“ఎవరైనా అబ్యన్ నగరం లోని అదన్’లో నివసిస్తూ అక్కడ అపవిత్రత మరియు అన్యాయం చేయగోరుతారో, అల్లాహ్ వారికి అత్యంత…

“ఎవరైనా అబ్యన్ నగరం లోని అదన్’లో నివసిస్తూ అక్కడ అపవిత్రత మరియు అన్యాయం చేయగోరుతారో, అల్లాహ్ వారికి అత్యంత బాధాకరమైన శిక్షను రుచిచూపిస్తాడు.”

ఒక ‘మర్ఫూ’ హదీథులో అబ్దుల్లాహ్ ఇబ్నె మస్’ఊద్ (రదియల్లాహు అన్హు) ఇలా పేర్కొన్నారు: (ఆ హదీథులో) అల్లాహ్ యొక్క ప్రకటన {వ మన్ యురిద్ ఫీహి బి ఇల్’హాదిన్, బి జుల్మిన్’నుధిఖ్’హు మిన్ అజాబిన్ అలీమ్} [“…మరియు ఎవరైనా అందులో అపవిత్రత మరియు అన్యాయం చేయగోరుతారో, అలాంటి వారికి మేము బాధాకరమైన శిక్షను రుచి చూపుతాము.] (సూరహ్ అల్ హజ్జ్ 22:25) ను గురించి పేర్కొంటూ, ఆయన ఇలా అన్నారు: “ఎవరైనా అబ్యన్ నగరం లోని అదన్’లో నివసిస్తూ అక్కడ అపవిత్రత మరియు అన్యాయం చేయగోరుతారో, అల్లాహ్ వారికి అత్యంత బాధాకరమైన శిక్షను రుచిచూపిస్తాడు.”

[దృఢమైనది]

الشرح

సూరతుల్ హజ్జ్ ఆయతు నెంబరు 25 (22:25) లో అల్లాహ్ యొక్క ప్రకటన {వ మన్ యురిద్ ఫీహి బి ఇల్’హాదిన్, బి జుల్మిన్’నుధిఖ్’హు మిన్ అజాబిన్ అలీమ్} [“…మరియు ఎవరైనా అందులో అపవిత్రత మరియు అన్యాయం చేయగోరుతారో, అలాంటి వారికి మేము బాధాకరమైన శిక్షను రుచి చూపుతాము.] (సూరహ్ అల్ హజ్జ్ 22:25) ను గురించి పేర్కొంటూ, అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “జనులలో ఎవరైనా పవిత్ర మక్కా నగరములో అల్లాహ్ నిషేధించిన వాటిని, అంటే ఉద్దేశ్యపూర్వకంగా నాలుకను దుర్భాషలాడడానికి వినియోగించడం, ఉద్దేశ్యపూర్వకంగా అన్యాయంగా ఎవరినైనా చంపడం వంటివి చేయాలని మనసులో సంకల్పించుకున్నట్లైతే – అది దౌర్జన్యము. మరియు యెమెన్ లోని ఆడెన్ నగరంలో అలా చేయాలని ఎవరైనా సంకల్పము చేసుకుని ఉంటే, అతడు అలా చేయకపోయినా, దాని కారణంగా అల్లాహ్ అతణ్ణి బాధాకరమైన శిక్షకు గురి చేస్తాడు. అతడు అలా సంకల్పించడమే చాలు, అతడు అల్లాహ్ శిక్షకు అర్హుడు కావడానికి.

فوائد الحديث

ఇందులో మస్జిదుల్ హరం యొక్క పవిత్రత; మరియు దానిపట్ల భక్తి భావము గురించి స్పష్టమైన ప్రకటన ఉన్నది.

అల్-సఅది (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు:ఖుర్’ఆన్ యొక్క ఈ పవిత్ర వచనం (ఆయతు); పవిత్ర మస్జిద్ అల్ హరం ను గౌరవించవలసిన బాధ్యతను నొక్కి చెబుతున్నది. దానిని ఎంతో గౌరవించాలి, మరియు మక్కా నగరం లో పాపాలు చేయాలనే కోరికకు వ్యతిరేకంగా హెచ్చరించాలి.

ఇమాం అద్-దహ్హాక్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఒక వ్యక్తి మరో దేశంలో, లేదా మరో ప్రదేశం లో ఉంటూ, పవిత్ర మక్కా నగరం లో పాపపు పనికి పాల్బడాలని అనుకోవచ్చు. అతడు వాస్తవానికి ఆ పని చేయకపోయినా అది అతనికి వ్యతిరేకంగా నమోదు చేయబడుతుంది.

التصنيفات

ఖుర్ఆన్ అవతరణకు కారణాలు