“మిథ్యా దైవాల పేరున (విగ్రహాల పేరున) గానీ, లేక మీ తాతలు, తండ్రుల పేరున గానీ ప్రమాణం చేయకండి (ఒట్టు పెట్టుకోకండి).”

“మిథ్యా దైవాల పేరున (విగ్రహాల పేరున) గానీ, లేక మీ తాతలు, తండ్రుల పేరున గానీ ప్రమాణం చేయకండి (ఒట్టు పెట్టుకోకండి).”

అబ్దుర్రహ్మాన్ ఇబ్న్ సమురహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మిథ్యా దైవాల పేరున (విగ్రహాల పేరున) గానీ, లేక మీ తాతలు, తండ్రుల పేరున గానీ ప్రమాణం చేయకండి (ఒట్టు పెట్టుకోకండి).”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అత్-తవాగీ” పేరిట ప్రమాణం చేయడాన్ని నిషేధించినారు. “తాగియహ్” అనే పదం యొక్క బహువచనం “అత్-తవాగీ”; ఇవి విగ్రహాలు, అల్లాహ్ ను వదిలి (లేదా అల్లాహ్ తో పాటు) బహుదైవారాధకులు వీటిని పూజించేవారు, ఆరాధించేవారు; ఇవి వారి దౌర్జన్యానికి మరియు అవిశ్వాసానికి కారణం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ తండ్రుల పేరున ప్రమాణం చేయడాన్ని కూడా నిషేధించినారు. ఇస్లాంకు పూర్వం అరబ్బులు గర్వంతో, గొప్పతో తమ తండ్రులపై ప్రమాణం చేయడం ఆనవాయితీగా ఉండేది.

فوائد الحديث

అల్లాహ్ పేర్ల ద్వారా మరియు ఆయన గుణవిశేషణాల ద్వారా తప్ప మరింకెవరి పేరునా ప్రమాణం చేయరాదు.

మిథ్యాదైవాల పేరున, తాత, తండ్రుల పేరున, నాయకుల పేరున మరియు విగ్రహాల పేరున, ఇంకా అలాంటి, అదే కోవకు చెందిన ఇంకెవరి పేరునా ప్రమాణం చేయుట హరాం (నిషేధము)

అల్లాహ్ పేరున గాక ఇంకెవరి పేరునైనా ప్రమాణం చేయుట “అష్’షిర్క్ అల్ అస్గర్” (చిన్న షిర్క్) అనబడుతుంది. ఒకవేళ ప్రమాణం చేస్తున్న వ్యక్తి హృదయం ఎవరి పేరున అయితే ప్రమాణం చేస్తున్నాడో అతని స్తుతితో మరియు అతని మహిమతో నిండి ఉండి, అల్లాహ్’ను స్తుతించునట్లు, మహిమ పరుచునట్లు అతడిని కూడా స్తుంతించుట, మహిమపరుచుట చేస్తున్నట్లైతే, లేదా ఇతనికి కూడా కొన్ని రకాల పూజలు, ఆరాధనలు చేయవచ్చు అని విశ్వసిస్తున్నట్లైతే – అటువంటి వాని పేరున ప్రమాణం చేయుట “అష్’షిర్క్ అల్ అక్బర్” (ఘోరమైన షిర్క్) అవుతుంది.

التصنيفات

తౌహీదె ఉలూహియ్యత్