إعدادات العرض
నిశ్చయంగా, మీలో ఒకరి సృష్టి అతని తల్లి కడుపులో నలభై రోజులు నీటి బిందువు (స్పెర్మ్)గా సేకరించబడుతుంది
నిశ్చయంగా, మీలో ఒకరి సృష్టి అతని తల్లి కడుపులో నలభై రోజులు నీటి బిందువు (స్పెర్మ్)గా సేకరించబడుతుంది
అబూ అబ్దుర్రహ్మాన్ అబ్దుల్లాహ్ ఇబ్నె మస్ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: "రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మాతో ఇలా పలికినారు, మరియు ఆయన ఎల్లప్పుడూ సత్యమే పలికిన సత్యవంతుడు: "నిశ్చయంగా, మీలో ఒకరి సృష్టి అతని తల్లి కడుపులో నలభై రోజులు నీటి బిందువు (స్పెర్మ్)గా సేకరించబడుతుంది, ఆ తర్వాత అదే విధంగా నలభై రోజులు ఒక గడ్డ కట్టిన రక్తం ముద్దగా (అలఖగా) మారుతుంది, ఆ తర్వాత అదే విధంగా నలభై రోజులు ఒక మాంసపు ముద్దగా (ముద్’గహ్) మారుతుంది. అప్పుడు ఒక దైవదూతను దాని వైపు పంపబడతాడు, ఆ దైవదూత దానిలో ఆత్మను ఊదుతాడు. మరియు నాలుగు విషయాలను వ్రాయమని ఆజ్ఞాపించబడతాడు: దాని జీవనాధారం (పోషణ, రిజ్’ఖ్), దాని ఆయుష్షు (అజల్), దాని ఆచరణలు (అమల్), మరియు అది దురదృష్టమైనదా లేదా అదృష్టమైనదా అని." అల్లాహ్ పై ప్రమాణం! ఆయన తప్ప వేరే ఆరాధ్యుడు లేడు! నిశ్చయంగా, మీలో ఒకరు స్వర్గవాసుల పనులు చేస్తూ ఉంటారు, చివరికి స్వర్గానికి అతనికి మధ్య కేవలం ఒక మూర దూరం మాత్రమే మిగిలి ఉంటుంది. అప్పుడు అతని కోసం వ్రాయబడినది అతనిపై ఆధిక్యత సాధించడం వలన, అతడు నరకవాసుల పనులు చేస్తాడు మరియు అందులో (నరకంలో) ప్రవేశిస్తాడు. మరియు నిశ్చయంగా, మీలో ఒకరు నరకవాసుల పనులు చేస్తూ ఉంటారు, చివరికి నరకానికి అతనికి మధ్య కేవలం ఒక మూర దూరం మాత్రమే మిగిలి ఉంటుంది. అప్పుడు అతని కోసం వ్రాయబడినది అతడిపై ఆధిక్యత సాధించడం వలన, అతడు స్వర్గవాసుల పనులు చేస్తాడు మరియు అందులో (స్వర్గంలో) ప్రవేశిస్తాడు.""
الترجمة
العربية Español አማርኛ English اردو Indonesia বাংলা Français Türkçe Русский Bosanski සිංහල हिन्दी 中文 فارسی Tiếng Việt Tagalog Kurdî Hausa Português മലയാളം Kiswahili தமிழ் မြန်မာ ไทย Deutsch پښتو অসমীয়া Shqip Nederlands ગુજરાતી Кыргызча नेपाली Lietuvių دری Српски тоҷикӣ Kinyarwanda Română Magyar Čeština Moore Malagasy Oromoo ಕನ್ನಡ Wolof Azərbaycan O‘zbek Українська ქართული Македонски ភាសាខ្មែរ Bambara ਪੰਜਾਬੀ मराठी Kirundi Kurmancî Bahasa Melayuالشرح
ఈ హదీథులో ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హుమా ఇలా అంటున్నారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాకు ఒక విషయం తెలియ జేసారు. ఆయన సత్యసంధుడూ, అత్యంత విశ్వసనీయుడూ, అలా అని అల్లాహ్ కూడా ధృవపరిచినాడు. ఆయన ఇలా అన్నారు: మీలో ప్రతి ఒక్కరి సృష్టి (దానికి కావలసిన విషయాల) సమీకరణ ద్వారా జరుగుతుంది. మనిషి తన భార్యతో సంభోగించినపుడు ఆమె గర్భములో చిందిన అతడి వీర్యము నుండి ఒక ‘నుత్ఫహ్’ (వీర్యములో ఫలవంతమైన చిన్న భాగము) నలభై దినములలో సమీకరించబడుతుంది. తరువాత అది ఒక జలగ మాదిరి గోచరించే, మరియు స్తబ్దముగా ఉన్న మందమైన రక్తపు ముద్దగా మారుతుంది. ఇది రెండవ నలభై దినముల కాలములో జరుగుతుంది. తరువాత అది మందముగా, దొడ్డుగా ఉండే, మరియు నమల బడిన ఒక మాంసపు ముద్దగా అవుతుంది. ఇది మూడవ నలభై దినముల కాలములో జరుగుతుంది. తరువాత, చివరి నలభై దినములలో చివరి భాగము ముగిసిన తరువాత అతని లోనికి ఆత్మను ఊదడానికి అల్లాహ్ ఒక దైవదూతను పంపుతాడు. ప్రభువైన అల్లాహ్ అతనికి సంబంధించి నాలుగు ఆజ్ఞలు రాయమని ఆ దైవదూతను ఆదేశిస్తాడు: అతని జీవనోపాధిని గురించి – అతడి జీవిత కాలములో అల్లాహ్ అనుగ్రహాల నుండి ఏ అనుగ్రహాలను ఎంత మొత్తములో పొందుతాడు అనే వాటి గురించి; అతడి జీవితకాలమును గురించి – ఈ ప్రపంచములో అతడు ఎంతకాలము నివసిస్తాడు అనే విషయము. అతడి ఆచరణలను గురించి – అతడు ఎలాంటి వాడు? అవినీతిపరుడా, చెడ్డవాడా; లేక ధన్య జీవా (పుణ్యాత్ముడా) అనే విషయం. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒట్టు పెట్టుకుని మరీ ఇలా అన్నారు – నిశ్చయంగా ఒక మనిషి స్వర్గవాసుల ఆచరణలను చేస్తూ ఉంటాడు. అతడు చేసేవన్నీ మంచిపనులు, సత్కార్యాలు అయి ఉంటాయి. ప్రజలకు అలాగే కనపడుతాడు. ఆ విధంగా అతడు ఎంత వరకూ అలా ఉంటాడూ అంటే, భూమి నుండి అతనికీ స్వర్గానికీ మధ్య కేవలం ఒక మూర అంత దూరం మాత్రమే మిగిలి ఉంటుంది. అపుడు (విధివ్రాత) గ్రంథములో అతని కొరకు రాయబడిన ‘ఖద్ర్’ అతడిని అధిగమిస్తుంది. అతడు నరకవాసుల ఆచరణలను ఆచరించడం మొదలు పెడతాడు. అదే అతని ముగింపు అవుతుంది, మరియు అతడు నరకం లోనికి ప్రవేశిస్తాడు. ఎందుకంటే, అతని సదాచరణలు స్వీకరించబడడానికి నియమం ఏమిటంటే అతడు వాటిపై స్థిరంగా ఉండాలి, వాటి నుండి ఇతర ఆచరణలకు మరల రాదు. మరో వైపు, జనులలో నుండి ఒకడు నరకవాసుల ఆచరణలను చేస్తూ ఉంటాడు. ఎంతవరకూ అంటే, ఇక అతడు నరకం లోనికి ప్రవేశిస్తాడు, భూమిపైనుండి అతనికీ నరకానికీ మధ్య కేవలం ఒక మూర దూరం మాత్రమే మిగిలి ఉంటుది. అపుడు (విధివ్రాత) గ్రంథములో అతని కొరకు రాయబడిన ‘ఖద్ర్’ అతడిని అధిగమిస్తుంది. అతడు స్వర్గవాసుల ఆచరణలను ఆచరించడం మొదలు పెడతాడు, మరియు అతడు స్వర్గము లోనికి ప్రవేశిస్తాడు.فوائد الحديث
మానవ సృష్టి దశల వివరణ.
"దైవ నిర్ణయం మరియు విధివ్రాత పట్ల ఈమాన్ (నమ్మకం)"
అంతిమ సాఫల్యానికి సంబంధించి, విషయాలు లేదా ఆచరణల యొక్క గమ్య స్థానము విధి లిఖితములో ముందుగానే ఉన్నదాని వైపునకు ఉంటుంది.
ఇందులో ఆచరణల బాహ్య రూపం చూసి మోసపోవద్దని హెచ్చరిక ఉన్నది; నిశ్చయంగా ఆచరణల నాణ్యత వాటి అంతిమ సాఫల్యంపై ఆధారపడి ఉంటుంది.
