“ ‘అల్లాహ్ కోరిన విధంగా మరియు ఫలాన ఆయన కోరిన విధంగా’ అని అనకండి; దానికి బదులు ‘అల్లాహ్ కోరిన విధంగా తరువాత ఫలాన…

“ ‘అల్లాహ్ కోరిన విధంగా మరియు ఫలాన ఆయన కోరిన విధంగా’ అని అనకండి; దానికి బదులు ‘అల్లాహ్ కోరిన విధంగా తరువాత ఫలాన ఆయన కోరిన విధంగా’ అని అనండి.”

హుదైఫహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ ‘అల్లాహ్ కోరిన విధంగా మరియు ఫలాన ఆయన కోరిన విధంగా’ అని అనకండి; దానికి బదులు ‘అల్లాహ్ కోరిన విధంగా తరువాత ఫలాన ఆయన కోరిన విధంగా’ అని అనండి.”

الشرح

ఒక ముస్లిం తన సంభాషణలో ‘అల్లాహ్ కోరిన విధంగా మరియు ఫలాన ఆయన కోరిన విధంగా’ అని అనరాదని నిషేధించినారు. లేక ‘అల్లాహ్ మరియు ఫలాన ఆయన కోరిన విధంగా’ అనడం (కూడా నిషేధమే). ఎందుకంటే అల్లాహ్ యొక్క చిత్తము మరియు ఆయన సంకల్పము – ఇవి రెండూ శుద్ధమైనవి మరియు పరిపూర్ణత కలిగినవి. వాటిలో ఆయనతో ఎవరూ భాగస్వాములు కాలేరు. ఆ రకమైన వాక్యములో, వ్యాకరణ నియమాల ప్రకారం “వావ్ 'و' ” అనే అరబీ అక్షరం ‘సముచ్చయము’ గా పని చేస్తుంది. దానితో ‘అల్లాహ్ తో పాటు మరొకరు కూడా ఆయన సమానులు’ అనే అర్థం వస్తుంది. అలా కాక ‘అల్లాహ్ కోరిన విధంగా ఆ తరువాత ఫలాన వారు కోరిన విధంగా’ అనవచ్చు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ఆ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘మరియు’ అనే పదానికి బదులు ‘ఆ తరువాత’ అనే పదంతో దాసుని ఇష్టాన్ని అల్లాహ్ యొక్క ఇష్టానికి క్రింద, దానికి అనుయాయిగా చేస్తున్నారు. ఎందుకంటే వాక్యములో “ఆ తరువాత” అనే పదం వాక్యములో ఉన్న పదాలను తేలికగా వ్యాఖ్యానించడానికి దోహదపడుతుంది.

فوائد الحديث

సంభాషణలలో ఈ విధంగా పలకడం, మాట్లాడ్డం నిషేధించబడింది: “అల్లాహ్ కోరిన విధంగా మరియు మీరు కోరిన విధంగా” (జరుగుతుంది) అనడం, లేదా అల్లాహ్ పేరుతో పాటుగా “మరియు” (“و”) అనే పదంతో మరొకరి పేరు వచ్చే విధంగా ఉండేటటువంటి వాక్యాలు నిషేధము. అది “మాటలలో” మరియు “సంభాషణలలో” జరిగే బహుదైవారాధనగా (షిర్కుగా) భావించబడుతుంది.

“అల్లాహ్ కోరిన విధంగా ఆ తరువాత మీరు కోరిన విధంగా (జరుగుతుంది, లేదా జరగాలి)” అనడం లేదా ఈ వాక్యాన్ని పోలిన విధంగా ఉన్న మాటలను పలకడం – ఎందులోనైతే అన్నింటి కన్నా ప్రప్రథమంగా అల్లాహ్ కు మాత్రమే ప్రాధాన్యత ఉండే లాంటి పదాలు ఉండి, తరువాత మిగతా వారి ప్రస్తావన ఉన్న మాటలు, వాక్యాలు రావడం - అనుమతించబడినదే. ఎందుకంటే అటువంటి వాక్యాలలో షిర్క్ యొక్క ప్రమాదం ఉండదు.

ఇందులో అల్లాహ్ యొక్క చిత్తము, మరియు దాసుని యొక్క చిత్తములను గురించిన రుజువు ఉన్నది; మరియు అల్లాహ్ యొక్క చిత్తము సర్వోపరి అని, దాసుని యొక్క చిత్తము దానికి అనుయాయి అని తెలియుచున్నది.

మాటలలోనైనా సరే అల్లాహ్ యొక్క చిత్తములో ఇతరులకు ప్రమేయం కల్పించడం నిషేధించబడినది.

మాట్లాడే వ్యక్తి దాసుని యొక చిత్తము, సమగ్రత మరియు సంపూర్ణతల విషయములో అల్లాహ్ యొక్క చిత్తము వంటిదే మరియు దానికి సమానమైనదే అని విశ్వసిస్తున్నట్లయితే, లేక దాసుని యొక్క చిత్తము పూర్తిగా స్వతంత్రమైనది (దానికీ అల్లాహ్ యొక్క చిత్తమునకు ఎటువంటి సంబంధమూ లేదు) అని విశ్వసిస్తున్నట్లయితే అది “షిర్క్ అల్ అక్బర్” (పెద్ద షిర్క్) అనబడుతుంది. అలాకాక తన చిత్తము అల్లాహ్ యొక్క చిత్తము కంటే స్థాయిలో తక్కువ స్థానము కలిగినది అని విశ్వసిస్తున్నట్లయితే – అది ‘షిర్క్ అల్ అస్ఘర్” (చిన్న షిర్క్) అనబడుతుంది.

التصنيفات

తౌహీదె ఉలూహియ్యత్