ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు నేను, ఇద్దరమూ జనాబత్ స్థితిలో ఉన్నపుడు, ఒకే నీటి తొట్టి నుండి నీళ్ళు…

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు నేను, ఇద్దరమూ జనాబత్ స్థితిలో ఉన్నపుడు, ఒకే నీటి తొట్టి నుండి నీళ్ళు తీసుకుంటూ ఇద్దరమూ కలిసి స్నానం చేసేవారము;

ఉమ్ముల్ ము’మినీన్ (విశ్వాసుల మాత) ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు నేను, ఇద్దరమూ జనాబత్ స్థితిలో ఉన్నపుడు, ఒకే నీటి తొట్టి నుండి నీళ్ళు తీసుకుంటూ ఇద్దరమూ కలిసి స్నానం చేసేవారము; అలాగే నేను ఋతుస్రావము (బహిష్ఠు) స్థితిలో ఉన్నపుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను అంగవస్త్రము (షాల్ వంటిది) ధరించమని చెప్పి, నన్ను కౌగలించుకుని ముద్దులాడేవారు; అలాగే వారు మస్జిదులో ఏతికాఫ్ లో గడుపునపుడు – నేను బహిష్ఠు స్థితిలో ఉన్న సమయాన కూడా, వారు తన తలను (కిటికీ నుండి) ఇంటిలోనికి పెట్టేవారు , నేను వారి తలను కడిగేదానిని.

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో ఉమ్ముల్ ము’మినీన్ ఆయిషా రజియల్లాహు అన్హా – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను తెలియ జేస్తున్నారు. వాటిలో ఒకటి: జనాబత్ స్థితిలో వారితో కలిసి స్నానం చేసిన విషయాన్ని – ఒకే నీటితొట్టిలో నుండి నీళ్ళు తీసుకుంటూ ఇద్దరమూ కలిసి స్నానం చేసేవారము అని తెలియజేసారు. అలాగే ఆమె బహిష్ఠు స్థితిలో ఉండగా, ఒకవేళ వారు ఆమెకు చేరువ కావాలని తలిస్తే, నడుము నుండి మోకాలి క్రింది వరకు ఆమెను ఒక అంగవస్త్రాన్ని ధరించమని చెప్పి, సంభోగములో పాల్గొనకుండా, ఆమెను కోరికతో కౌగలించుకుని ముద్దులాడేవారు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిదులో ఏతికాఫ్ లో గడిపే రోజులలొ, ఆయిషా రజియల్లాహు అన్హా) బహిష్ఠు స్థితిలో ఇంటిలో ఉండగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన తలను ఇంటిలోనికి పెట్టేవారు. ఆయిషా రజియల్లాహు అన్హా వారి తలను కడిగేవారు.

فوائد الحديث

ఒక మనిషి మరియు అతని భార్య ఒకే నీటి తొట్టి నుండి నీళ్ళు తీసుకుంటూ ఇద్దరూ కలిసి స్నానం చేయుటకు షరియత్ లో అనుమతి ఉన్నది.

స్త్రీ బహిష్ఠు స్థితిలో ఉండగా, ఆమె యోనిలో సంభోగములో పాల్గొనుట తప్ప అందుకు చేరువ అయ్యేందుకు జరిపే అన్ని ప్రక్రియలలో పాల్గొనవచ్చును; ఎందుకంటే ఆమె (మిగతా) శరీరం పరిశుద్ధ స్థితిలోనే ఉంటుంది.

ఆమె బహిష్ఠు స్థితిలో ఉండగా భర్త కౌగలింతలు, ముద్దులాటలూ జరిపే సమయాన, ఆమె (నడుము నుండి క్రింది వరకు) అంగవస్త్రము వంటి దానిని ధరించడం మంచిది.

అయితే హరాంలో పడకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇందులో, బహిష్ఠు స్థితిలో ఉన్న స్త్రీ మస్జిదులోనికి ప్రవేశించ రాదు అని తెలుస్తున్నది.

ఆమెకు ఏ వస్తువునైనా తాకడానికి, కడగడానికి, ఆరబెట్టడానికి అనుమతి ఉంది - తలంటుట మరియు తల వెంట్రుకలు దువ్వుట మొదలైనవన్ని కూడా ఇందులో ఉన్నాయి.

ఇందులో తన భార్య పట్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అన్యొన్యత తెలుస్తున్నది.

التصنيفات

నికాహ్ విషయంలో మరియు తన ఇంటి వారితో సత్ప్రవర్తన విషయంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్దతి (మార్గం)