إعدادات العرض
నిశ్చయంగా, మహోన్నతుడు మరియు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అవతరింపజేశాడు: {ఎవరైతే అల్లాహ్ అవతరింపజేసిన దైవవాణి…
నిశ్చయంగా, మహోన్నతుడు మరియు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అవతరింపజేశాడు: {ఎవరైతే అల్లాహ్ అవతరింపజేసిన దైవవాణి ప్రకారం తీర్పు చెయ్యరో వారే అవిశ్వాసులు.}
అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: నిశ్చయంగా, మహోన్నతుడు మరియు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అవతరింపజేశాడు: {ఎవరైతే అల్లాహ్ అవతరింపజేసిన దైవవాణి ప్రకారం తీర్పు చెయ్యరో వారే అవిశ్వాసులు.} [అల్-మాయిదా 5:44] మరియు {వారే దుర్మార్గులు} [అల్-మాయిదా 5:45] మరియు {వారే పాపాత్ములు} [అల్-మాయిదా 5:47]. అతను (ఉల్లేఖకుడు) ఇలా అన్నాడు: ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఇలా పలికినారు: అల్లాహ్ ఈ ఆయతులను యూదులలోని రెండు వర్గాల గురించి అవతరింపజేశాడు. జాహిలియ్యా కాలంలో (అజ్ఞానకాలంలో) వారిలో ఒక వర్గం మరొక వర్గంపై ఆధిపత్యం చెలాయించేది. చివరికి వారు ఈ విధంగా అంగీకరించి రాజీపడ్డారు: బలమైన వర్గం వారు బలహీన వర్గానికి చెందిన వారిని చంపితే, దాని నష్టపరిహారం (దియత్) యాభై వస్ఖ్‌లు, మరియు బలహీన వర్గం వారు బలమైన వర్గానికి చెందిన వారిని చంపితే, దాని నష్టపరిహారం (దియత్) వంద వస్ఖ్‌లు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వచ్చే వరకు వారు దీనినే పాటిస్తూ వచ్చారు. అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాకతో ఆ రెండు వర్గాలు బలహీనపడ్డాయి. ఆ రోజుల్లో అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా వారిపై పూర్తి ఆధిపత్యం సాధించలేదు మరియు వారితో సంధి దశలో ఉన్నారు. అప్పుడు బలహీన వర్గం వారు, బలమైన వర్గానికి చెందిన ఒకరిని చంపారు. అప్పుడు బలమైన వర్గం వారు, బలహీన వర్గానికి ఇలా సందేశం పంపారు: "మాకు వంద వస్ఖ్‌లు పంపండి." దానికి బలహీన వర్గం వారు ఇలా అన్నారు: "ఒకే మతం, ఒకే వంశం, ఒకే నగరం కలిగిన రెండు తెగల మధ్య ఒకరి నష్టపరిహారం మరొకరి నష్టపరిహారంలో సగం ఉండటం ఎక్కడైనా ఉందా? మేము మీకు ఇది ఇచ్చింది కేవలం మీ అన్యాయం మరియు మీ భయం వల్లనే. కానీ ఇప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చినందున, మేము మీకు అది ఇవ్వము." దీంతో వారి మధ్య యుద్ధం ప్రజ్వరిల్లేంత పనైంది. ఆ తర్వాత, వారు తమ మధ్య అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను మధ్యవర్తిగా నియమించుకోవడానికి అంగీకరించారు. అప్పుడు బలమైన వర్గం వారు ఆలోచించి ఇలా అనుకున్నారు: "అల్లాహ్ సాక్షిగా! ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారు మీకు ఇచ్చే దానికంటే రెట్టింపు మీకు వారి నుండి ఇప్పించరు. వారు (బలహీన వర్గం) నిజమే చెప్పారు. మనం వారిపై చేసిన అన్యాయం మరియు ఆధిపత్యం కారణంగానే వారు మనకు ఇది ఇచ్చారు. కాబట్టి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఆయన అభిప్రాయం తెలుసుకోవడానికి ఒకరిని రహస్యంగా పంపండి: ఆయన మీకు కావలసింది ఇస్తే, ఆయనను మీ మధ్యవర్తిగా అంగీకరించండి. ఒకవేళ ఇవ్వకపోతే, జాగ్రత్తపడి ఆయనను మధ్యవర్తిగా అంగీకరించవద్దు." అందువల్ల, వారు అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అభిప్రాయం తెలుసుకోవడానికి కపట విశ్వాసులలోని కొందరిని ఆయన వద్దకు రహస్యంగా పంపారు. వారు అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చినప్పుడు, అల్లాహ్ తన ప్రవక్తకు వారి వ్యవహారం మరియు వారి ఉద్దేశ్యాల గురించి తెలియజేశాడు. అప్పుడు మహోన్నతుడు మరియు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఈ ఆయతులను అవతరింపజేశాడు: {ఓ ప్రవక్తా! అవిశ్వాసం వైపు పరుగెత్తేవారు, అంటే 'మేము విశ్వసించాము' అని నోటితో పలికే వారు నిన్ను దుఃఖపరచకూడదు} [అల్-మాయిదా 5:41] నుండి {ఎవరైతే అల్లాహ్ అవతరింపజేసిన దైవవాణి ప్రకారం తీర్పు చెయ్యరో వారే పాపాత్ములు} [అల్-మాయిదా 5:47] అనే వచనం వరకు. ఆ తర్వాత ఆయన (ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హు) ఆ రెండు వర్గాల గురించి ఇలా అన్నారు: "అల్లాహ్ సాక్షిగా! ఈ ఆయతులు వారి గురించే అవతరించాయి మరియు మహోన్నతుడు మరియు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ వారిని ఉద్దేశించే పలికాడు.
الترجمة
العربية Português دری Македонски Tiếng Việt Magyar ქართული Indonesia Kurdî বাংলা ไทย ភាសាខ្មែរ অসমীয়া Nederlands ਪੰਜਾਬੀ Kiswahili Hausa Tagalog English ગુજરાતી Русский मराठी മലയാളം ಕನ್ನಡ Српски Türkçe සිංහල हिन्दी اردوالشرح
మదీనా యూదులలో బనూ ఖురైదా మరియు బనూ నదీర్ అనే తెగలు ఉండేవి. జాహిలియ్యా కాలంలో (అజ్ఞాన కాలంలో), వారిలో ఒకరు మరొకరిపై ఆధిపత్యం చెలాయించారు. కాబట్టి వారు ఒక ఒప్పందానికి వచ్చారు, ఏమనగా: ఆధిపత్యం గల తెగ, ఓడిపోయిన తెగకు చెందిన వ్యక్తిని చంపితే, దాని రక్తపు వెల (దియత్) కేవలం యాభై వసఖ్ లు. మరియు ఓడిపోయిన తెగ, ఆధిపత్యం గల తెగకు చెందిన వ్యక్తిని చంపితే, దాని రక్తపు వెల రెట్టింపు, అంటే నూరు వసఖ్ లు. మరియు ఒక వసఖ్ అరవై 'సా' లు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వలస వచ్చేంత వరకు వారు అదే స్థితిలో ఉన్నారు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం రాకతో ఆ రెండు తెగలు ఆయనకు విధేయులయ్యారు. ఆ సమయంలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా తన శత్రువులపై విజయం సాధించలేదు, మరియు తనకు విధేయులుగా ఉండమని వారిని బలవంతపెట్టలేదు. ఎందుకంటే అది హిజ్రత్ ప్రారంభ సమయం మరియు ఆయన సంధిలో ఉన్నారు. అప్పుడు బలహీనమైన తెగవారు బలమైన తెగకు చెందిన ఒక వ్యక్తిని హత్య చేశారు. అప్పుడు బలమైన తెగవారు బలహీనమైన తెగవారికి ఇలా సందేశం పంపారు: ఒప్పందం ప్రకారం మాకు వంద వస్ఖ్ లు పంపండి. దానికి బలహీనమైన తెగవారు ఇలా అన్నారు: ధర్మం ఒక్కటే, వంశం ఒక్కటే, దేశం ఒక్కటే అయిన రెండు తెగల మధ్య ఇలా ఎప్పుడైనా జరిగిందా, ఒకరి రక్తపరిహారం మరొకరి రక్తపరిహారంలో సగమా?! మేము మీకు ఇది ఇచ్చింది కేవలం మీరు మాపై చేసిన అన్యాయం వలన మరియు మీకు భయపడి మాత్రమే. అయితే, ఇప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చినందున, మేము మీకు దానిని ఎప్పటికీ ఇవ్వము. వారిద్దరి మధ్య యుద్ధం చెలరేగేంత పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను తమ మధ్య న్యాయనిర్ణేతగా చేసుకోవడానికి అంగీకరించారు. అప్పుడు ఒక గౌరవనీయురాలైన మహిళ ఆలోచించి వారికి ఇలా సలహా ఇచ్చింది: "అల్లాహ్ సాక్షి! ముహమ్మద్, వారికి మీ నుండి ఇప్పించే దానికంటే రెండింతలు మీకు వారి నుండి ఇప్పించరు. మరియు వారు నిజమే పలికారు. వారు మనకు ఇది ఇచ్చారంటే అది కేవలం మన అన్యాయం మరియు వారిపై మన బలవంతం కారణంగానే. కాబట్టి మీరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు రహస్యంగా ఒకరిని పంపండి, అతను మీకు ఆయన అభిప్రాయాన్ని తెలుసు కుంటాడు. ఒకవేళ ఆయన మీరు కోరినది మీకు ఇస్తే, ఆయనను న్యాయనిర్ణేతగా చేసుకోండి. ఒకవేళ ఆయన మీరు ఆశించినది ఇవ్వకపోతే, ఆయనను వదిలేయండి మరియు మీ మధ్య న్యాయనిర్ణేతగా చేసుకోకండి. అందువలన వారు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అభిప్రాయాన్ని తెలుసుకోవటానికి కపటవిశ్వాసులలోని కొందరిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు గోప్యంగా పంపారు. వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చినప్పుడు, అల్లాహ్ దివ్యవాణిని అవతరింపజేసి, తన ప్రవక్తకు వారి పూర్తి విషయం గురించి మరియు వారు ఏమి తలచారో దాని గురించి తెలియజేశాడు. అప్పుడు అల్లాహ్ అజ్జ వ జల్ సూరతుల్ మాయిదలో తన ఈ వచనం నుండి: {ఓ ప్రవక్తా! "మేము విశ్వసించాము" అని పలికిన వారిలో నుండి సత్యతిరస్కారంలోకి పరుగులు తీసే వారి వల్ల నీవు దుఃఖపడకు} [మాయిద 5:41]. ఈ వచనం వరకు అవతరింపజేశాడు: {ఎవరైతే అల్లాహ్ అవతరింపజేసిన దైవవాణి ప్రకారం తీర్పు చెయ్యరో వారే పాపాత్ములు.} [అల్-మాయిద 5:47] ఆ తర్వాత ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఇలా సెలవిచ్చారు: అల్లాహ్ సాక్షిగా, ఆ రెండు తెగల విషయంలోనే ఈ ఆయతు అవతరించింది: {ఎవరైతే అల్లాహ్ అవతరింపజేసిన దైవవాణి ప్రకారం తీర్పు చెయ్యరో వారే అవిశ్వాసులు.} [అల్-మాయిదా 5:44] మరియు{...వారే దుర్మార్గులు} [అల్-మాయిదా 5:45] మరియు {...వారే పాపాత్ములు} [అల్-మాయిదా 5:47], మరియు అల్లాహ్ అజ్జ వ జల్ ఆ రెండు తెగలను ఉద్దేశించారు.فوائد الحديث
యూదులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సత్యసంధత మరియు నమ్మకత్వం గురించి తెలుసుకోవటం గురించి స్పష్టం చేయబడింది.
యూదుల కుట్ర మరియు వారి దుర్మార్గం, చివరికి స్వయంగా తమ వారిపై తామే కుట్ర పన్నడం.
యూదులకు ఇహలోకంలో పరాభవం మరియు పరలోకంలో మహత్తరమైన శిక్ష ఉన్నదని అల్లాహ్ తఆలా తెలియజేయటం స్పష్టం అవుతున్నది.
అల్లాహ్ అవతరింపజేసిన దాని ప్రకారం తీర్పు చేయకపోవడం మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీర్పు పట్ల అసంతృప్తి చెందడం అవిశ్వాసం, అన్యాయం మరియు అవిధేయతకు నిదర్శనం.
కపటుల ప్రమాదం, యూదులతో వారి కుమ్మక్కు స్పష్టము అవుతున్నది.
التصنيفات
అవతరణ కారణాలు