ఖుర్ఆన్ అవతరణకు కారణాలు

ఖుర్ఆన్ అవతరణకు కారణాలు

1- "నేను అబూ తల్హా (రదియల్లాహు అన్హు) ఇంట్లో వారికి పానీయాలు పోసేవాడిని. ఆ కాలంలో వారు ఖర్బూజా లేదా ఖజూర్ పండ్లతో తయారైన 'ఫదీఖ్' అనే మద్యపానీయం త్రాగుతుండే వారు. ఒక రోజు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఒక ప్రకటనకారుణ్ని పంపి ఇలా ప్రకటన చేయించినారు:@ 'జాగ్రత్తగా వినండి! మద్యం ఇప్పుడు నిషేధించబడింది.'* అది వినగానే అబూ తల్హా (రదియల్లాహు అన్హు) నన్ను చూసి ఇలా అన్నారు: 'బయటకి వెళ్లి దీన్ని పారేయ్.' నేను దాన్ని బయటకు తీసువెళ్ళి పారేశాను. అది మదీనా వీధుల్లో ప్రవహించింది." ఆ సమయంలో కొంతమంది ప్రజలు ఇలా ప్రశ్నించారు: 'కొంతమంది మద్యం తాగిన స్థితిలో చనిపోయారు. ఇప్పుడు నిషేధం వచ్చేసరికి అది వాళ్ల కడుపుల్లోనే ఉంది. మరి వారి సంగతి ఏమిటి?' అప్పుడు అల్లాహ్ నుండి ఈ వాక్కు అవతరించింది: "ఓ విశ్వాసులారా! విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు — వారు ఇంతకు ముందు తిన్న వాటి పట్ల (నిషేధం రాకముందు) ఏ పాపమూ ఉండదు - అల్లాహ్‌కు భయపడుతూ, విశ్వసిస్తూ, మంచి కార్యాలు చేస్తూ ఉండినంతవరకూ…" (సూరతుల్ మాయిదా 5:93)