“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పది రకాతులు నాకు గుర్తున్నాయి

“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పది రకాతులు నాకు గుర్తున్నాయి

అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పది రకాతులు నాకు గుర్తున్నాయి. జుహ్ర్ నమాజుకు ముందు రెండు రకాతులు, (జుహ్ర్ నమాజు) తరువాత రెండు రకాతులు, మగ్రిబ్ నమాజు తరువాత వారు తన ఇంటిలో రెండు రకాతులు ఆచరించుట, మరియు ఇషా నమాజు తరువాత వారు తన ఇంటిలో రెండు రకాతులు ఆచరించుట, మరియు ఫజ్ర్ నమాజుకు ముందు రెండు రకాతులు ఆచరించుట నాకు గుర్తున్నాయి, మరియు ఆ సమయములో ఎవరూ ఆయన ఉన్న ఇంటిలో ప్రవేశించేవారు కారు.

[దృఢమైనది] [ముత్తఫఖున్ అలైహి బిజమీయి రివాయాతిహి]

الشرح

ఈ హదీసులో అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా : ‘స్వచ్ఛందంగా ఆచరించే నమాజులలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి తాను పది రకాతుల నమాజులను గుర్తుంచుకున్నానని, వాటిని సునన్ అర్’రవాతిబ్ అంటారని’ వివరిస్తున్నారు. అవి: జుహ్ర్ సలాహ్ (నమాజు)కు ముందు రెండు రకాతులు, జుహ్ర్ నమాజు తరువాత రెండు రకాతులు, మగ్రిబ్ నమాజు తరువాత తన ఇంటిలో రెండు రకాతులు, ఇషా నమాజు తరువాత తన ఇంటిలో రెండు రకాతులు, మరియు ఫజ్ర్ నమాజుకు ముందు రెండు రకాతులు. ఆవిధంగా అవి మొత్తం పది రకాతులు. అలాగే జుమా దినము నాడు (శుక్రవారము నాడు) జుమా నమాజు తరువాత రెండు రకాతులు ఆయన (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరించేవారు.

فوائد الحديث

ఇందులో స్వచ్ఛందంగా ఆచరించే నమాజుల పట్ల శ్రధ్ధ వహించాలని హితబోధ ఉన్నది.

అలాగే సున్నతు నమాజులను ఇంటిలో కూడా ఆచరించవచ్చును అనుటకు ఇందులో అనుమతి లభిస్తున్నది.

التصنيفات

నఫిల్ నమాజ్, నమాజు విషయంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్దతి (మార్గం), నికాహ్ విషయంలో మరియు తన ఇంటి వారితో సత్ప్రవర్తన విషయంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్దతి (మార్గం)