అంతిమ దినంపై విశ్వాసం.

అంతిమ దినంపై విశ్వాసం.

4- “మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ఉన్నాము. రాత్రి ఆయన చంద్రుని వైపు చూసినారు – అంటే పూర్ణ చంద్రుడిని – చూసి ఇలా అన్నారు: @“నిశ్చయంగా మీరు ఏ విధంగానైతే ఈ పూర్ణ చంద్రుడిని చూస్తున్నారో, ఆ విధంగా మీరు మీ ప్రభువును చూస్తారు; ఆయనను (కనులారా) చూడడంలో మీరు ఎటువంటి ఇబ్బందినీ ఎదుర్కొనరు*. కనుక సూర్యుడు ఉదయించడానికి ముందు నమాజును (ఫజ్ర్ నమాజును) మరియు అతడు అస్తమించడానికి ముందు నమాజును (అస్ర్ నమాజును) ఆచరించకుండా ఉండేలా చేసే దేనినైనా, మిమ్మల్ని లొంగదీసుకోకుండా చేయగలిగే సామర్థ్యం మీకు ఉంటే అలా చేయండి (అంటే ఆ నమాజులను వదలకుండా ఆచరించండి)”. తరువాత వారు ఈ ఆయతును పఠించినారు “....వసబ్బిహ్ బిహంది రబ్బిక ఖబ్ల తులూఇష్షంసి వ ఖబ్లల్ గురూబి” (“....మరియు నీ ప్రభువు పవిత్రతను కొనియాడు. ఆయన స్తోత్రాలు చెయ్యి, ప్రతిరోజు సూర్యోదయానికి ముందు మరియు సూర్యాస్తమయానికి ముందు కూడా”) (సూరహ్ ఖాఫ్ 50:39)

6- “నిశ్చయంగా, తీర్పు దినము నాడు నా ఉమ్మత్’ నుండి అల్లాహ్ ఒక వ్యక్తిని ఎన్నుకుని సృష్టి అంతటి ముందు హాజరు పరుస్తాడు*. అతడి ముందు (చెడు కర్మలు రాయబడిన) తొంభైతొమ్మిది దస్తావేజులు పరుచబడతాయి. ఒక్కొక్కటి కంటిచూపు మేర దూరమంత పెద్దవిగా ఉంటాయి. అప్పుడు ఆయన (అల్లాహ్) ఇలా పలుకుతాడు “వీటిలో ఏ ఒక్కదానినైనా నిరాకరించగలవా నీవు? వీటిని రాసిన వారు (తప్పుగా రాసి) నీకు ఏమైనా అన్యాయం చేసినారా?” దానికి అతడు “లేదు నా ప్రభూ!” అంటాడు. అపుడు ఆయన “మరి నీ వద్ద జావాబు ఏమైనా ఉందా?” అని అడుగుతాడు. దానికి అతడు “లేదు నా ప్రభూ!” అంటాడు. అపుడు అల్లాహ్ “నిశ్చయంగా మావద్ద నీవు చేసిన ఒక మంచి పని ఉన్నది. ఈ దినము నీకు ఎటువంటి అన్యాయమూ జరుగదు” అని ఒక పత్రాన్ని బయటకు తీస్తాడు. దానిపై “అష్’హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్, వ అష్’హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు” (నేను సాక్ష్యమిస్తున్నాను అల్లహ్ తప్ప వేరే నిజ ఆరాధ్యుదు ఎవరూ లేరు, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన యొక్క దాసుడు మరియు సందేశహరుడు”). అల్లాహ్ అతనితో “నీ కర్మల త్రాసును తీసుకురా” అంటాడు. దానికి అతడు “ఓ నా ప్రభూ! నా పాపపు పనుల ఈ చిట్ఠాల (బరువు) ముందు ఈ కాగితం ముక్క ఏమి పనికి వస్తుంది?” అంటాడు. అపుడు ఆయన “ఈ దినము నీకు ఎలాంటి అన్యాయం జరుగదు” అని బదులిస్తాడు. పాపపు కర్మల చిట్ఠాలు త్రాసులో ఒక పళ్ళెంలో ఉంచబడతాయి. మరొక పళ్ళెం లో ఆ పత్రం ఉంచబడుతుంది. పాపపు కర్మ చిట్టాలు తేలికగా పైకి లేచిపోతాయి. ఆ పత్రం మహా బరువుగా తూగుతుంది. ఎందుకంటే అల్లాహ్ పేరు కంటే బరువైనది ఏదీ లేదు”.

7- “అల్లాహ్ స్వర్గమును మరియు నరకమును సృష్టించినపుడు, జిబ్రయీల్ అలైహిస్సలాం* ను స్వర్గము వైపునకు పంపుతూ ఇలా అన్నాడు “దానిని చూడు, మరియు దాని నివాసుల కొరకు నేను ఏమేమి తయారు చేసి ఉంచానో కూడా చూడు”. ఆయన స్వర్గానికి వెళ్ళి దానిని చూసాడు, మరియు అల్లాహ్ అందులో ఏమేమి తయారు చేసి ఉంచినాడో చూస్తాడు. (తిరిగి వచ్చి) జిబ్రయీల్ అలైహిస్సలాం ఇలా అంటాడు “నీ ఘనత సాక్షిగా, దాని గురించి విన్న వారు ఎవరైనా దాని లోనికి ప్రవేశించాలని తప్ప మరేమీ కోరుకోరు.” అల్లాహ్ తన ఆదేశముతో స్వర్గాన్ని (స్వర్గంలో చేరే మార్గాన్ని) కఠిన పరిస్థితులు, కష్టాలు, కడగండ్లు, శ్రమ, ప్రయాస మొదలైనవి చుట్టుకుని ఉండేలా చేసాడు. అపుడు (జిబ్రయీల్ అలైహిస్సలాంతో) అల్లాహ్ ఇలా అన్నాడు “తిరిగి వెళ్ళు, దానిని చూడు, మరియు దాని నివాసుల కొరకు నేను ఏమేమి తయారు చేసి ఉంచానో కూడా చూడు.” కనుక ఆయన (జిబ్రయీల్) స్వర్గానికి తిరిగి వెళ్ళాడు. స్వర్గము కఠిన పరిస్థితులు, కష్టాలు, కడగండ్లతో చుట్టుకుని ఉండడం చూసాడు. అతడు అల్లాహ్ వద్దకు వచ్చి ఇలా అన్నాడు “నీ ఘనత సాక్షిగా, ఎవరూ అందులోనికి ప్రవేశించలేరు.” అపుడు అల్లాహ్ ఆయనతో “నరకానికి వెళ్ళు, దానిని చూడు, మరియు దాని నివాసుల కొరకు నేను ఏమేమి తయారు చేసి ఉంచానో కూడా చూడు” అన్నాడు. ఆయన దానిని వెళ్ళి చూసాడు. (అది ఎన్నో భాగాలుగా ఉంది) దాని ఒక భాగము మరొక భాగముపై పేర్చబడి ఉన్నది. ఆయన తిరిగి వచ్చి “నీ ఘనత సాక్షిగా, ఎవరూ దానిలోనికి ప్రవేశించరు” అన్నాడు. అపుడు అల్లాహ్ తన ఆదేశముతో నరకాన్ని వాంఛలు, కోరికలు మొదలైనవి చుట్టుకుని ఉండేలా చేసాడు. తరువాత జిబ్రయీల్ అలైహిస్సలాంతో అల్లాహ్ ఇలా అన్నాడు “తిరిగి వెళ్ళు, దానిని చూడు, మరియు దాని నివాసుల కొరకు నేను ఏమేమి తయారు చేసి ఉంచానో కూడా చూడు.” ఆయన వెళ్ళి దానిని చూసాడు. అది వాంఛలు, కోరికలతో ఆవరించబడి ఉన్నది. ఆయన తిరిగి వచ్చి “నీ ఘనత సాక్షిగా! అందులోనికి వెళ్ళి పడిపోవడం తప్ప, దాని నుండి ఎవరూ తప్పించుకోలేరు అని భయంగా ఉన్నది” అన్నాడు.

11- “దజ్జాల్ ను గురించి అల్లాహ్ యొక్క ఏ ప్రవక్త కూడా తన జాతి జనులకు చెప్పని ఒక విషయాన్ని నేను మీకు చెప్పనా? అతడు ఒంటికన్ను వాడు; అతడు తన వెంట స్వర్గాన్నీ మరియు నరకాన్నీ పోలిన దానిని తీసుకుని వస్తాడు*. అయితే అతడు దేనినైతే స్వర్గం అని అంటాడో (వాస్తవానికి) అది నరకం. కనుక నూహ్ అలైహిస్సలాం తన జాతి జనులను ఏ విధంగానైతే హెచ్చరించినాడో నేనూ ఆ విధంగా మిమ్ములను హెచ్చరిస్తున్నాను.”

14- “(చనిపోయిన తరువాత) సమాధిలో ఒక ముస్లిం ప్రశ్నించబడినపుడు అతడు “అష్’హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్” (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు వేరే ఎవ్వరూ లేరు, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను” అని సాక్ష్యమిస్తాడు*. ఇది ఖుర్’ఆన్ లో అల్లాహ్ వాక్కు యొక్క వివరణ: “యుథబ్బితు ల్లాహుల్లదీన ఆమనూ బిల్’ఖౌలి థ్థాబితి ఫిల్ హయాతిద్దున్యా వఫిల్ ఆఖిరతి” (సూరహ్ ఇబ్రాహీం 14:27) [“మహోన్నతుడైన అల్లాహ్ ఈ వాక్యం ద్వారా విశ్వసించిన వారిని ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ దృఢంగా ఉంచుతాడు.”]

15- “తీర్పు దినమున ఒక విశ్వాసి సర్వశక్తిమంతుడైన తన ప్రభువు దగ్గరికి తీసుకురాబడతాడు, మరియు ఆయన అతనికి తన కనఫహ్ (దాచి ఉంచుట) ను ప్రసాదిస్తాడు (అతడిని మిగతా వారి నుండి మరుగు పరుస్తాడు) తరువాత అతని పాపాలను ఒప్పుకునేలా చేస్తాడు*, అల్లాహ్ అతనితో ఇలా అంటాడు: “(నువ్వు ఈ విధంగా చేసావు) నీకు తెలుసు కదా!” దానికి అతడు “ఓ నా ప్రభూ! అవును (నేను చేసాను) నాకు తెలుసు” అంటాడు. అపుడు అల్లాహ్ ఇలా అంటాడు: “నిశ్చయంగా నేను వాటిని నీ కొరకు ఇహలోకంలో దాచి ఉంచినాను, మరియు ఈ దినము నీ కొరకు వాటిని క్షమించినాను.” మరియు అతనికి అతని సత్కార్యాల చిట్ఠా ఇవ్వబడుతుంది. సత్యతిరస్కారులు మరియు కపటుల విషయానికొస్తే, వారు సమస్త సృష్టి ముందు పిలవబడతారు: వీరే అల్లాహ్ పై అబద్ధం చెప్పినవారు.”

16- “పునరుత్థాన దినము నాడు, కొన్ని విషయాలను గురించి ప్రశ్నించనంత వరకు, మానవుడి కాళ్ళు అతడు నిలుచుని ఉన్నచోటు నుండి ఏమాత్రమూ కదలవు – అతడి జీవితాన్ని గురించి – అతడు దానిని ఎందులో గడిపినాడు అని; అతడి జ్ఞానాన్ని గురించి – అతడు దానిని ఏ విధంగా ఉపయోగించినాడు అని; అతడి సంపదను గురించి – ఎక్కడి నుండి సంపాదించినాడు అని, మరియు దానిని ఎక్కడ ఖర్చు చేసినాడు అని; మరియు అతడి శరీరాన్ని గురించి – అతడు దానిని ఏ విధంగా పరిసమాప్తి గావించినాడు (ఏ విధంగా ఉపయోగించినాడు) అని.

17- “మీకు తెలుసా పేదవాడు అంటే ఎవరో?*” అక్కడ ఉన్న వారు ఇలా అన్నారు: “మాలో పేదవాడు అంటే ధనము లేనివాడు మరియు ఆస్తిపాస్తులు లేనివాడు”. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “నిశ్చయంగా నా ఉమ్మత్ (ముస్లిం సమాజము) యొక్క అసలైన పేదవాడు ఎవరంటే – అతడు పునరుథ్థాన దినమున నమాజులతో, ఉపవాసాలతో, దానధర్మాలు, జకాతు దాతృత్వాలతో వస్తాడు; అయితే వీటన్నింటితో పాటు అతడు ఒకరిని అన్యాయంగా అవమానించి ఉంటాడు; మరొకరిని అకారణంగా దూషించి ఉంటాడు; ఇంకొకరి సంపదను అన్యాయంగా తినేసి ఉంటాడు; ఒకరి రక్తాన్ని అధర్మంగా చిందించి ఉంటాడు; మరొకరిని అకారణంగా కొట్టి ఉంటాడు. అతడు వీటన్నింటితో పాటు కూడా వస్తాడు. అణచివేతకు గురిచేయబడిన ప్రతి ఒక్కరికి ఇతని మంచి పనుల నుండి ఇవ్వబడుతుంది. అంతేగాక ఒకవేళ న్యాయం పూర్తిగాక ముందే ఇతని మంచి పనులు అయిపోతే, అణచివేతకు గురి అయిన వారి పాపాలలో కొన్ని ఇతనిపై వేయబడతాయి మరియు అతడు నరకాగ్నిలో పడవేయబడతాడు.”

18- “బంగారము మరియు వెండి కలిగి ఉన్న సొంతదారుడు ఎవరైనా వాటి హక్కును (జకాతును) చెల్లించనట్లయితే, తీర్పు దినమున అవి పలకలుగా మార్చబడి నరకాగ్నిలో బాగా కాల్చబడతాయి.* వాటితో అతని పక్కలపై, నుదుటిపై, వీపుపై వాతలు పెట్టడం జరుగుతుంది. అవి చల్లారితే వాటిని తిరిగి ఎర్రగా కాల్చడం జరుగుతుంది (తిరిగి అతడిని ఆ విధంగా శిక్షించడం జరుగుతుంది). అప్పుడు ఒక దినము యాభైవేల సంవత్సరాలంత సుదీర్ఘంగా ఉంటుంది. ఆ శిక్ష అల్లాహ్ తన దాసుల మధ్య తీర్పు చేసేటంత వరకూ కొనసాగుతూ ఉంటుంది. తరువాత అతడు అతని గమ్యస్థానమైన స్వర్గం వైపునకో లేక నరకం వైపునకో మార్గం చూసుకుంటాడు (చూపడం జరుగుతుంది).

19- “ఎవరైతే అజాన్ (నమాజు కొరకు ఇవ్వబడే పిలుపు) విన్న తరువాత ఈ పలుకులు “అల్లాహుమ్మ, రబ్బహాదిహిద్ద’వతిత్తామ్మహ్, వస్సలాతిల్ ఖాఇమహ్, ఆతి ముహమ్మదన్ అల్’వసీలత, వల్ ఫజీలత, వబ్’అథ్’హు మఖామన్ మహ్’మూదన్ అల్లదీ వ అద్’తహు” (ఓ అల్లాహ్! ఈ పరిపూర్ణ పిలుపునకు మరియు స్థాపించబడబోయే ఈ నిత్య నమాజు పిలుపునకు ఓ ప్రభువా! దయచేసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు (తీర్పు దినమున) స్వర్గంలో ఆయనకు తప్ప మరెవరికీ లభించని అత్యున్నత స్థానమును మరియు ఆధిక్యతను ప్రసాదించు, మరియు (తీర్పు దినమున) నీవు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు వాగ్దానం చేసిన స్వర్గంలో శ్రేష్ఠమైన మరియు మరియు అత్యున్నతమైన స్థానానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంను పంపు) అని పలుకుతాడో తీర్పు దినమున అతనికి నా మధ్యవర్తిత్వం ఖచ్చితంగా లభిస్తుంది."

22- “ప్రళయదినపు సంకేతాలలో – ఙ్ఞానము (భూమి నుండి) లేపు కోబడుతుంది, అఙ్ఞానము విపరీతముగా వ్యాప్తి చెందుతుంది, వ్యభిచారము విపరీతముగా వ్యాప్తి చెందుతుంది, సారా త్రాగుట సర్వసాధారణం అవుతుంది, పురుషులు సంఖ్యలో తగ్గిపోతారు, అదే స్త్రీలు (సంఖ్యలో) పెరిగి పోతారు; ఎంతగా అంటే యాభై మంది స్త్రీలకు (వారి మంచి చెడులు చూడడానికి) ఒక పురుషుడు మాత్రమే ఉంటాడు”.

31- “నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇలా అన్నాను “మరి (నీటి హౌజు లోని ఆ నీటిని త్రాగే) కప్పుల మాటేమిటి?” దానికి ఆయన ఇలా అన్నారు: @“ముహమ్మద్ యొక్క ప్రాణం ఎవరి చేతిలోనైతె ఉన్నదో ఆయన సాక్షిగా; మబ్బులు లేని నల్లని ఆకాశంలోని నక్షత్రాలకన్నా, అందులోని గ్రహాల కన్నా, ఆ కప్పులు మిక్కిలి అధిక సంఖ్యలో ఉంటాయి*. అవి స్వర్గపు పాత్రలు. ఎవరైతే దాని నుండి (ఆ నీటి హౌజు నుండి) నీటిని త్రాగుతాడో, అతడు ఇంకెన్నడూ దాహానికి లోను కాడు. అందులో స్వర్గపు రెండు ధారలు ప్రవహిస్తూ ఉంటాయి. దాని నుండి నీటిని త్రాగిన వారెవ్వరికీ తిరిగి దాహం వెయ్యదు. ఆ నీటి తొట్టి వెడల్పు దాని పొడవు అంత ఉంటుంది; అమ్మాన్ మరియు ఆయిలహ్’ల మధ్య దూరమంత. దాని నీరు పాలకన్నా తెల్లగా మరియు తేనె కన్నా మధురంగా ఉంటాయి”.

32- “(తీర్పు దినమున) మృత్యువు నల్లని తల, తెల్లని శరీరం కలిగిన ఒక గొర్రెపోతు రూపంలో తీసుకు రాబడుతుంది*. అపుడు పిలుపునిచ్చు వాడొకడు ఎలుగెత్తి “ఓ స్వర్గవాసులారా!” అని పిలుపునిస్తాడు. అపుడు వారు తమ మెడలను సారించి అతని వైపునకు జాగ్రత్తగా చూస్తారు. అతడు “ఇదేమిటో మీకు తెలుసా?” అని వారిని అడుగుతాడు. దానికి వారు “తెలుసు, అది మృత్యువు” అంటారు, ఎందుకంటే, నిశ్చయంగా దానిని వారు ముందే చూసి ఉన్నారు కనుక. అపుడు తిరిగి పిలుపు ఇవ్వబడుతుంది “ఓ నరకవాసులారా!”. దానితో వారు తమ మెడలను సారించి అతని వైపునకు జాగ్రత్తగా చూస్తారు. అతడు “ఇదేమిటో మీకు తెలుసా?” అని వారిని అడుగుతాడు. దానికి వారు “తెలుసు, అది మృత్యువు” అంటారు, ఎందుకంటే, నిశ్చయంగా దానిని వారు ముందే చూసి ఉన్నారు కనుక. అపుడు దానిని (గొర్రెపోతు రూపములో ఉన్న మృత్యువును) జిబహ్ చేయుట జరుగుతుంది. అపుడు ఆ పిలిచేవాడు ఇలా అంటాడు “ఓ స్వర్గవాసులారా! మీకు ఇది (స్వర్గము) శాశ్వతము, మరియు (మీకు) మృత్యువు లేదు; ఓ నరకవాసులారా! మీకు ఇది (నరకము) శాశ్వతము, మరియు మీకు మృత్యువు లేదు.” తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయతును పఠించినారు “ {وَأَنْذِرْهُمْ يَوْمَ الحَسْرَةِ إِذْ قُضِيَ الأَمْرُ وَهُمْ فِي غَفْلَةٍ} (సూరహ్ మర్యం:39) (మరియు వారిని (రాబోయే) ఆ పశ్చాత్తాప పడవలసిన దినాన్ని గురించి హెచ్చరించు. అప్పుడు పరిణామం నిర్ణయించబడి ఉంటుంది. (ఇప్పుడైతే) వారు ఏమరుపాటులో పడి ఉన్నారు....”) అని ఇంతవరకు పఠించి “(అవును) ఈ ప్రాపంచిక జీవితములో పడి కొట్టుకు పోతున్నవారు ఏమరపాటులో పడి ఉన్నారు” అన్నారు. తరువాత ఆ ఆయతు చివరి భాగము (وَهُمْ لاَ يُؤْمِنُونَ) (కావున వారు విశ్వసించడం లేదు) (సూరహ్ మర్యం:39) పఠించి పూర్తి చేసినారు.

33- “మీ ఈ (ప్రపంచపు) అగ్ని, నరకాగ్ని యొక్క డెభ్భై భాగాలలో ఒకటి*.” అది విని మాలో ఒకరు “ఓ రసూలుల్లాహ్! (అవిశ్వాసులను శిక్షించడానికి) ఈ అగ్ని సరిపోతుంది కదా!” అని అడిగారు. దానికి ఆయన “ఈ అగ్ని కంటే నరకాగ్ని ఇంకా అరవై తొమ్మిది భాగాలు ఎక్కువ ఉంటుంది. దాని ప్రతి భాగమూ ఈ అగ్ని అంత వేడిని కలిగి ఉంటుంది” అన్నారు.

34- “సత్యసంధుడూ, అత్యంత విశ్వసనీయుడూ అయిన రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మాతో ఇలా అన్నారు “మీలో ప్రతి ఒక్కరి సృష్టి అతడి తల్లి గర్భములో నలభై దినములు, నలభై రాత్రులు (అతడి శరీరానికి కావలసిన వాటిని) సమీకరించడం ద్వారా జరుగుతుంది*. తరువాత అంతే కాలము కొరకు (40 దినముల కొరకు) అతడు ఒక రక్తపు ముద్దలా అవుతాడు. తరువాత అతడు అంతే కాలం కొరకు ఒక మాంసపు ముద్దలా అవుతాడు. అపుడు (అల్లాహ్ తరఫున) ఒక దైవదూత అతని వద్దకు పంపబడతాడు. అతడు నాలుగు విషయాలు రాయుట కొరకు ఆఙ్ఞాపించ బడతాడు; అతడి జీవనోపాధి, అతని జీవనకాలము (అతడు ఎంత కాలం జీవిస్తాడు, ఎప్పుడు మరణిస్తాడు), అతడి ఆచరణలు మరియు అతడు చెడ్డవాడా లేక ధన్యజీవియా అనే విషయాలు. అపుడు అతని లోనికి ఆత్మ ఊదబడుతుంది. మీలో ఎవరైనా స్వర్గవాసుల లక్షణమైన సత్కార్యాలు అంత వరకు చేస్తూ ఉంటాడు, ఎంతవరకూ అంటే అతనికీ స్వర్గానికీ మధ్య కేవలం ఒక మూరెడు దూరం మాత్రమే మిగిలి ఉంటుంది. అపుడు అతడి కొరకు రాయబడినది అతడిని అధిగమిస్తుంది. అపుడు అతడు నరకవాసుల ఆచరణలను ఆచరించడం మొదలు పెడతాడు, మరియు నరకాగ్ని లోనికి ప్రవేశిస్తాడు. అలాగే మీలో ఎవరైనా నరకవాసుల లక్షణమైన పాపకార్యాలు అంత వరకు చేస్తూ ఉంటాడు, ఎంతవరకూ అంటే అతనికీ నరకానికీ మధ్య కేవలం ఒక మూరెడు దూరం మాత్రమే మిగిలి ఉంటుంది. అపుడు అతడి కొరకు రాయబడినది అతడిని అధిగమిస్తుంది. అపుడు అతడు స్వర్గవాసుల ఆచరణలను ఆచరించడం మొదలు పెడతాడు, మరియు దాని లోనికి ప్రవేశిస్తాడు.

35- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదో విషయాన్ని చెబుతూ చివరన “అది (ఈ ప్రపంచము నుండి) ఙ్ఞానము అంతరించి పోయినపుడు జరుగుతుంది*” అన్నారు. నేను “ఓ రసూలుల్లాహ్ (ల్లల్లాహు అలైహి వసల్లం ! ఙ్ఞానము ఎలా అంతరించి పోతుంది. మేము ఖుర్’అన్ చదువు తున్నాము, మా పిల్లలకు బోధిస్తున్నాము, వారు వారి సంతానికి నేర్పుతారు. అలా తీర్పు దినము వరకు జరుగుతుంది. మరి ఙ్ఞానము ఎలా అంతరించిపోతుంది?” అన్నాను. దానికి వారు ఇలా అన్నారు “నీ తల్లి నిన్ను కోల్పొవు గాక, ఓ జియాద్! ఈ మదీనా నగరంలో నువ్వొక మంచి ఙ్ణానవంతుడవని, మంచి పరిఙ్ఞానం కలిగిన వాడివి అని అనుకున్నాను. యూదులూ మరియు క్రైస్తవుల విషయంలో ఇలా జరగ లేదా, వారు తౌరాతు మరియు ఇంజీలు గ్రంథాలను చదువుతారు ఐనా వాటిలోని ఒక్క విషయం పై కూడా ఆచరించరు”.

36- “ఒక మనిషి వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎదురుగా కూర్చుని ఇలా అన్నాడు: “ఓ రసూలుల్లాహ్ ! సల్లల్లాహు అలైహి వసల్లం నా దగ్గ ఇద్దరు బానిసలు ఉన్నారు. వారు నాతో అబద్ధాలు ఆడతారు, నన్ను మోసం చేస్తారు, మరియు నా పట్ల అవిధేయతతో ప్రవర్తిస్తారు. అందుకని నేను వారిని తిట్టే వాడిని, కొట్టే వాడిని. మరి వారికి సంబంధించి (తీర్పు దినమున) నా విషయము ఏమిటి (ఏమి కానున్నది)? దానికి ఆయన ఇలా అన్నారు: “@ నీవు వారిని శిక్షించుట, మరియు వారు నీతో అబధ్ధాలాడుట, నిన్ను మోసగించుట, నీకు అవిధేయులగుట – ఇవన్నీ తూచబడతాయి*. నీ శిక్ష మరియు వారి పాపాలు సమానంగా ఉంటే, ఇద్దరూ సమానంగా పరిగణించబడతారు. అందులో నీ కొరకు ఏమీ లేదు వారికి వ్యతిరేకంగా కూడా ఏమీ ఉండదు. అలాగే నీ శిక్ష వారి పాపాల కంటే ఎక్కువ మోతాదులో ఉంటే, నీ పుణ్యాలలో నుండి కొన్నింటిని నీ నుండి తీసుకుని వారికి ఇవ్వబడతాయి. ఆ మనిషి అక్కడి నుండి లేచి (బయటకు) వెళ్ళిపోయాడు. అక్కడ గట్టిగా ఏడవసాగాడు, దు:ఖించసాగాడు. అది చూసి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతనితో “అల్లాహ్ తన దివ్య గ్రంథములో (ఖుర్’ఆన్ లో) ఏమని అంటున్నాడో నీవు చదవాలి {మరియు పునరుత్థానదినమున మేము సరిగ్గా తూచే త్రాసులను ఏర్పాటు చేస్తాము, కావున ఏ వ్యక్తికి కూడా ఏ మాత్రం అన్యాయం జరుగదు. ఒకవేళ ఆవగింజంత కర్మ ఉన్నా మేము దానిని ముందుకు తెస్తాము. మరియు లెక్కచూడటానికి మేమే చాలు!} (సూరాహ్ అల్ అంబియా 21:47). అప్పుడు ఆ మనిషి ఇలా అన్నాడు: “అల్లాహ్ సాక్షిగా, ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! వారి నుంచి విడిపోవడమే వారిద్దరికీ మరియు నాకూ మంచి చేకూర్చే విషయం. మీరు సాక్ష్యంగా ఉండండి ఆ ఇద్దరు బానిసలను విముక్తి చేస్తున్నాను. ఇక నుండి వారిద్దరూ స్వతంత్రులు”.

37- “అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు మాతో ఇలా అన్నారు: “ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాడు “ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం ! తీర్పు దినమున అవిశ్వాసి తన ముఖము పై (నడిచేలా) ఎలా సమీకరించబడతాడు?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “@ అతడిని ఈ భూమి మీద కాళ్ళపై నడిచేలా చేయగలిగిన శక్తిమంతుడు (అయిన అల్లాహ్), తీర్పు దినమున అతడిని ముఖముపై నడిచేలా చేయలేడా?*” అన్నారు. ఖతాదహ్ ఇలా అన్నారు “అవును, మా ప్రభువు (అయిన అల్లాహ్) గౌరవం సాక్షిగా (ఆయన అలా చేయగల శక్తిశాలి)”.

38- “అప్పుడు, ఆ రోజు మీరు, @(ఈ జీవితంలో అనుభవించిన) సౌఖ్యాలను గురించి తప్పక ప్రశ్నించబడతారు!)* (సూరహ్: అత్-తకాథుర్ 102:8) అనే ఆయతు అవతరించినపుడు, జుబైర్ (ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తో ఇలా పలికారు “ఓ రసూలుల్లాహ్! ఏ సౌఖ్యాలను గురించి ప్రశ్నించడం జరుగుతుంది? మన వద్దనున్న రెండు నల్లని విషయాలు, ఖర్జూరాలు, నీళ్ళు; వాటి గురించా?” అపుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా జవాబిచ్చారు “అవి తప్పనిసరిగా ఉంటాయి.”

40- “ముఅజ్జిన్ అజాన్ పలుకుతున్నపుడు మీరు విన్నట్లయితే, అతను పలుకునట్లుగానే మీరూ పలకండి, తరువాత నాపై శాంతి మరియు శుభాలకొరకు ప్రార్థించండి (దరూద్ పఠించండి)* ఎవరైతే నాపై ఒకసారి దరూద్ పఠిస్తాడో, అల్లాహ్ దానికి పది రెట్లు ఎక్కువగా అతనిపై శాంతి, శుభాలు కురిపిస్తాడు. తరువాత నాకు ‘అల్-వసీలహ్’ ప్రసాదించమని అల్లాహ్ ను వేడుకొనండి. అది (అల్-వసీలహ్) స్వర్గములో ఒక సమున్నతమైన స్థానము. అది కేవలం ఒకరికి మాత్రమే ప్రసాదించబడుతుంది. ఆ ఒక్కరు నేనే కావాలని నా ఆశ. ఎవరైతే నా కొరకు వసీల ప్రసాదించమని ప్రార్థిస్తాడో, (తీర్పు దినము నాడు) అతని కొరకు (అల్లాహ్ వద్ద) సిఫారసు చేయడం నాపై విధి అవుతుంది.”