నా మీద ఈ ఆయతులు అవతరించాయి, వీటి వంటివి ఇంతకు ముందు ఎన్నడూ చూడబడలేదు - అవి 'అల్-ముఅవ్వదతైన్' (అల్-ఫలక్ మరియు…

నా మీద ఈ ఆయతులు అవతరించాయి, వీటి వంటివి ఇంతకు ముందు ఎన్నడూ చూడబడలేదు - అవి 'అల్-ముఅవ్వదతైన్' (అల్-ఫలక్ మరియు అన్నాస్ సూరాలు)

ఉఖ్'బహ్ బిన్ ఆమిర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: నా మీద ఈ ఆయతులు అవతరించాయి, వీటి వంటివి ఇంతకు ముందు ఎన్నడూ చూడబడలేదు - అవి 'అల్-ముఅవ్వదతైన్' (అల్-ఫలక్ మరియు అన్నాస్ సూరాలు)

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారని ఉఖ్'బహ్ బిన్ ఆమిర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించినారు: 'ఈ రాత్రి నా మీద రెండు ఆయతులు అవతరించాయి, వీటి వంటివి (రక్షణలో) ఇంతకు ముందు ఎప్పుడూ చూడబడలేదు. అవి 'అల్-ముఅవ్విదతైన్' - సూరా 'కుల్ అఊజు బి-రబ్బిల్-ఫలక్' (113వ సూరా) మరియు సూరా 'కుల్ అఊజు బి-రబ్బిన్-నాస్' (114వ సూరా).'"

فوائد الحديث

ఇందులో సూరహ్ అల్-ఫలక్ & సూరహ్ అన్నాస్ యొక్క గొప్ప ప్రాముఖ్యత మరియు విశిష్ఠత తెలుపబడింది.

సర్వ రకాల కీడుల నుండి రక్షణ కోసం ఈ సూరాలను పఠించుట.

التصنيفات

సూరాలు మరియు ఆయతుల ప్రాముఖ్యతలు.