إعدادات العرض
.
.
ఉమైమహ్ బింతె రుఖైఖహ్ (రదియల్లాహు అన్హా) ఇలా ఉల్లేఖిస్తున్నారు: నేను మరియు కొందరు అన్సార్ స్త్రీలు ఒక బృందంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు విధేయత ప్రతిజ్ఞ చేయుటకు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చినాము. మేము ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇలా అన్నాము: “ఓ రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం)! మేము అల్లాహ్’కు దేనినీ సాటి కల్పించమని, దొంగతనానికి పాల్బడబోమని, వ్యభిచారానికి పాల్బడము అని, మా చేతులకు, కాళ్ళకు మధ్య కల్పించిన ఏ అబధ్ధాన్ని పలుకము అని మరియు ఏ మంచి విషయం లోనూ మేము మీకు అవిధేయత చూపము అని మీకు విధేయత ప్రకటిస్తున్నాము”; అపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “(మీకు) సాధ్యపడినంత వరకు మరియు భరించగలిగినంత వరకు” అన్నారు. ఉమైమహ్ బింతె రుఖైఖహ్ (రదియల్లాహు అన్హా) ఇంకా ఇలా అన్నారు “మేము ఇలా అన్నాము: “అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు మాపై (స్త్రీలపై) ఎక్కువ కరుణామయులు; రండి ఓ రసూలుల్లాహ్ మిమ్మల్ని మీ చేతిపై ప్రమాణం చేయనివ్వండి”. కానీ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: “నేను మహిళలతో కరచాలనం చేయను. వంద మంది మహిళలకు చెప్పిన నా మాటలు ఒక మహిళకు చెప్పిన నా మాటలకు సమానం, లేదా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: “ఒక మహిళకు చెప్పిన నా మాటలు.."
الترجمة
العربية Tiếng Việt Bahasa Indonesia Nederlands Kiswahili English অসমীয়া ગુજરાતી සිංහල Magyar ქართული Hausa Română ไทย Portuguêsالشرح
ఈ హదీథులో ఉమైమహ్ బింతె రుఖైఖహ్ (రదియల్లాహు అన్హా) ఇలా వివరించినారు: ఆమె కొందరు అన్సారు స్త్రీలతో కలిసి విధేయతా ప్రమాణం చేయడానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు వచ్చినారు. తాము అల్లాహ్’కు ఎవరినీ సాటి కల్పించము అని, దొంగతనానికి పాల్బడము అని, వ్యభిచారానికి పాల్బడము అని, తమ చేతులకు, కాళ్ళకు మధ్య కల్పించిన ఏ అబధ్ధాన్ని పలుకము అని, అలాగే మరియు ఏ మంచి విషయం లోనూ తాము ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కు అవిధేయత చూపము అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతిపై ప్రతిజ్ఞ చేయాలని. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: “మీకు సాధ్యపడినంత వరకు మరియు మీరు భరించగలిగినంత వరకు” (ఆమె ఇలా అన్నారు) “దానికి మేము ఇలా అన్నాము: అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త మా పట్ల (స్త్రీల పట్ల) అత్యంత దయామయులు. రండి ఓ ప్రవక్తా! ఏవిధంగానైతే మగవారు మీ చేతిపై చేయి వేసి ప్రతిజ్ఞ చేసినారో అలా మిమ్మల్ని కూడా ప్రతిజ్ఞ చేయనివ్వండి.” అపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: “నేను స్త్రీలతో కరచాలనం చేయను. నామాటలు మరియు విధేయతా ప్రతిజ్ఞలు వందమంది స్త్రీలకు చేసినా ఒక స్త్రీకి చేసినా సమానమే.فوائد الحديث
ఈ హదీత్ లో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) స్త్రీలతో విధేయతా ప్రమాణం ఏ విధంగా తీసుకునేవారూ తెలియుచున్నది.
పరాయి స్త్రీలతో (మహ్రమ్ కాని స్త్రీలతో) కరచాలనం చేయడం నిషేధం.
షరీఅతు విధించిన బాధ్యతలు సామర్థ్యం మరియు శక్తి ఆధారంగానే ఉంటాయి.