అది ఏదో ఒక నిజానికి సంబంధించిన మాట అయి ఉంటుంది. దానిని ఆ జిన్ను దొంగతనంగా (దైవదూతల నుండి) పొంది, తన మిత్రుడైన ఆ…

అది ఏదో ఒక నిజానికి సంబంధించిన మాట అయి ఉంటుంది. దానిని ఆ జిన్ను దొంగతనంగా (దైవదూతల నుండి) పొంది, తన మిత్రుడైన ఆ జ్యోతిష్యుని చెవిలో వేస్తాడు. అతడు దానికి (ఆ నిజమైన ఒక్క మాటకు) మరో వంద అబద్ధాలు కల్పించి చెపుతాడు.” (సహీ బుఖారీలో ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించిన మరొక హదీసులో తాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనగా విన్నాను అని తెలిపారు “స్వర్గములో అల్లాహ్ నిర్ణయించిన విషయాలను గురించి ప్రస్తావించుకుంటూ దైవదూతలు క్రింది ఆకాశాలలోనికి వస్తారు. వారి మాటలను జిన్ను దొంగతనంగా, చాటుమాటుగా విని తమ మిత్రులైన జ్యోతిష్యులకు చేరవేస్తాడు. అలా ఆ జ్యోతిష్యులు దానికి వంద అబద్దాలు జోడించి చెబుతూ ఉంటారు.”)

ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “కొంతమంది ప్రజలు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ను ‘భవిష్యత్తు గురించి చెప్పేవారికి’ (జ్యోతిష్యులకు) సంబంధించి ప్రశ్నించినారు. వారితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “వారిని గురించి (చెప్పడానికి) ఏమీ లేదు”. దానికి వారు “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, మరి వారు చెప్పే విషయాలు ఒక్కోసారి నిజమవుతాయి కదా!” అన్నారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అది ఏదో ఒక నిజానికి సంబంధించిన మాట అయి ఉంటుంది. దానిని ఆ జిన్ను దొంగతనంగా (దైవదూతల నుండి) పొంది, తన మిత్రుడైన ఆ జ్యోతిష్యుని చెవిలో వేస్తాడు. అతడు దానికి (ఆ నిజమైన ఒక్క మాటకు) మరో వంద అబద్ధాలు కల్పించి చెపుతాడు.” (సహీ బుఖారీలో ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించిన మరొక హదీసులో తాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనగా విన్నాను అని తెలిపారు “స్వర్గములో అల్లాహ్ నిర్ణయించిన విషయాలను గురించి ప్రస్తావించుకుంటూ దైవదూతలు క్రింది ఆకాశాలలోనికి వస్తారు. వారి మాటలను జిన్ను దొంగతనంగా, చాటుమాటుగా విని తమ మిత్రులైన జ్యోతిష్యులకు చేరవేస్తాడు. అలా ఆ జ్యోతిష్యులు దానికి వంద అబద్దాలు జోడించి చెబుతూ ఉంటారు.”)

[దృఢమైనది] [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు]

الشرح

భవిష్యత్తులో జరుగబోయే విషయాలు చెప్పే వారి గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రశ్నించడం జరిగింది. దానికి వారు: వారిని గురించి ఎక్కువ ఆలోచించకండి, వారి మాటలను తీసుకోకండి (నమ్మకండి), మరియు వారు చేసే పనులపట్ల ఆసక్తి చూపకండి” అన్నారు. దానికి వారు (ప్రజలు) ఇలా అన్నారు: “కొన్ని సందర్భాలలో వారు చెప్పేది వాస్తవానికి అనుగుణంగానే ఉంటుంది. ఉదాహరణకు భవిష్యత్తులో జరుగబోయే ఏదైనా (మనకు తెలియని, అగోచర) విషయాన్ని గురించి ‘ఫలానా నెలలో, ఫలానా దినమున ఇలా జరుగుతుంది’ అని చెప్పినట్లయితే – వారు చెప్పినట్లుగానే జరుగుతుంది.” అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “జిన్నాతులు ఆకాశాలలో దొంగతనంగా విన్న విషయాన్ని తీసుకుని వారు జ్యోతిష్యులలో తమ మిత్రులైన జ్యోతిష్యుల దగ్గర దిగి తాము విన్నదానిని వారికి తెలుపుతారు. జ్యోతిష్యులు తాము విన్న ఆకాశపు విషయానికి వంద అబద్దాలు జతచేస్తారు.”

فوائد الحديث

జ్యోతిష్యులను, భవిష్యవాణి చెప్పే వారిని, హస్త సాముద్రీకులను, సోది చెప్పేవారిని విశ్వసించుట నిషేధము. వారు చెప్పేదంతా కూడా అబద్ధమే, అప్పుడప్పుడు అది నిజమైనప్పటికీ.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు అల్లాహ్ యొక్క సందేశహరునిగా వారికి ఇవ్వబడిన బృహత్కార్యము కారణంగా షైతానుల నుండి ఆకాశానికి రక్షణ కల్పించబడింది – (ఆకాశము నుండి) అవతరించబడే దివ్య సందేశాన్ని (వహీని) మరియు ఇతర విషయాలను ఆలకించుటకు గాను – అయితే, దొంగతనంగా, చాటుమాటుగా తస్కరించబడే వాటినుండి, మరియు ఆకాశము నుండి అవతరించబడే మండే అగ్ని నుంచి తప్ప.

జిన్నాతులు తమ సహాయకులను మానవులలో నుండే ఎన్నుకుంటారు.

التصنيفات

తౌహీదె ఉలూహియ్యత్, తౌహీదె ఉలూహియ్యత్, అజ్ఞాన కాలపు సమస్యలు, అజ్ఞాన కాలపు సమస్యలు