.

అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలలో నుండి ఒక బృందం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్యల వద్దకు వచ్చి, "ఆయన సల్లల్లాహు అలైహి వ సల్లం ఏకాంతంలో ఏయే పనులు (ఆరాధనలు) చేస్తారు?" అని అడిగినారు, వారిలో కొందరు ఇలా అన్నారు: నేను స్త్రీలను వివాహం చేసుకోను. మరికొందరు ఇలా అన్నారు: నేను మాంసం తినను. మరికొందరు ఇలా అన్నారు: నేను మంచం మీద పడుకోను. ఇది తెలిసిన తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మొదట అల్లాహ్‌ను స్తుతించారు, తరువాత ఆయనను ప్రశంసించి, ఇలా పలికినారు: "నేను అలా చేయ్యను, నేను ఇలా చేయ్యను అని చెప్పిన వారి గతి ఏమిగాను? నిజానికి, నేను నమాజు చేస్తాను మరియు నిద్ర పోతాను, నేను ఉపవాసం ఉంటాను మరియు ఉపవాసం విరమిస్తాను మరియు నేను స్త్రీలను వివాహం చేసుకుంటాను. నా సున్నతు నుండి తప్పుకున్నవాడు నాకు చెందినవాడు కాదు."

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

సహాబాల ఒక బృందం రదియల్లాహు అన్హుమ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్యల ఇళ్లకు వచ్చి, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లో చేసే ఆరాధనల గురించి అడిగారు. వారికి సమాధానం అందిన తరువాత, వారికి తమ ఆరాధనలు తక్కువగా ఉన్నట్లు అనిపించి ఉండవచ్చు, కాబట్టి వారు ఇలా అన్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పోలిస్తే మనం ఎక్కడ? ఆయన గత మరియు భవిష్యత్తు పొరపాట్టలు, తప్పులు క్షమించబడ్డాయి. అయితే వారు క్షమాపణ పొందారో లేదో తెలియని స్థితిలో ఉన్న వారిలా కాకుండా, దానిని పొందాలనే ఆశతో వారు ఆరాధనలు పెంచాలని భావించారు. అప్పుడు వారిలో కొందరు ఇలా అన్నారు: నేను స్త్రీలను వివాహం చేసుకోను. మరికొందరు: నేను మాంసం తినను అన్నారు. మరికొందరు ఇలా అన్నారు: నేను మంచం మీద పడుకోను. ఈ విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లంకు చేరగానే, ఆయన కోపంగా ఉండి ప్రజలకు ఒక ఉపన్యాసం ఇచ్చారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్‌ను స్తుతిస్తూ, ఆయనను ప్రశంసిస్తూ ఇలా అన్నారు: "ఇలాంటివి మాటలు అన్న వ్యక్తుల సంగతి ఏమిటి? అల్లాహ్ సాక్షిగా, నేను మీ అందరిలో అల్లాహ్‌కు అత్యంత ఎక్కువగా భయపడేవాడిని మరియు ఆయన పట్ల అత్యంత ఎక్కువ శ్రద్ధ గలవాడిని, కానీ నేను నమాజులలో నిలబడేందుకు వీలుగా శక్తి పుంజుకోవడానికి నేను నిద్రపోతాను కూడా. అలాగే ఉపవాసం కోసం నన్ను నేను బలపరచుకోవడానికి కొన్ని రోజులు నా ఉపవాసాన్ని విరమించు కుంటాను కూడా. అలాగే నేను స్త్రీలను వివాహం చేసుకుంటాను. నా మార్గాన్ని విడిచి, వేరే మార్గంలో పరిపూర్ణతను ఊహించుకుని, నా మార్గం కాకుండా వేరే మార్గాన్ని అనుసరించేవాడు నాకు చెందినవాడు కాడు."

فوائد الحديث

మంచితనం పట్ల సహాబాల ప్రేమ మరియు దానిని సాధించాలనే మరియు తమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించాలనే వారి కోరిక ఈ హదీథులో కనబడుతుంది.

ఈ షరియతు యొక్క సహనం మరియు సౌలభ్యం దాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచరణ మరియు మార్గదర్శకత్వంపై ఆధారపడి ఉంటుంది.

మంచితనం మరియు అనుగ్రహం అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఉదాహరణను అనుసరించడంలో మరియు ఆయన ఉన్నతమైన షరతులను పాటించడంలోనే ఉంది.

ఆరాధనలో తన శక్తికి మించిన భారం మోపడం అనేది మతంలో నూతన ఆవిష్కరణలు చేసేవారి లక్షణం.

ఇబ్నె హజర్ ఇలా అన్నారు: ఆరాధనలో అతిగా భారాన్ని మోపే విధానాన్ని అవలంబించడం వలన విసుగు వస్తుంది, అది దాని పునాదినే విచ్ఛిన్నం చేస్తుంది. అంతేకాకుండా, తప్పనిసరి ఆరాధనలకు మాత్రమే కట్టుబడి మరియు స్వచ్ఛంద ఆరాధనలను విస్మరించడం వలన సోమరితనానికి అలవాటు పడి, అసలు ఆరాధన పట్ల ఉత్సాహం కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి అన్ని వ్యవహారాల్లోనూ మితంగా ఉండటం ఉత్తమం.

గొప్ప వ్యక్తుల ఆదర్శాన్ని అనుసరించడం ఎంత ముఖ్యమో ఇది సూచిస్తుంది మరియు పురుషుల నుండి తెలుసుకోవడం కష్టమైతే, మహిళల ద్వారా దాని గురించి తెలుసుకోవడం అనుమతించబడింది.

ఇందులో ఉపదేశించడం, జ్ఞాన సంబంధిత అంశాలను ప్రస్తుత పరచడం, ధర్మంలో జవాబుదారీగా ఉన్నవారు తమ తీర్పులను స్పష్టం చేయడం మరియు ధర్మంలో కష్టపడి పనిచేసే వారి సందేహాలను నివృత్తి చేయడం వంటివి ఉన్నాయి.

ఒక ముస్లిం తనపై ఉన్న ఇతరుల హక్కులను కూడా నెరవేర్చుకునేలా, తప్పనిసరి మరియు స్వచ్ఛంద ఆరాధనలతో పాటు ఇతర వాటిలో ఉదారంగా ఉండాలనే ఆదేశం.

ఈ హదీథు వివాహం యొక్క గొప్పతనాన్ని సూచిస్తున్నది మరియు దానిని ప్రోత్సహిస్తున్నది.

التصنيفات

దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్దతి (మార్గం)