. .

ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిస్తుండగా నేను విన్నాను: “మరియం కుమారుడైన ఈసా అలైహిస్సలాం ను క్రైస్తవులు (హద్దుమీరి) కీర్తించిన విధంగా, నా ప్రశంసలో అతిశయం చేయకండి. నిశ్చయంగా నేను ఆయన (అల్లాహ్) దాసుడను. కనుక నన్ను ‘అల్లాహ్ యొక్క దాసుడు మరియు ఆయన సందేశహరుడు’ అని మాత్రమే అనండి.

[దృఢమైనది] [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో: క్రైస్తవులు ఈసా ఇబ్నె మరియం అలైహిస్సలాం విషయంలో ఏ విధంగానైతే మితిమీరినారో, ఆ విధంగా – షరియత్ విధించిన పరిమితులు అతిక్రమించి, అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకమైన ఆయన గుణగణాలతో, ఆయన కార్యాలతో, ఆయన అగోచర ఙ్ఞానంతో సమానంగా లేదా ఆయనను వేడుకునే విషయంలో సమానంగా – (హద్దులు దాటి) తనను కీర్తించడాన్ని, తన గుణగణాలను అతి చేసి ప్రశంసించడాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధిస్తున్నారు. ఇంకా తాను అల్లాహ్ యొక్క దాసులలో ఒక దాసుడను అని స్పష్టం చేస్తున్నారు. అందుకని తనను ‘అల్లాహ్ యొక్క దాసుడు మరియు ఆయన సందేశహరుడు’ అని మాత్రమే అనమని మనల్ని ఆదేశిస్తున్నారు.

فوائد الحديث

ఇందులో, షరియత్ విధించిన హద్దులు అతిక్రమించి (ఎవరినైనా, దేనినైనా) కీర్తించడం, ప్రశంసించడం బహుదైవారాధనకు దారి తీస్తుందనే హెచ్చరిక ఉన్నది.

ఇందులో దేని గురించి అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరిస్తున్నారో, వాస్తవానికి అది ఈ సమాజం (ఉమ్మత్) లో జరుగనే జరిగింది. ఒక వర్గం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను కీర్తించడం’లో హద్దులు మీరింది, మరొక వర్గం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుటుంబీకులను (అహ్ల్’అల్ బైత్) కీర్తించడంలో హద్దులు మీరింది, ఇంకొక వర్గం సత్పురుషులను కీర్తించడంలో హద్దులు మీరింది. అలా వారంతా షిర్క్’కు పాల్బడుతున్నారు.

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తనను గురించి ‘అల్లాహ్ యొక్క దాసుడను’ అని అభివర్ణించుకున్నారు. ఆ విధంగా తన జీవితం ఆసాంతం అల్లాహ్ యొక్క మార్గదర్శకత్వంలో గడిచినదని; అందుకని తన ప్రభువుకు మాత్రమే ప్రత్యేకమైన ఏ విషయమైనా తాను వినియోగించ జాలనని (అలా చేయడం తనకు తగదు అని) స్పష్టం చేస్తున్నారు.

అలాగే తాను ‘అల్లాహ్ యొక్క సందేశహరునిగా’ అభివర్ణించుకున్నారు – దీని ద్వారా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం "తాను అల్లాహ్ తరఫు నుండి పంపబడిన సందేశహరుడు అని, తనను విశ్వసించుట మరియు తనను అనుసరించుట విధి" అని తెలియజేస్తున్నారు.

التصنيفات

తౌహీదె ఉలూహియ్యత్