“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు ఆచరించునపుడు (సజ్దాలో) తన రెండు చేతులను (నేలపై) తన శరీరపు రెండు ప్రక్కల…

“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు ఆచరించునపుడు (సజ్దాలో) తన రెండు చేతులను (నేలపై) తన శరీరపు రెండు ప్రక్కల నుండి దూరంగా ఉంచేవారు, ఎంతగా అంటే వారి చంకల తెల్లదనము కనిపించేది.”

అబ్దుల్లాహ్ ఇబ్న్ మాలిక్ ఇబ్న్ బుహైనహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు ఆచరించునపుడు (సజ్దాలో) తన రెండు చేతులను (నేలపై) తన శరీరపు రెండు ప్రక్కల నుండి దూరంగా ఉంచేవారు, ఎంతగా అంటే వారి చంకల తెల్లదనము కనిపించేది.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు’లో సజ్దాహ్ చేసినపుడు, సజ్దాహ్ స్థితిలో తన రెండు చేతులను దూరంగా విశాలంగా నేలపై ఆనించేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కుడి చేతిని కుడి పక్క నుండి, ఎడమ చేతిని ఎడమ ప్రక్క నుండి, పరిచిన రెక్కల మాదిరిగా దేహానికి దూరంగా ఉంచేవారు – ఎంతగా అంటే వారి చంకల చర్మపు ఛాయ కనిపించేది. ఇక్కడ ‘పరిచిన రెక్కల మాదిరి’ అనడంలో అతిశయోక్తి ఉన్నది, అంటే రెండు చేతులను దేహపు రెండు ప్రక్కల నుండి దూరంగా ఉంచడం అనే విషయం అర్థం కావడం కొరకే.

فوائد الحديث

నమాజు లో సజ్దాహ్ స్థితిలో చేతులను ఈ విధంగా దేహపు రెండు ప్రక్కల నుండి దూరంగా ఉంచడం అభిలషణీయము.

ఇమామ్ వెనుక సలాహ్ ఆచరిస్తున్నపుడు, సజ్దాహ్ స్థితిలో చేతులను ఈ విధంగా విశాలంగా శరీరపు రెండు ప్రక్కలకు దూరంగా ఉంచడం ప్రక్కనున్న వారికి ఇబ్బంది కలిగిస్తుంది. కనుక ఇది ఇమామ్ వెనుక నమాజు ఆచరించే వ్యక్తి కొరకు కాదు.

సజ్దాహ్ స్థితిలో చేతులను శరీరపు రెండు ప్రక్కలనుండి దూరంగా ఉంచడంలో ప్రయోజనాలు మరియు దాని వెనుక జ్ఞానానికి సంబంధించిన కారణాలు అనేకం ఉన్నాయి, వాటిలో కొన్ని: ఇందులో శక్తి మరియు ఉత్సాహంతో నమాజు ఆచరించే సామర్థ్యం, నమాజు పట్ల మన ఇఛ్ఛ కనిపిస్తాయి. సజ్దాహ్’లో భూమికి తాకవలసిన అన్ని అంగములపై సజ్ధా చేయుట, ఆయా అంగములకు వాటి హక్కును చెల్లించినట్లు అవుతుంది; దీని వెనుక ఉన్న జ్ఞానానికి సంబంధించి మరొక విషయం ఏమిటంటే ఆ విధంగా సజ్దాహ్ చేయడం వినయాన్ని, అణకువను సూచిస్తుంది; నుదుటిని మరియు ముక్కును నేలకు ఆనించడంలో ఈ విషయం మరింత ప్రభావ వంతంగా కనిపిస్తుంది; మరియు సజ్దహ్ చేసే ప్రతి అంగమూ దానికదే గుర్తించబడుతుంది.

التصنيفات

నమాజు విషయంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్దతి (మార్గం)