“అల్లాహ్’ను తన ప్రభువుగా, ఇస్లాంను తన ధర్మంగా మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను తన సందేశహరునిగా…

“అల్లాహ్’ను తన ప్రభువుగా, ఇస్లాంను తన ధర్మంగా మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను తన సందేశహరునిగా సంతృప్తి చెందిన వ్యక్తి, విశ్వాసము యొక్క మాధుర్యాన్ని చవిచూసినాడు.”

అల్ అబ్బాస్ ఇబ్న్ అల్ ముత్తలిబ్ (రదియల్లాహు అన్హు) తాను రసూలల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించగా విన్నాను అని ఉల్లేఖిస్తున్నారు: “అల్లాహ్’ను తన ప్రభువుగా, ఇస్లాంను తన ధర్మంగా మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను తన సందేశహరునిగా సంతృప్తి చెందిన వ్యక్తి, విశ్వాసము యొక్క మాధుర్యాన్ని చవిచూసినాడు.”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు: ఒక విశ్వాసి తన విశ్వాసములో నిజాయితీగా ఉండి, మరియు ఆ విశ్వాసముతో అతని హృదయం శాంతిని పొందుతుందో, అతడు మూడు విషయాలతో సంతృప్తి చెందినట్లైతే, అటువంటి విశ్వాసి తన హృదయంలో విశాలతను కనుగొంటాడు, అందులో ఆనందాన్ని గ్రహిస్తాడు, సర్వశక్తిమంతుడైన అల్లాహ్’కు చేరువగా ఉండే ప్రీతిని, ఆనందాన్ని పొందుతాడు. మొదటిది: అల్లాహ్’యే తన ప్రభువు అని సంతృప్తి చెందుట: అతడు ఆ విషయంతో సంతృప్తి చెందినట్లైతే, అతని ప్రభువు నుండి అతని భాగంగా అతనికి చేరే ఉపాధి, మరియు అతనిపై వచ్చిపడే పరిస్థితులు అన్నింటి పట్లా అతని హృదయం సంతృప్తితో విశాలం అవుతుంది. అతను తన హృదయంలో దేనిపైనా ఎటువంటి అభ్యంతరాన్ని కనుగొనడు. సర్వశక్తిమంతుడైన అల్లాహ్’ను వదిలి మరొక ప్రభువు కావాలని కోరడు. రెండవది: ఇస్లాం తన ధర్మమని సంతృప్తి చెందుట: అతడు ఆ విషయంతో సంతృప్తి చెందినట్లైతే, ఇస్లాంయొక్క విధులు మరియు బాధ్యతలపట్ల అతని హృదయం విశాలం అవుతుంది, మరియు అతడు ఇస్లాంను వదిలి మరొక మార్గాన్ని ఎంచుకొనడు. మూడవది: ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు అనే విషయంలో సంతృప్తి చెందుట: ఆ విషయంలో సంతృప్తి చెందితే, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకు వచ్చిన సందేశము మరియు బోధించిన ప్రతి విషయంతో అతడు ఎటువంటి సందేహమూ, సంశయమూ లేకుండా అతని హృదయం విశాలం అవుతుంది. అతడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మార్గదర్శకం చేసిన విషయాన్ని తప్ప మరింక దేనినీ అనుసరించడు.

فوائد الحديث

ఆహారం మరియు పానీయాల మాధుర్యాన్ని నోటిలో రుచి చూసినట్లే విశ్వాసపు తీపి మరియు మాధుర్యమును హృదయాలు గ్రహిస్తాయి.

ఆరోగ్యంగా ఉన్నప్పుడు తప్ప శరీరానికి ఆహారం మరియు పానీయం యొక్క తీపి తెలియదు. అదే విధంగా హృదయం కూడా. అది తప్పుదోవ పట్టించే కోరికలు మరియు నిషేధించబడిన వాంచల వ్యాధి నుండి విముక్తి పొందినట్లయితే, అది విశ్వాసం యొక్క మాధుర్యాన్ని కనుగొంటుంది. మరియు (కోరికలు, వాంఛలతో) జబ్బుపడి, కీడు పట్టిన హృదయం విశ్వాసపు మాధుర్యాన్ని గ్రహించదు. కానీ కోరికలు మరియు పాపాల నుండి దానిని నాశనం చేసే వాటిలో అది మాధుర్యాన్ని కనుగొంటుంది.

ఒక వ్యక్తి ఒక విషయంతో సంతృప్తి చెంది, దానిని ఆమోదించుకున్నట్లయితే, ఆ విషయం అతనికి సులభం అవుతుంది, మరియు అతనికి ఏమీ కష్టం కాదు, మరియు ఆ విషయం తెచ్చే ప్రతిదానిలోనూ అతడు ఆనందిస్తాడు మరియు దాని ఉల్లాసం అతని హృదయంలో కలిసిపోతుంది. అలాగే విశ్వాసి కూడా. విశ్వాసం అతని హృదయంలోకి ప్రవేశిస్తే, తన ప్రభువుకు విధేయత చూపడం అతనికి సులభం అవుతుంది మరియు అతని ఆత్మ అతనికి ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు ఒకవేళ ఆ విశ్వాసం కారణంగా అతనికి ఏదైనా బాధ కలిగినా అది అతనికి కష్టంగా అనిపించదు.

ఇమాం ఇబ్న్ అల్ ఖయ్యిం (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు:

ఈ హదీథులో తన ప్రభువుతో ఆయన దైవత్వముతో సంతృప్తి, ఆయన సందేశహరునితో సంతృప్తి మరియు ఆయనకు విధేయత చూపుట, మరియు అల్లాహ్ యొక్క ధర్మము (ఇస్లాం)తో సంతృప్తి మరియు ఆ ధర్మానికి లోబడి ఉండుట వంటివి ఉన్నాయి.

التصنيفات

విశ్వాసం పెరుగుదల మరియు దాని తరుగుదల