“రాత్రిపూట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిద్ర నుండి లేచినట్లయితే, వారు ‘సివాక్’ తో (పందోము పుల్లతో) పళ్ళను…

“రాత్రిపూట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిద్ర నుండి లేచినట్లయితే, వారు ‘సివాక్’ తో (పందోము పుల్లతో) పళ్ళను శుభ్రపరుచుకునేవారు.”

హుదైఫా (రదియల్లాహు అన్హు) కధనం : “రాత్రిపూట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిద్ర నుండి లేచినట్లయితే, వారు ‘సివాక్’ తో (పందోము పుల్లతో) పళ్ళను శుభ్రపరుచుకునేవారు.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తరుచుగా మిస్వాక్’ని ఉపయోగించేవారు, వారు దానిని గురించి ఆదేశించినారు కూడా, కొన్ని సందర్భాలలో తనకొరకు మిస్వాక్ ను తయారుగా ఉంచేలా జాగ్రత్త కూడా తీసుకునేవారు. అటువంటి సందర్భాలలో రాత్రి నిద్రనుండి లేచినపుడు ఒకటి; అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మిస్వాక్ తో తన పళ్ళను శుభ్రంగా రుద్ది శుభ్రపరుచుకునేవారు.

فوائد الحديث

రాత్రి నిద్రించిన తర్వాత, నిద్ర నుండి లేచినట్లయితే మిస్‌వాక్‌ని ఉపయోగించడం షరియత్ లోని భాగమే అని ఈ హదీథు ద్వారా నిర్ధారణ అవుతున్నది. ఎందుకంటే నిద్ర నోటి వాసనలో అనివార్యంగా మార్పును తీసుకు వస్తుంది. మరియు మిస్‌వాక్ నోటిని శుభ్రపరిచే ఒక మంచి సాధనం.

పై అర్థములో, నోటి వాసనలో అయిష్టకరమైన, అప్రీతికరమైన మార్పును గమనించిన ప్రతిసారీ మిస్వాక్ చేయుట కూడా షరియత్ లోని భాగమే.

ప్రత్యేక సందర్భాలలో పరిశుభ్రతను పాటించడం మాత్రమే కాకుండా, సాధారణ పరిశుభ్రతకు షరియత్ యొక్క చట్టబద్ధత ఈ హదీసు ద్వారా మనకు తెలుస్తున్నది. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ లో ఉన్న విషయం మరియు ఇది ఒక ఉత్క్రుష్టమైన వ్యవహరణ.

మిస్వాక్’తో నోటిని పూర్తిగా శుభ్రపరుచుకోవడం: అంటే పళ్ళూ, చిగుళ్లు మరియు నాలుక ఇవన్ని శుభ్రపరుచుకోవడం ఇందులో భాగాలు.

‘సివాక్’ అంటే ‘అరక్’ వృక్షమునుండి కతిరించిన ఒక చిన్న ముక్క; లేదా ఏ వృక్షము నుండి అయినా కత్తిరించబడిన అటువంటి ముక్క కూడా సివాక్ అనబడుతుంది. అది నోటిని, పళ్ళను శుభ్రపరుచు కోవడానికి ఉపయోగించ బడుతుంది, తద్వారా నోటిని తాజాగా ఉంచుతుంది, మరియు చెడు వాసనలు తొలగిస్తుంది.

التصنيفات

ప్రకృతి మార్గాలు, పరిశుద్ధత పాటించే విషయంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్దతి (మార్గం)