“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మాట అన్నారు; దానిపై నేను రెండో మాట అన్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం…

“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మాట అన్నారు; దానిపై నేను రెండో మాట అన్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “@ఎవరైతే అల్లాహ్ ను గాక ఇంకెవరినైనా అల్లాహ్ కు సాటి కల్పిస్తూ వేడుకుంటాడో, మరియు ఆ విధానం పైనే మరణిస్తాడో అతడు నరకాగ్ని లోనికి ప్రవేశిస్తాడు.*” మరియు నేను ఇలా అన్నాను “ఎవరైతే అల్లాహ్ ను గాక మరింకెవరినీ వేడుకొనడో అతడు స్వర్గములోనికి ప్రవేశిస్తాడు.”

అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మాట అన్నారు; దానిపై నేను రెండో మాట అన్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “ఎవరైతే అల్లాహ్ ను గాక ఇంకెవరినైనా అల్లాహ్ కు సాటి కల్పిస్తూ వేడుకుంటాడో, మరియు ఆ విధానం పైనే మరణిస్తాడో అతడు నరకాగ్ని లోనికి ప్రవేశిస్తాడు.” మరియు నేను ఇలా అన్నాను “ఎవరైతే అల్లాహ్ ను గాక మరింకెవరినీ వేడుకొనడో అతడు స్వర్గములోనికి ప్రవేశిస్తాడు.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఇలా తెలుపుతున్నారు: ఎవరైతే అల్లాహ్ కు చెందవలసిన దానిని వేరే ఇంకెవరికైనా అంకితం చేస్తారో, ఉదాహరణకు అల్లాహ్ కు కాకుండా వేరే వారికి దుఆ చేయడం, లేక ఆయనను గాక సహాయం కొరకు (ఆయన స్థానములో) వేరే ఇంకెవరినైనా అర్థిస్తాడో – మరియు అదే విధానం పై మరణిస్తాడు అతడు నరకవాసులలోని వాడు అవుతాడు. అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు దానికి కొనసాగింపుగా ఇలా అన్నారు: “ఎవరైతే ఎవరినీ లేక దేనిని అల్లాహ్ కు సాటి కల్పించకుండా, ఆ స్థితిలోనే మరణిస్తాడో అతని గమ్యస్థానము స్వర్గము.”

فوائد الحديث

దుఆ చేయుట అనునది ఒక ఆరాధన, అది కేవలం సర్వోన్నతుడైన అల్లాహ్ కు మాత్రమే చేయదగిన ఆరాధన.

ఇది ‘తౌహీద్’ (అల్లాహ్ ఒక్కడే అని విశ్వసించుట) యొక్క ఘనత. ఎవరైతే తౌహీద్ పైనే మరణిస్తాడో అతడు స్వర్గములోనికి ప్రవేశిస్తాడు; అతడు పాల్బడిన కొన్ని పాపకార్యాల కొరకు శిక్షించబడినా సరే.

అలాగే ‘షిర్క్’ (బహుదైవారాధన) ఎంత ప్రమాదకరమైనదో తెలుస్తున్నది. ఎవరైతే ‘షిర్క్’ పైనే మరణిస్తాడు అతడు నరకాగ్నిలోనికి ప్రవేశిస్తాడు.

التصنيفات

తౌహీదె ఉలూహియ్యత్