إعدادات العرض
నిశ్చయంగా నేను శపించేవానిగా పంపబడలేదు, దానికి బదులు కారుణ్యంగా పంపబడ్డాను
నిశ్చయంగా నేను శపించేవానిగా పంపబడలేదు, దానికి బదులు కారుణ్యంగా పంపబడ్డాను
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: ప్రవక్తతో, “ఓ రసూలుల్లాహ్! ముష్రిక్కులకు వ్యతిరేకంగా దుఆ చేయండి” అని అడగగా, ఆయన ఇలా పలికినారు: «నిశ్చయంగా నేను శపించేవానిగా పంపబడలేదు, దానికి బదులు కారుణ్యంగా పంపబడ్డాను»
[ప్రామాణికమైన హదీథు] [ముస్లిం నమోదు చేసినారు:]
الترجمة
العربية Português دری Македонски Magyar Tiếng Việt ქართული Kurdî বাংলা ไทย অসমীয়া Nederlands ਪੰਜਾਬੀ Indonesia Kiswahili ភាសាខ្មែរ English ગુજરાતી Hausa Tagalog Русский മലയാളം मराठी Српски සිංහල ಕನ್ನಡ हिन्दी اردوالشرح
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అల్లాహ్ తో షిర్క్ చేసేవారిపై (బహుదైవారాధకులపై) శపించమని కోరబడింది. అప్పుడు ఆయన ఇలా అన్నారు: 'నిశ్చయంగా, నేను అల్లాహ్ ద్వారా శపించేవాడిగా పంపబడలేదు. ప్రజలను అల్లాహ్ దయ నుండి దూరం చేయమని మరియు తరిమివేయమని కోరుతూ నేను వారిని శపించను, తద్వారా వారిని శుభం నుండి దూరం చేయను. నేను దీని కోసం పంపబడలేదు. నిశ్చయంగా, నేను సాధారణంగా ప్రజలందరికీ మరియు ప్రత్యేకంగా విశ్వాసులకు శుభానికి మరియు దయకు కారణంగా ఉండటానికి మాత్రమే పంపబడ్డాను.'فوائد الحديث
ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వ్యక్తిత్వపు పరిపూర్ణత గురించి తెలుస్తున్నది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఆదర్శంగా తీసుకుని, దూషణలు మరియు శాపనార్థాల నుండి నాలుకను పవిత్రంగా ఉంచుకోవడం యొక్క ప్రాముఖ్యత గురించి తెలియుచున్నది.
ఇందులో శపించడం నిషేధమని సూచించబడినది.
ఈ హదీథులో ప్రజల పట్ల కరుణ కలిగి ఉండుట గురించి ప్రోత్సాహించబడింది.
