దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్దతి (మార్గం)

దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్దతి (మార్గం)

2- “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పది రకాతులు నాకు గుర్తున్నాయి*. జుహ్ర్ నమాజుకు ముందు రెండు రకాతులు, (జుహ్ర్ నమాజు) తరువాత రెండు రకాతులు, మగ్రిబ్ నమాజు తరువాత వారు తన ఇంటిలో రెండు రకాతులు ఆచరించుట, మరియు ఇషా నమాజు తరువాత వారు తన ఇంటిలో రెండు రకాతులు ఆచరించుట, మరియు ఫజ్ర్ నమాజుకు ముందు రెండు రకాతులు ఆచరించుట నాకు గుర్తున్నాయి, మరియు ఆ సమయములో ఎవరూ ఆయన ఉన్న ఇంటిలో ప్రవేశించేవారు కారు.

6- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు నేను, ఇద్దరమూ జనాబత్ స్థితిలో ఉన్నపుడు, ఒకే నీటి తొట్టి నుండి నీళ్ళు తీసుకుంటూ ఇద్దరమూ కలిసి స్నానం చేసేవారము; *అలాగే నేను ఋతుస్రావము (బహిష్ఠు) స్థితిలో ఉన్నపుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను అంగవస్త్రము (షాల్ వంటిది) ధరించమని చెప్పి, నన్ను కౌగలించుకుని ముద్దులాడేవారు; అలాగే వారు మస్జిదులో ఏతికాఫ్ లో గడుపునపుడు – నేను బహిష్ఠు స్థితిలో ఉన్న సమయాన కూడా, వారు తన తలను (కిటికీ నుండి) ఇంటిలోనికి పెట్టేవారు , నేను వారి తలను కడిగేదానిని.