“తీర్పు దినమున ఒక విశ్వాసి సర్వశక్తిమంతుడైన తన ప్రభువు దగ్గరికి తీసుకురాబడతాడు, మరియు ఆయన అతనికి తన కనఫహ్…

“తీర్పు దినమున ఒక విశ్వాసి సర్వశక్తిమంతుడైన తన ప్రభువు దగ్గరికి తీసుకురాబడతాడు, మరియు ఆయన అతనికి తన కనఫహ్ (దాచి ఉంచుట) ను ప్రసాదిస్తాడు (అతడిని మిగతా వారి నుండి మరుగు పరుస్తాడు) తరువాత అతని పాపాలను ఒప్పుకునేలా చేస్తాడు

సఫ్’వాన్ ఇబ్న్ ముహ్రిజ్ (రహిమహుల్లాహ్) ఉల్లేఖన: “ఒక వ్యక్తి అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ (రదియల్లాహు అన్హు) వద్దకు వచ్చి ఇలా అడిగాడు: “ ‘నజ్వా’లో (నజ్వా: రహస్య సమావేశం) రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమి పలుకగా మీరు విన్నారు?” అని. దానికి ఆయన ఇలా అన్నారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “తీర్పు దినమున ఒక విశ్వాసి సర్వశక్తిమంతుడైన తన ప్రభువు దగ్గరికి తీసుకురాబడతాడు, మరియు ఆయన అతనికి తన కనఫహ్ (దాచి ఉంచుట) ను ప్రసాదిస్తాడు (అతడిని మిగతా వారి నుండి మరుగు పరుస్తాడు) తరువాత అతని పాపాలను ఒప్పుకునేలా చేస్తాడు, అల్లాహ్ అతనితో ఇలా అంటాడు: “(నువ్వు ఈ విధంగా చేసావు) నీకు తెలుసు కదా!” దానికి అతడు “ఓ నా ప్రభూ! అవును (నేను చేసాను) నాకు తెలుసు” అంటాడు. అపుడు అల్లాహ్ ఇలా అంటాడు: “నిశ్చయంగా నేను వాటిని నీ కొరకు ఇహలోకంలో దాచి ఉంచినాను, మరియు ఈ దినము నీ కొరకు వాటిని క్షమించినాను.” మరియు అతనికి అతని సత్కార్యాల చిట్ఠా ఇవ్వబడుతుంది. సత్యతిరస్కారులు మరియు కపటుల విషయానికొస్తే, వారు సమస్త సృష్టి ముందు పిలవబడతారు: వీరే అల్లాహ్ పై అబద్ధం చెప్పినవారు.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పునరుత్థాన దినమున విశ్వాసి అయిన తన దాసుడితో అల్లాహ్ జరిపే సన్నిహిత సంభాషణ గురించి తెలియజేస్తూ ఆయన (స) ఇలా అన్నారు: పునరుత్థాన దినమున విశ్వాసి తన ప్రభువు దగ్గరికి తీసుకురాబడతాడు. అపుడు అల్లాహ్ అతడిని మిగతా వారి నుండి మరుగు పరుస్తాడు, అతని రహస్యాలు మిగతావారికి తెలియకుండా ఉండేలా. తరువాత అతనితో అల్లాహ్ ఇలా అంటాడు: “(నువ్వు) ఫలానా, ఫలానా పాపం (చేసినావు) నీకు తెలుసు కదా?” దాసునికీ మరియు అతని ప్రభువుకు మధ్య ఉన్న పాపాలను అతను గుర్తించేలా చేస్తాడు. దానికి అతడు: “అవును ఓ నా ప్రభూ” అని ఒప్పుకుంటాడు. విశ్వాసి భయపడిపోతాడు, అపుడు సర్వ శక్తిమంతుడైన అల్లాహ్, అతనితో ఇలా అంటాడు: నేను ఈ లోకంలో నీ కోసం దానిని కప్పి ఉంచాను మరియు ఈ రోజు నీ కోసం దానిని క్షమించాను. తరువాత అతనికి అతని మంచి పనుల రికార్డు ఇవ్వబడుతుంది. సత్యతిరస్కారికి, కపట విశ్వాసికి సంబంధించి, అందరి ముందు ఇలా అనబడుతుంది: “వీరే తమ ప్రభువుపై అబద్ధం చెప్పినవారు. దుర్మార్గులపై అల్లాహ్ శాపం పడుగాక.”

فوائد الحديث

ఈ హదీథులో ఇహలోకంలో విశ్వాసుల పట్ల అల్లాహ్ కృప మరియు కరుణ, మరియు పరలోకంలో వారి పాపాలను కప్పి ఉంచడం ద్వారా ఆయన కరుణ, కృప చూడవచ్చును.

ఇందులో విశ్వాసి తప్పులను ఎంతగా వీలైతే అంతగా కప్పి ఉంచాలనే హితబోధ ఉన్నది.

దాసుల ప్రభువు దాసులందరి కర్మలను లెక్కిస్తాడు, కాబట్టి ఎవరికైనా మంచి కనిపిస్తే వారు అల్లాహ్‌ను స్తుతించాలి, మరియు ఎవరికైనా మంచిగాక వేరేది కనిపిస్తే అటువంటి వాడు తనను తాను తప్ప మరెవరినీ నిందించకూడదు మరియు అతను అల్లాహ్ ఇష్టానికి లోబడి ఉంటాడు.

ఇమాం ఇబ్న్ హజర్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: "తీర్పు దినమున విశ్వాసులలోని పాపకార్యాలు చేసినవారు రెండు రకాలుగా ఉంటారని సార్వత్రికంగా హదీథులు సూచిస్తున్నాయి. మొదటిది: వారి పాపాలు, వారికి మరియు వారి ప్రభువు మధ్య ఉన్నవారు. ఈ రకం రెండు వర్గాలుగా విభజించబడిందని ఇబ్న్ ఉమర్ (ర) యొక్క హదీథ్ సూచిస్తున్నది: ఒకటి: ఎవరి అవిధేయత, పాపాలు ఈ ప్రపంచములో కప్పివేయబడినాయో ఆ వర్గము. ఈ వర్గాన్ని గురించే ఈ హదీథులోస్పష్టంగా చెప్పబడింది – ఇటువంటి వారి పాపాలను పునరుత్థాన దినమున అల్లాహ్ మిగతా వారి నుండి కప్పివేస్తాడు. రెండవ వర్గము: వీరు బహిరంగంగా అవిధేయతకు, పాపకార్యాలకు పాల్బడేవారు. పునరుత్థాన దినమున వీరి వ్యవహారము, పైన పేర్కోనబడిన వారి వ్యవహారానికి వ్యతిరేకంగా ఉంటుంది.

ఇక రెండవ వర్గం: వీరి అవిధేయత, పాపాలు వీరికీ మరియు అల్లాహ్ యొక్క దాసులకు మధ్య ఉన్నవారు. వీరు కూడా రెండు వర్గాలుగా విభజించబడినారు. మొదటి వర్గం: ఈ వర్గము ఎవరంటే వీరి చెడుపనులు, వీరి మంచి పనులను మించి ఉన్నవారు. వీరు నరకంలో పడిపోతారు, తరువాత సిఫారసు ద్వారా బయటకు తీయబడతారు. రెండవ వర్గం: ఈ వర్గము ఎవరంటే వీరి చెడుపనులు మరియు మంచిపనులు సమానంగా ఉన్నవారు. వీరి మధ్య పరిష్కారము జరిగే వరకు వీరు స్వర్గములో ప్రవేశించలేరు.

التصنيفات

అంతిమ దినంపై విశ్వాసం.