించిన సూచనలు మరియు గుర్తులు ఉండే అవకాశం ఉన్నప్పటికీ, అంత సమీపంలో ఉన్న దానిలో వాస్తవంగా ఏమి జరగబోతుందో తెలియకపోతే, ఇక దానికంటే దూరంగా ఉన్న భవిష్యత్తు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐదవది: ఏ మానవుడు కూడా తాను ఏ భూభాగంలో మరణిస్తాడో ఎరుగడు, ఇది భూలోక విషయాలకు సంబంధించిన ఒక సూచన. చాలా మంది ప్రజలు తమ స్వస్థలంలోనే మరణించడం ఆనవాయితీ అయినప్పటికీ, అది వాస్తవం కాదు. అంతేకాదు, ఒకవేళ అతను తన స్వస్థలంలో మరణించినా, అందులోని ఏ ప్రదేశంలో అతను ఖననం చేయబడతాడో అతనికి తెలియదు, అక్కడ అతని పూర్వీకుల సమాధుల స్థలం ఉన్నప్పటికీను. {నిశ్చయంగా, అల్లాహ్ మాత్రమే సర్వజ్ఞుడు, సమస్తం తెలిసినవాడు (ఎరిగినవాడు)}. ఆయన బహిరంగ మరియు అంతర్గత విషయాలను, దాగి ఉన్న మరియు రహస్యమైన విషయాలను, మరియు అంతరంగాలను పరివేష్టించి ఉన్నాడు. కాబట్టి ఈ ఆయతు అన్ని రకాల అగోచర విషయాలను సమీకరించి, అన్ని తప్పుడు వాదనలను తొలగించింది.فوائد الحديث
అల్లాహ్ కు తప్ప ఎవరికీ తెలియని ఐదు అగోచర నిధుల వివరణ గురించి తెలుస్తున్నది.
అస్-సిందీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మాట “అగోచర జ్ఞానం యొక్క తాళం చెవులు ఐదు” అంటే దాని అర్థం: ఈ ఐదు విషయాలను అగోచర జ్ఞానం యొక్క తాళం చెవులు అని పిలుస్తారు; ఎందుకంటే ఎవరి వద్ద అయితే ఈ ఐదు విషయాల జ్ఞానం ఉంటుందో, వారి వద్ద అగోచర జ్ఞానమంతా ఉన్నట్లే. అందువలన, అవి అగోచర జ్ఞానం యొక్క నిధుల ఖజానాలను తెరిచే తాళం చెవుల వలే పేర్కొనబడినాయి.
ఇబ్న్ హజర్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఇబ్న్ అబీ జమ్ రహ్ ఇలా అన్నారు: వినేవారికి విషయాన్ని సులభంగా అర్థం చేయించడానికి 'మఫాతిహ్' (తాళంచెవులు) అనే పదాన్ని ఉపయోగించారు; ఎందుకంటే, నీకు మరియు ఒక వస్తువుకు మధ్య ఒక తెర అడ్డుగా ఉంటే, అది నీకు అగోచరంగా (గాయబ్) ఉంటుంది. సాధారణంగా దాని జ్ఞానాన్ని ద్వారం ద్వారానే చేరుకోగలం. ఒకవేళ ఆ ద్వారం మూసివేయబడితే, దానిని తెరవడానికి తాళం చెవి అవసరం అవుతుంది. కాబట్టి, అగోచర జ్ఞానాన్ని చేరడానికి ఏకైక మార్గమైన ఆ తాళం చెవి స్థానమే తెలియకపోతే, ఇక ఆ అగోచర విషయం ఎలా తెలుస్తుంది?
ఇబ్నె అబీ జమ్రా రహిమహుల్లాహ్ ఇలా సెలవిచ్చారు: వాటిని ఐదుగా చేయడంలో ఉన్న వివేకం, వాటిలో లోకాలను నిక్షిప్తం చేయడమనే దానికి సూచన.
మహోన్నతుడైన అల్లాహ్ తన వివేకం వలన తన సందేశహరులకు కొన్ని అగోచర విషయాలను బహిర్గతపరుస్తాడు.
జ్యోతిష్కులు మరియు సోదె చెప్పేవారు అగోచర జ్ఞానం గురించి చేసే ఊహాగానాలను నిరర్థకం చేయడం మరియు పరమ పవిత్రుడైన అల్లాహ్ తనకే ప్రత్యేకించుకున్న జ్ఞానానికి సంబంధించిన ఏ విషయం గురించైనా తనకు తెలుసని ఎవరైనా వాదిస్తే, అతను మహోన్నతుడైన అల్లాహ్ ను, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను మరియు మహోన్నతమైన ఖుర్ఆన్ ను అసత్యమని చెప్పినట్లే.
